aaradana | Unsorted

Telegram-канал aaradana - Aaradana = ఆదరణ Jesus Songs

-

దేవుడికి దణ్ణం పెట్టు.... స్తోత్రము యేసు క్రీస్తు....Andhra Kristhava Keerthanalu... Join Telugu Catholic group : @Aaradana

Subscribe to a channel

Aaradana = ఆదరణ Jesus Songs

💁‍♀️ *వాక్యంలో పరవశిస్తూ, వాక్యాన్ని అందరికి వివరిస్తూ, ఆ వాక్యాన్ని ఎంత ధ్యానించినా తనివి*
*తీరదు వారికి.* .

⚡️⚡️⚡️⚡️⚡️💁‍♀️💁‍♀️💁‍♀️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯కీర్తనలు 119:25*
(దాలెత్‌) నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. *నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము*.

💁‍♀️ *నన్ను బ్రతికించేది నీ వాక్యమే అంటున్నాడు*
*కీర్తనా కారుడు.*

*🎯కీర్తనలు 119:50*
నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది *నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.*

💁‍♀️ *ఎంతటి కష్ట సమయంలో అయినా సరే, శ్రమలు చుట్టు ముట్టినా,నీ వాక్యమే నాకు నెమ్మది నిస్తుంది.* అంటూ *దీనుడిగా* దేవునిపై తన *విశ్వాసాన్ని వెల్లిబుచ్చుతున్నాడు కీర్తనా కారుడు*.

*🎯కీర్తనలు 119:92* నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు *నేను*
*నశించియుందును.*

💁‍♀️ *నాకు కలిగిన శ్రమలలో ఆ బాధతో నేను*
*నశించి యుందును*

*🎯కీర్తనలు 119:143* శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు *నాకు సంతోషము కలుగజేయు చున్నవి*

💁‍♀️ *వేదనలు, శ్రమలు నన్ను ఏమి చేయలేవు. నీ ఆజ్ఞలు నన్ను సంతోష పెడుతున్నాయి* అంటున్నాడు కీర్తనా కారుడు.

💁‍♀️ *వాక్యాన్ని ప్రేమించే వారి జీవితంలో వారికి*
*సమస్తము వాక్యమే.*

💁‍♀️ *వాక్యంలో పరవశిస్తూ ఉండేవారు , వాక్యంలో ఆనందిస్తూ, వాక్యాన్ని అందరికి వివరిస్తూ, ఆ*
*వాక్యాన్ని ఎంత ధ్యానించినా*
*తనివి తీరదు వారికి*.

*మరి మీకు??*

💁‍♀️ *ఎన్నిసార్లు చదివినా వాక్యం కొత్తగా బోధిస్తూనే*
*ఉంటుంది కదా .*

🙏 *దేవునికి స్తోత్రం*🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

~~~~~

🎯 *కీర్తన119:19*

*నేను భూమి మీద పరదేశినై యున్నాను నీ*
*ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము*.

*ఈ భూమిలో నేను పరదేశీని అనే ఈ జ్ఞానం*
*మనకు ఉందా?*

*✍️డాక్టర్ పద్మిని సెల్విన్.*
*అనువాదం బ్రదర్ జాయ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 💁‍♀️ *119 వ కీర్తన చదివారా*
*ప్రతీ కీర్తనకు పైన ఆ కీర్తన ఎవరు రాసారో*
*రాయబడి వున్నది కదా?? మరి ఈ కీర్తన ఎవరు*
*రాసారంటారు*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
💁‍♀️ *ఆలెఫ్, బెత్, గీమెల్, దాలెత్, హే, వావ్, జాయిన్, హేత్, తేత్, యోద్, కఫ్, లామెద్, మేమ్, ..... మొత్తం 22 మంది కలిసి ఈ కీర్తన రాశారు అనుకుంటున్నారా*??

*అయితే మీరు తప్పులో కాలేసినట్లే*

💁‍♀️ అవునండి. అవి *మనుష్యుల పేర్లు కావు*. హెబ్రీ భాషలో అక్షరాలు ఉంటాయి కదా అవన్నమాట. తెలుగులో అ, ఆ, ఇ, ఈ .... ల్లా. ఇంగ్లీషు భాషలో a, b, c, d ల్లా అన్నమాట.

*ఈ కీర్తన ఎవరు రాసివుంటారు*?? 🤔

ఒక్కసారి *ఎజ్రా 7:10* చూడండి. 👇

🎯 *ఎజ్రా* యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును *దృఢ నిశ్చయము* చేసికొనెను.

💁‍♀️ *అలానే 119 వ కీర్తన 1వ & 2 వ*
*చరణాలు చూడండి*.

👁️👁️ *చూసారా*??

💁‍♀️ *బైబుల్ తెరచి 📖 చూడండి*

*🎯కీర్తనలు 119:1* (ఆలెఫ్‌) యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు

🎯 *కీర్తనలు 119:2* ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.

💁‍♀️ *కాబట్టి ఈ కీర్తనని ఎవరు*
*రాసివుంటారో మీరు కూడా 🙄 ఊహించండి.*
*అవును ఆయనే, రాసాడు.*

💁‍♀️ *హెబ్రీ అక్షరమాలలో అక్షరాలు 22*

*💁‍♀️యే అక్షరంతో ఆ వచనం మొదలు*
*పెట్టబడిందో ఆ అక్షరం అక్కడ హెడ్డింగ్*
*పెట్టారన్నమాట. అంటే ఆ వాక్యం మొదలు ఆ*
*అక్షరంతో మొదలవుతుందన్న మాట.*

💁‍♀️ *ధర్మ శాస్త్రం గురించి రాయబడిన*
*అతి పెద్ద కీర్తన 119 వ కీర్తన*

💁‍♀️ *హెబ్రీ అక్షమాలలో మొదటి అక్షరం*
*ఆలెఫ్* నుండి, చివరి *22* వ అక్షరం *తౌ* వరకూ
*తీసుకొని, *ఎనిమిదేసి వచనాలు* రాశాడు ఈ
కీర్తనాకారుడు.

*8×22=176*

💁‍♀️ *చూసారా లెక్క కరెక్ట్ గా* 👌
*సరిపోయింది. అదన్న మాట అసలు సంగతి*.

💁‍♀️ *మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఎవరితో నైనా బైబుల్ లో రిఫరెన్స్ చెప్పేటప్పుడు ఫలానా పుస్తకంలో ఫలానా అధ్యాయంలో, ఫలానా వాక్యం అనిచెబుతాము కదండీ. కీర్తనల గ్రంథంలో రిఫరెన్స్ చెప్పేటప్పుడు మనం ఫలానా కీర్తనలో ఫలానాచరణం అని చెప్పాలి. మర్చిపోకండి*. 🙏

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *🎯కీర్తన : 115*

*విగ్రహాలు & విగ్రహారాధన*

✅ *నేర్చుకున్న అంతర్దృష్టులు*:

▪️ *విగ్రహాలు దేవుళ్ళు కావు ,అవి మాట్లాడలేవు ,*
*చూడలేవు, నడవలేవు*.

▪️ *విగ్రహాలు ఎటువంటి హాని చేయవు మరియు*
*మంచి చేయవు*.

✍️ *ఇ.క్రిస్టదాస్,భారతదేశం* 🙏🏽
*అనువాదం బ్రదర్ జాయ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*🎯కీర్తనలు. 113:8*

*దేవుడు బీదలను సంరక్షించును*

*ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తు వాడు*
*పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తు వాడు*

*✍️సహో,,అనితా తుమ్మ*
*అనువాదము - మేరీ రాజు*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *🎯111కీర్తన నుండి 117 వ కీర్తన వరకు దేవుణ్ణి*
*ఎందుకు స్తుతించాలో తెలియ చేస్తూ,*
💁‍♀️ *దేవుని స్తుతించండి అని, తెలుపుతున్నాయి.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️

🎯 *111వ కీర్తన లో ఆయన పరాక్రమ కార్యాలను*
*బట్టి ఆయన్ని స్తుతించమని*

*🎯 112 వ కీర్తనలో ఆయన యథార్థతను బట్టి*
*ఆయనను స్తుతించమని*

*🎯 113 వ కీర్తనలో ఆయన మన పట్ల చూపించే*
*కృపను బట్టి ఆయనను స్తుతించమని*

*🎯 114 వ కీర్తనలో ఆయన కలిగించిన*
*విమోచనను బట్టి స్తుతించమని*

*🎯 115 వ కీర్తనలో అన్య దేవతలలో నిజమైన*
*దేవుడు కాబట్టి స్తుతించమని*

*🎯 116 వ కీర్తనలో మన మొరను ఆలకించాడు*
*కాబట్టి స్తుతించమని*

*🎯 117 వ కీర్తనలో ఆయన చూపిన కృప,*
*విశ్వాస్యత నిరంతరం నిలుస్తుంది కాబట్టి*
*స్తుతించమని*

💁‍♀️ *కీర్తనాకారుడు తెలియపరిచాడు.*

🙏 *దేవునికి స్తోత్రం*🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🎯 *కీర్తనలు 109:4*.

*నేను మానక ప్రార్థన చేయుచున్నాను*

▪✍️ *సంకలనం- చార్లెస్ ఇ. కౌమన్*
▪ *అనువాదం - డా. జోబ్ సుదర్శన్*✨
*సేకరణ :బ్రదర్ జాయ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*🎯కీర్తన 109:5-20*

*కోపముతో కూడిన ప్రార్థన* !

*మనము శత్రువు బారి నుండి బయటపడాలంటే,*
*వారిని దేవునికి అప్పగించాలి*.

*సహో. నారాయణ్*
అనువాదం: సుచేత.

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🎯 *కీర్తనలు 107*

*నీటి చక్రాన్ని గుర్తు చేసుకోండి*

💁‍♀️ *సూర్యరశ్మికి నీరు ఆవిరై మేఘాలుగా మారి ,*
*వాటికి చల్లగాలి తగలగానే వర్షించి సముద్రాన్ని*
*చేరతాయి. మరలా సూర్యరశ్మికి*
*ఆ నీరు ఆవిరై......* న చందం
💥☁️🌧️🌊 💥☁️🌦️🌊

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
🎯 *వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి* ఆయన వారి ఆపదలలోనుండి *వారిని విడిపించెను* కీర్తనలు 107:6

🎯 *ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు*.
కీర్తనలు 107:9

💁‍♀️ *కానీ* 👇

🎯 *దేవుని ఆజ్ఞలకు లోబడక* మహోన్నతుని తీర్మానమును *తృణీకరించినందున*
కీర్తనలు 107:10

💁‍♀️ *కాబట్టి దేవుడు వారిని శిక్షించాడు. మళ్ళీ*
*వాళ్ళు 👇*

🎯 *కష్టకాలమందు* వారు *యెహోవాకు మొఱ్ఱపెట్టిరి* ఆయన వారి ఆపదలలో నుండి *వారిని విడిపించెను*
కీర్తనలు 107:13

💁‍♀️ *మరలా దేవునికి వ్యతిరేకముగా జీవించడం మొదలు పెట్టారు. అందుకుగాను దేవుడు వారిని*
*శిక్షించాడు*.

🎯 *కష్టకాలమందు* వారు *యెహోవాకు మొఱ్ఱపెట్టిరి* ఆయన వారి ఆపదలలో నుండి *వారిని విడిపించెను.*
కీర్తనలు 107:19

🎯శ్రమకు తాళలేక వారు *యెహోవాకు మొఱ్ఱపెట్టిరి* ఆయన వారి ఆపదలలో నుండి *వారిని విడిపించెను*.
కీర్తనలు 107:28

👆💁‍♀️ *పై వచనాలన్నిటిని వరుసగా చూస్తుంటే..... నీటి చక్రం గుర్తుకు వస్తుంది కదా.*

💁‍♀️ *తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే దండిస్తారు. వారు ఏడుస్తుంటే, జాలితో మరలా అక్కున చేర్చుకుంటారు కదా. అలానే దేవుడు*
*ఇశ్రాయేలీయులను ఒక తల్లిలా, తండ్రిలా*
*ప్రేమించాడు.*

💁‍♀️ *కాబట్టే వారు తప్పు చేసిన ప్రతీసారి దండించినా, వారు మొఱ్ఱపెట్టగానే వారిని దేవుడు*
*శిక్షనుండి తప్పించేసేవాడు.*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 💫 *రక్షించే దేవుడు* 💫

*కీర్తన 107*

☄️ *ఈ కీర్తన మనకు బోధిస్తుంది, దేవుడు తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడమే కాదు;వాళ్ళని ప్రతి రోజు కూడా రక్షిస్తాడు! అని.*

✍️ *ప్రిన్సెస్ హడ్సన్*
*అనువాదం బ్రదర్ జాయ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*🎯కీర్తన 106*

*ఇశ్రాయేలుకు దేవుడు చూపించిన తన మంచితనము యొక్క వెలుగును చూసినప్పుడు, వారు దేవునికి ఎంత*..........

=================================
*వారైతే అవిధేయులై పాపమును ఎన్నోసార్లు*
*చేసారు. వారికి తీర్పు తీర్చకముందు వారు*
*చేసినలాంటి పాపములు మనమెన్ని చేస్తున్నామో*
*స్వపరిశీలన చేసుకుందాము.*

✍️ *సువార్తికులు సహో. నారాయణ్*
*అనువాదం: సుచేత*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

24 APRIL, 2024 - WEDNESDAY

THE MONTH OF APRIL IS DEDICATED BOTH TO DEVOTION TO THE EUCHARIST AND DEVOTION TO THE HOLY SPIRIT

*1) PRAYER WHEN VISITING THE MOST BLESSED SACRAMENT*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5246&c=jesus_christ&k=&s=1
*2) PRAYER TO THE HOLY SPIRIT*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=532&c=holy_spirit&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26558&s=1

ST. VINCENT DE PAUL (ON HIS BIRTHDAY)
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-04-24&link=a&s=1

SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26513&s=1

REGINA COELI (QUEEN OF HEAVEN)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4725&c=blessed_virgin_mary&k=&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26535&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26492&s=1

BIBLE IN 365 DAYS - DAY 114
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4922&c=april&k=&s=1

THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 30
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=30&fid=7&s=1

WEDNESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4661&c=wednesday&k=&s=1

WEDNESDAY: ST. JOSEPH
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=576&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - WEDNESDAY - NOVENA TO OUR LADY OF PERPETUAL SUCCOUR
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4651&c=wednesday&k=&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://tinyurl.com/jrmmapp

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *నిబంధనను నేరవేర్చే దేవుడు*

🎯 *కీర్తనలు 105 :8*
*తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల*
*వరకు... నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనెను*

*✍️ సహో. అనితా తుమ్మ*
*అనువాదము - మేరీ రాజు*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *దేవుని వాగ్దానం - మన బాధలలో ఓదార్పు*

*🎯కీర్తనలు : 119:50*

❇️ *నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది,*
*నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది*.

✍️ *ఇ.క్రిస్టదాస్,భారతదేశం* 🙏🏽
*అనువాదం: రెబెక్కా వినోద్.వై*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🎯 *కీర్తన 106*

. 💁‍♀️ *మన హృదయములో విశ్వాసముంటే*
💕💞 *అది స్తుతులతో పొంగిపొర్లుతుంది.*💕💞

*సేకరించబడినది*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

💁‍♀️ *భూమ్యాకాశములను దేవుడు ఏ విధంగా*
*సృజించాడో కీర్తనకర్త వివరిస్తున్నాడు.*

🌎 🌊 🌨️

⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯కీర్తనలు 104:5*
*భూమి యెన్నటికిని కదలకుండు నట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.*

💁‍♀️ *అంటే భూమిని, నాలుగు స్తంభాలు పాతి దానిమీద నిలబెట్టాడు అని కాదు అర్థం.*

💁‍♀️ *ఎన్నో సంవత్సరాలుగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఈ భూమిలో ఎలాంటి లోపం లేకుండా, ఎలాంటి మరమ్మత్తులు చేయనవసరం లేకుండా ఎంత పటిష్టంగాఉంది??*

*💁‍♀️ దేవుడు అలా భూమిని పటిష్టంగా చేశాడు అని చెప్పడమే, "భూమి యెన్నటికిని కదలకుండు నట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను".* అని చెప్పడంలోని ఉద్దేశ్యం.

🎯 *కీర్తనలు 104:6*
దానిమీద అగాధజలములను నీవు వస్త్రమువలె కప్పితివి. కొండలకుపైగా నీళ్లు నిలిచెను.

💁‍♀️ *కొండలపై అగాధ జలములలోని నీటిని*
*ఉంచింది దేవుడే.*

🎯 *కీర్తనలు 104:7*
నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను.

*🎯 కీర్తనలు 104:8* నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను.

💁‍♀️ *నీరు పర్వతాల నుండి, పల్లానికి దిగేటట్లు*
*దేవుడే సృజించాడు.*

💁‍♀️ *జీవజల నదులు ఎంత పారినా, సముద్రంలో*
*కలిసినా* 👇

🎯 *కీర్తనలు 104:9* అవి మరలి వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి.

💁‍♀️ *సముద్రం ఎంత పొంగినా భూమంతటినీ కప్పి వేయకుండా సముద్రానికి ఎల్లలు ఏర్పరచాడు*
*దేవుడు.*

💁‍♀️ *నోవాహు కాలంలో జలప్రళయంతో భూమిని మొత్తాన్ని నీటితో నింపేశాడు దేవుడు.* మరల అలా
చేయను అని వాగ్దానం కూడా చేసాడు.

*🎯ఆదికాండము 1:2*
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధజలముపైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

💁‍♀️ *👆మొదట భూమి అంతా నీటితో నింపబడి*
*ఉంది.*

🎯 *ఆదికాండము 1:6* మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను.

💁‍♀️ *దేవుడు విశాలం కలుగజేసి నీటిని రెండుగా*
*వేరు పరిచాడు*

🎯 *ఆదికాండము 1:7* దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.

💁‍♀️ *విశాలము క్రింద జలము & విశాలము పైన*
*జలములుగా ఆ జలరాసిని వేరుపరచాడు.*

🎯 *ఆదికాండము 1:8* దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.

💁‍♀️👆 *ఈ విధంగా ఆకాశాలను తయారు చేశాడు*
*దేవుడు*

🎯 *ఆదికాండము 1:9* దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.

💁‍♀️ *👆ఈ విధంగా ఆరిన నేలను తయారు*
*చేసాడు*

🎯 *ఆదికాండము 1:10*
దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.

💁‍♀️ 👆 *దేవుడు భూమిని, సముద్రాన్ని,*
*ఆకాశాలను ఆ విధంగా చేశాడు*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…
Subscribe to a channel