42623
👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
ముగిసిన AP కేబినెట్ సమావేశం..
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్‌కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ కల్పించే ప్రతిపాదనకు పచ్చజెండా..
ముఖ్యమంత్రి పర్యవేక్షణలో జరిగిన సమావేశంలో SGSW సిబ్బందిని వివిధ శాఖలకు డిప్యూటేషన్‌పై కేటాయించాలని నిర్ణయించారు..
ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు మహిళా పోలీసులను ఖాళీగా ఉన్న విభాగాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..
Rationalization ద్వారా పాలనను బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
ఈ తీర్పుతో వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022లో విడుదల చేసిన లైబ్రేరియన్ పోస్టుల నోటిఫికేషన్ ఈ వివాదానికి మూలమైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేశారు.
అయితే వీరు ఈ డిగ్రీని ఏపీలో కాకుండా తెలంగాణలో ఉన్న ఆ వర్సిటీ స్టడీ సెంటర్ల ద్వారా దూరవిద్యా విధానంలో పొందారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో వీరి డిగ్రీలు చెల్లవని టీజీపీఎస్సీ తిరస్కరించడంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
గతంలో ఇదే తరహా డిగ్రీలతో కొందరికి ఉద్యోగాలు వచ్చాయని వారు వాదించారు.
హైకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది.
ఒక రాష్ట్ర చట్టం కింద ఏర్పడిన విశ్వవిద్యాలయం తన కార్యకలాపాలను ఆ రాష్ట్ర సరిహద్దులకే పరిమితం చేయాలి. ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లు పెట్టి డిగ్రీలు ఇవ్వడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. 2013లో యూజీసీ జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం.. ఏ వర్సిటీ కూడా తన ప్రాదేశిక అధికార పరిధిని దాటి వెళ్లకూడదు. తెలంగాణలో ఏపీ వర్సిటీ సెంటర్లు నిర్వహించడం చట్టవిరుద్ధమని కోర్టు తెలిపింది. 2017 నియామకాల్లో ఇలాంటి డిగ్రీలను అంగీకరించారు కదా అని అభ్యర్థులు చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది..
“గతంలో జరిగిన అవకతవకలు లేదా తప్పులను.. కొత్త తప్పులకు సమర్థనగా వాడలేము” అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలు స్టడీ సెంటర్ల నిర్వహణకు అనుమతిస్తాయన్న వాదనను కూడా కోర్టు తిరస్కరించింది.
ఎవరిపై ప్రభావం చూపుతుంది..?
ఈ తీర్పు కేవలం లైబ్రేరియన్ పోస్టులకే పరిమితం కాకుండా రాబోయే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఉంటూ పక్క రాష్ట్రాల వర్సిటీల (ఉదాహరణకు ఆచార్య నాగార్జున, అన్నామలై, మదురై కామరాజ్ వంటివి) స్టడీ సెంటర్ల ద్వారా డిగ్రీలు పొందిన వారు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను చట్టబద్ధంగా కొనసాగించడానికి టీజీపీఎస్సీకి మార్గం సుగమమైంది.
కారుణ్య నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు (W.P.No. 6472)..
ముఖ్య అంశాలు :
కారుణ్య నియామకాలు ఇక పై 'రెగ్యులర్' ఉద్యోగాలు కాదని, కేవలం అవుట్ సోర్సింగ్ (Outsourcing) లేదా తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉండాలని కోర్టు పేర్కొంది..
చనిపోయిన ఉద్యోగికి వచ్చే బెనిఫిట్స్ (Pension, Gratuity) కుటుంబానికి సరిపోతాయని ప్రభుత్వం భావిస్తే, ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది..
కేవలం అత్యంత పేదరికంలో ఉన్న (Hand-to-mouth) కుటుంబాలకు మాత్రమే ఈ నియామకాలు వర్తింపజేయాలని సూచించింది..
రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల లోపు ఈ కొత్త నిబంధనలతో మార్గదర్శకాలను (Guidelines) సవరించాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ 2026 సంవత్సరం లో సుమారుగా ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు..
Читать полностью…
https://x.com/i/status/2047305785877909699
Читать полностью…
https://www.instagram.com/p/DXZxUq7EiQU/?igsh=MWQyZ2QzNjllODR1
Читать полностью…
నకిలీ మెడికల్ సర్టిఫికేట్లతో సెలవు తీసుకుంటే ఉద్యోగం ఊడాల్సిందే..
ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
ఉద్యోగుల క్రమశిక్షణ మరియు నిజాయితీపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తప్పుడు వైద్య ధృవీకరణ పత్రాలను (False Medical Certificates) సమర్పించి సెలవులు పొందడం అనేది "తీవ్రమైన దుష్ప్రవర్తన" (Grave Misconduct) కిందకు వస్తుందని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని ఉద్యోగం నుండి తొలగించడం పూర్తిగా సమర్థనీయమని కోర్టు స్పష్టం చేసింది.
గతంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి, అనారోగ్యం నెపంతో నకిలీ మెడికల్ సర్టిఫికేట్లు సమర్పించి సుదీర్ఘకాలం సెలవు పొందారు. విచారణలో ఆ పత్రాలు బోగస్ అని తేలడంతో సదరు సంస్థ అతడిని విధుల నుంచి తొలగించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, ఉద్యోగి వాదనను తోసిపుచ్చుతూ
యాజమాన్యాన్ని మోసం చేసి, నకిలీ పత్రాలతో సెలవు పొందడం అనేది సంస్థ పట్ల చేసే నమ్మక ద్రోహం.
కార్యాలయాల్లో క్రమశిక్షణ, చిత్తశుద్ధి అత్యంత ప్రధానమైనవి. మోసపూరిత పద్ధతులతో ప్రయోజనం పొందాలనుకోవడం క్షమించరాని నేరం.
అటువంటి ఉద్యోగిని సర్వీసు నుండి తొలగించడం (Dismissal) అనేది కఠినమైన శిక్ష ఏమీ కాదని, అది వారు చేసిన తప్పుకు తగిన ప్రతిఫలమేనని కోర్టు అభిప్రాయపడింది.
ఈ తీర్పుతో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, సెలవుల కోసం అడ్డదారులు తొక్కితే, అది మొత్తంగా ఉద్యోగానికే ఎసరు తెస్తుందని ఈ తీర్పు హెచ్చరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ..
స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ మరియు నేరుగా నియామకాల కు సంబంధించి కొత్త జీవో (G.O.MS.No. 45) తేదీ:- 20.04.2026 న విడుదల చేసింది.
దీని ప్రకారం ముఖ్యమైన మార్పులు ఇవే:
95% రిజర్వేషన్: జిల్లా, జోనల్ మరియు మల్టీ-జోనల్ స్థాయి పోస్టుల్లో ప్రత్యక్ష నియామకాల కోసం 95% పోస్టులు స్థానిక అభ్యర్థులకే కేటాయించబడతాయి.
స్థానికత (Locality) గుర్తింపు: అర్హత పరీక్షకు ముందు వరుసగా 4 విద్యా సంవత్సరాలు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే మీ స్థానిక ప్రాంతం అవుతుంది.
విద్యా సంస్థల్లో చదవని వారు, 4 ఏళ్ల నివాసం ప్రాతిపదికన స్థానికతను పొందవచ్చు.
ఒకవేళ 4 ఏళ్ల నిబంధన సరిపోకపోతే, వరుసగా 7 ఏళ్ల చదువు/నివాసం ఆధారంగా గరిష్ట కాలం ఎక్కడ ఉంటే దానిని పరిగణిస్తారు.
ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపు..
కేటాయింపు: పోస్టుల నియామకానికి జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.
పాత జిల్లాల నుండి కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీ, పరిపాలనా అవసరాలు మరియు అభ్యర్థుల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటారు.
కేటాయింపుపై అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోపు విజ్ఞప్తి చేసుకోవచ్చు.
జోన్ల విభజన: మొత్తం రాష్ట్రం 6 జోన్లుగా మరియు 2 మల్టీ-జోన్లుగా విభజించబడింది.
మినహాయింపులు: సెక్రటేరియట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (HoD) కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు మరియు రాజధాని ప్రాంత పోలీస్ పోస్టులకు ఈ స్థానిక రిజర్వేషన్ నిబంధనల నుండి మినహాయింపు ఉంది.
క్రమశిక్షణ కోసం బెత్తంతో కొట్టడం నేరం కాదు - కేరళ హైకోర్టు కీలక తీర్పు
పాఠశాలల్లో విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు ఉపాధ్యాయులు చేసే ప్రయత్నాలను నేరంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
క్రమశిక్షణలో భాగంగా విద్యార్థిని బెత్తంతో కొట్టిన ఉపాధ్యాయుడిపై నమోదైన క్రిమినల్ కేసును కోర్టు కొట్టివేసింది (Quash). ఈ మేరకు జస్టిస్ సి. ప్రదీప్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
తిరువనంతపురంలోని ఒక పాఠశాలలో విద్యార్థి సరిగ్గా ప్రవర్తించలేదని, ఉపాధ్యాయుడు స్టాఫ్ రూమ్‌లో బెత్తంతో కొట్టాడన్న ఆరోపణపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు ఉపాధ్యాయుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు జువైనల్ జస్టిస్ (JJ) యాక్ట్ కింద తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారు.
దీనిని సవాలు చేస్తూ ఉపాధ్యాయుడు హైకోర్టును ఆశ్రయించారు.
కేసును విచారించిన కోర్టు ఉపాధ్యాయుడు ఉపయోగించిన 'బెత్తం' (Cane) చట్టప్రకారం ప్రమాదకరమైన ఆయుధం కాదని పేర్కొంది.
ఉపాధ్యాయుడు విద్యార్థిని క్రూరంగా వేధించాలనే ఉద్దేశంతో కాకుండా, కేవలం క్రమశిక్షణ కోసమే శిక్షించారని, ఇందులో ఎటువంటి 'మెన్స్ రియా' (నేరపూరిత ఆలోచన) లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.
"ఉపాధ్యాయులకు విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచేందుకు పరిమిత అధికారం ఉంటుంది. ఆ చర్యలు సదుద్దేశంతో (Bona fide), కోపం లేదా క్రూరత్వం లేకుండా చేసినప్పుడు అవి నేరం కిందకు రావు," అని కోర్టు స్పష్టం చేసింది.
ఇలాంటి కేసులను కొనసాగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెబుతూ ఉపాధ్యాయుడిపై ఉన్న అన్ని చట్టపరమైన చర్యలను కోర్టు రద్దు చేసింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు..
లోక్‌సభలో కీలక ఓటింగ్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాలేదు..
ఓటింగ్ వివరాలు..
అనుకూలం - 278 ఓట్లు
వ్యతిరేకం - 211 ఓట్లు
అవసరమైన 2/3 మెజార్టీ - 326 ఓట్లు
👉 అవసరమైన మెజార్టీ రాకపోవడంతో బిల్లు వీగిపోయింది!
మొత్తం ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యులు - 489
https://www.instagram.com/reel/DXOkv6pku0d/?igsh=cGw1dTdydnQ0Y2pv
Читать полностью…
టీచర్ పోస్టుల సర్దుబాటుపై విద్యాశాఖ కసరత్తు..
Читать полностью…
జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తాం.
ఈ రోజు జరిగిన సమావేశంలో నారా లోకేష్ గారు.
ఆ డిగ్రీలు ఇక చెల్లవు.. హైకోర్టు సంచలన తీర్పు..
పక్క రాష్ట్రాల్లో డిస్టెన్స్ డిగ్రీ చేశారా అయితే ఆ డిగ్రీకి చెల్లదు
డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీలు పూర్తి చేసి.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది..
పక్క రాష్ట్ర వర్సిటీలకు చెందిన స్టడీ సెంటర్ల ద్వారా పొందిన డిగ్రీలు కేవలం కాగితపు ముక్కలే తప్ప, సర్కారీ కొలువులకు అవి ఏమాత్రం పనికిరావని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది..
దూరవిద్యా విధానంలో డిగ్రీలు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇతర రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాలు తమ రాష్ట్ర సరిహద్దులు దాటి నిర్వహిస్తున్న స్టడీ సెంటర్ల ద్వారా పొందే డిగ్రీలు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరావని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఏపీలో 175 డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు మరో ఏడాది పొడిగింపు
రాష్ట్రంలోని 175 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులను 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
1.ఓటరు జాబితాల నిరంతర నవీకరణ
2.EPIC కార్డుల జారీ
3.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులు
4.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) సన్నాహక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వీరి ఖర్చులు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో భరిస్తాయి..
తాకి చెడినవాడు ఇంద్రుడు..
తాకకుండా చెడినవాడు రావణుడు..
చెప్పటం వల్ల చెడిన వాడు విశ్వామిత్రుడు..
చెప్పకపోవడం వల్ల చెడిన వాడు హరిచంద్రుడు..
ఇవ్వటం వల్ల చెడిన వాడు కర్ణుడు..
ఇవ్వకపోవడం వల్ల చెడిన వాడు దుర్యోధనుడు..
ప్రిపేర్ అవుతున్నాం అనే భ్రమలో సోషల్ మీడియా (ముఖ్యంగా టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్) లో సంకనాకిపొయిన వాడు నిరుద్యోగులు..
National civil services day 21st April
Читать полностью…
https://x.com/i/status/2046424356805550528
Читать полностью…
ఉద్యోగాల స్థానికత పై కొత్త నిబంధనలు అమలులోకి
ఇకపై 26 జిల్లాలు,6 జోన్లు,2 మల్టీ జోన్ లు
గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశారనే కారణం తో ప్రభుత్వ ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగింపు.
ఇవే ఆరోపణలపై రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న వెంకట్రామిరెడ్డి.. తొలగింపుతో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కూడా కోల్పోయిన వెంకట్రామిరెడ్డి.
మరో 14ఏళ్ల సర్వీసు ఉండగానే వెంకట్రామిరెడ్డిని తన ప్రభుత్వ ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్ సర్వీస్ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో స్థానిక, స్థానికేతరను నిర్ణయించు విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో విడుదల. ☝️
Читать полностью…
చిన్నారి పునర్విక చిరునవ్వులు మళ్లీ పూశాయి..
ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఏడాదిన్నర వయసున్న చిన్నారి పునర్విక మృత్యువును జయించింది..
తెలుగు రాష్ట్రాల ప్రజల ఉదారత, ప్రభుత్వం అందించిన సాయంతో.. అసాధ్యం సుసాధ్యమైంది..
అరుదైన, అత్యంత ప్రమాదకరమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA Type-1) వ్యాధితో మృత్యువు అంచుల్లో ఉన్న ఆ పాపను కాపాడుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల చొరవ ఫలించింది..
ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో వైద్యులు అమెరికా నుంచి తెప్పించిన రూ. 16 కోట్ల ఖరీదైన 'జోల్ జెన్ స్మా' (Zolgensma) ఇంజెక్షన్‌ను చిన్నారికి విజయవంతంగా ఇచ్చారు.
సోషల్ మీడియా వేదికగా పునర్విక కథ వైరల్ కావడంతో లక్షలాది మంది దాతలు స్పందించారు. ఒక్కొక్కరు తమకు తోచిన విధంగా సాయం చేయడంతో ఫిబ్రవరి నాటికి రూ. 10 కోట్లు సమకూరాయి. కానీ, ఇంకా రూ. 6 కోట్లు తక్కువయ్యాయి.
ఈ సమాజం ప్రభుత్వ చొరవతో ఒక చిట్టి తల్లి ప్రాణం కాపాడుకుని మానవత్వాన్ని నిలుపుకుంది. ❤️❤️
లోక్ సభ లో వీగిపోయిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు ..
Читать полностью…
https://youtu.be/PSzDowbq3To?si=zQBWrc70jta5a9cB
Читать полностью…