💁♀️ *సామెతలు 10:22 లో అనువాద లోపం*
*వుంది. గమనించండి.*
⚡️⚡️⚡️⚡️⚡️💁♀️💁♀️💁♀️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯సామెతలు 10:22* యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును *నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు*.
*🎯Proverbs 10:22* The blessing of the LORD makes rich, *and he adds no sorrow with it.*
💁♀️ *అంటే దాని అర్థం దేవుని ఆశీర్వాదం వలన ఐశ్వర్యవంతులైన వారికి కష్టాలు రావు అని అర్థం.*
💁♀️ *కొందరి ఇళ్ళల్లో ఐశ్వర్యం ఉంటుంది. కానీ దాంతోపాటే ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక గొడవలు*
*ఉంటూనే ఉంటాయి. వారి జీవితాల్లో*
*సుఖసంతోషాలు వుండవు*
💁♀️ *దేవుడే గనక ఐశ్వర్యాన్ని ఆశీర్వదిస్తే, ఆ కుటుంబంలోని సభ్యులు ఆ ఐశ్వర్యం వలన ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు అని అర్థం*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *జ్ఞానము గల బోధకుడు*
😇🗣️
*సామెతలు గ్రంధములో మొదటి తొమ్మిది అధ్యాయాలు సొలొమోను యవ్వనస్థులకు తండ్రి*
*వలే బోధించాడు.10 నుండి 24 అధ్యాయాలు*
*అందరికి కావలసిన తెలివి గల బోధ చేసాడు.*
*✍️జాస్మిన్ క్రిస్టల్ దా మోహన్.*
*అనువాదం - మేరీ రాజు*✨
. *🎯సామెతలు 8:34*
👉 *దేవుని వాక్యం ఇలా చెబుతుంది. . .*
*" అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా*
*ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము*
*వినువారు ధన్యులు.*
llllllllllllllllll
*దావీదువలే నాట్యం చేస్తాను అని పాడే నీవు,*
*ఆయన కలిగిన తృష్ణను కలిగియుండు.*
*ఆయనలా ప్రార్ధించు.*
*సేకరించబడినది*
. 🎯 *సామెతలు 8:17*
*నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించు*
*చున్నాను. నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను*
*కనుగొందురు*.
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕====================================
*దేవుని పిల్లలు ఆయనకు దగ్గరవుతున్నప్పుడు,*
*ఆయన యొక్క పరిపూర్ణమైన శాంతి మరియు*
*ఆనందంలో పాలుపంచుకొని*
*ఆయన ప్రేమ యందు విస్తరించెదరు.*
*సేకరణ: బ్రో. టి. గంగారావు*. *విజయవాడ.*
. 👿 *అపవాది ఎర* 😈
*🎯సామెతలు 7:7,8*
*.. బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను.. సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను.* .
💻 📱📲
*దేవుని బిడ్డలుగా ఇంటర్నెట్ను వివేకముగా*
*ఉపయోగించండి.*
*సేకరించబడినది*
. 💁♀️ *పూటపడిన యెడల అంటే* ❓❓
*🎯సామెతలు 6:1* నా కుమారుడా, నీ చెలికానికొరకు *పూటపడిన యెడల* పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల
⚡️⚡️⚡️⚡️⚡️💁♀️💁♀️💁♀️⚡️⚡️⚡️⚡️⚡️
💁♀️ *పూట పడుట అంటే, ఎవరైనా స్నేహితులకు*
*షూరిటీ ఉండటం.*
*🎯సామెతలు 6:2*
*నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి యున్నావు నీ నోటి మాటల వలన పట్టబడి యున్నావు.*
💁♀️ *నువ్వు ఒకవేళ నీ స్నేహితుల పక్షాన షూరిటీ ఉంటే, నీ నోటి మాట వలన, నీ సంతకాల వలన నువ్వు చిక్కుబడి ఉన్నావు అని సొలోమోను*
*హెచ్చరిస్తున్నాడు*
*🎯సామెతలు 6:3*
*నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము*.
💁♀️ *ఒకవేళ అలా ఉంటే నువ్వు చిక్కుల్లో పడతావు. కాబట్టి త్వరపడి వెళ్లి ఆ డాక్యుమెంట్స్*
*వెనుకకు తీసుకో అని మహా జ్ఞాని అయిన*
*సొలోమోను హెచ్చరిస్తున్నాడు*
*🎯సామెతలు 6:4 ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.*
💁♀️👆🏻 *అంటే రాత్రుళ్లు నిద్ర పోవద్దు అని కాదు*
*దాని అర్థం. తెలివిగా ఉండు అమాయకంగా*
*చిక్కుల్లో చిక్కుకోవద్దు అని అర్థం.*
*🎯సామెతలు 6:5 వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము.*
💁♀️ *అప్పు అనే వేటగాని చేతినుండి లేడి తప్పించుకున్నట్లు గా నీవు ఇతరుల అప్పుల బాధ*
*నుండి త్వరగా తప్పించుకో అని సొలోమోను*
*హెచ్చరిస్తున్నాడు*
💁♀️ *ప్రాణ స్నేహితులకు అవసరానికి డబ్బులు ఇవ్వకలేకపోయినా, కనీసం షూటిరీ సంతకమైన*
*పెడదాము అని మీరు*
*ఉదారంగా ఆలోచించి పెట్టకండి.*
💁♀️ *ఒకవేళ నిజంగా ఆ మీ ప్రాణ స్నేహితుడు ఆ*
*అప్పు తీర్చలేకపోతే మీరు ఆ అప్పుని వడ్డీతో*
*సహా తీర్చడానికి సిద్ధపడినట్లయితేనే షూరిటీ*
*సంతకాలు పెట్టండి.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *📿 సామెతలులోని ఆణిముత్యాలు 📿*
*ఒకానొక సందర్భంలో సొలొమోను రాజు*
*సోమరివానిని *'చీమల వద్దకు వెళ్ళమన్నాడు.'*
🐜 🐜 🐜 🐜 🐜 🐜 🐜 🐜
*Mrs. Sheela Jabakumar*
. 🎯 *సామెతలు 1:10-14*
*నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా*
*ఒప్పకుము.*......
================-----=================
*యువతీ యువకులారా,*
*మిమ్ములను బట్టి, మీ కుటుంబ గౌరవం,*
*మీ ఆధ్యాత్మిక జీవితం పతనం కాకూడదు.*
*మీ స్నేహం చెడ్డదైతే వారి తలంపులలోనూ,*
*వారి క్రియల్లోనూ, వారితోనూ చేరొద్దు.*
*వారి ప్రలోభాలకు లొంగవద్దు. నీజీవితాన్ని*
*యేసయ్యకు సమర్పించి*
*ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించుటకు*
*నీ హృదయాన్ని సిద్ధపరచుకో!*
💁♀️ *సొలోమోను ఒక తండ్రి, తన కుమారునికి జ్ఞానం యొక్క విలువను తెలియచేసినట్లు మనకు*
*తెలియజేస్తున్నాడు ఈ సామెతల గ్రంథంలో*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
💁♀️ *సొలొమోను తన ఆత్మ జ్ఞానం ద్వారా*
*వ్రాసినకొన్ని సామెతలను,*
*పరిశుద్ధాత్మ ఈ గ్రంధంలో పొందుపరిచాడు.*
*🎯సామెతలు 1:4* జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.
💁♀️ *మనుషుల్లో మూడు రకాల వ్యక్తిత్వాలు*
*కలిగిన వ్యక్తులు ఉంటారు*.
1️⃣ *దెబ్బ తగిలాక మేలుకునేవాడు*
*తెలివి తక్కువవాడు*
2️⃣ *ఎదుటివాడికి దెబ్బ తగలడాన్నిబట్టి*
*తాను మేల్కొనేవాడు జ్ఞానవంతుడు.*
3️⃣ *దెబ్బ తగిలాక కూడా మేల్కొనని వాడు*
*మూర్ఖుడు*
*🎯సామెతలు 1:5* జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.
💁♀️ *ఈ సామెతల గ్రంథం చదవడం వలన, లోకంలో పాపాన్ని దూరం నుండి చూసి వివేకంతో*
*మనము మేల్కొనవచ్చు.*
*🎯సామెతలు 1:6*
వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు.
💁♀️ *తోటి వ్యక్తులతో ఈ లోకంలో*
*జ్ఞానవంతంగా బుద్ధి కలిగి ఎవరితో ఎలా*
*జీవించాలో, ఎదుటివారిని ఎలా మేల్కొల్పాలో*
*తెలియచేస్తుంది. ఈ సామెతల గ్రంథం.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. 🎯 *సామెతలు 1:7*
*యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట*
*తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును*
*ఉపదేశమును తిరస్కరించుదురు*.
🔸 *దేవుడు లేడని చెప్పేవారు, వారెందుకట్లా*
*తలంచుతారంటే? 💁♀️అసలు దేవుడే లేడంటే,*
*ఇక*
*ఆయనకు భయపడాల్సిన పనిలేదు. నచ్చినట్లు*
*జీవించొచ్చుకాబట్టి*
*ఇకవారి గమ్యమేమిటో నేను చెప్పాల్సిన*
*అవసరతలేదు కదా?*
*వారిలో నీవుండొద్దు*.
*సేకరించబడింది*
. *▫——— సామెతలు ———▫*
*క్లుప్త ధ్యానములు*
*ఈ సామెతలు గ్రంథాన్ని తెలుసుకోవడం,*
*చదవడం, వినడం వలన ప్రయోజనం లేదుగాని,*
*ఆచరణలో పెట్టడం అత్యంత ప్రాముఖ్యం.*
*సేకరించబడినది*
. *🎶🎼దేవుని స్తుతించుటకు జీవించు🎶🎼*
🗣️🎻🪕🪗🎺🎹🎼🪘🥁🎼🗣️
🎯 *కీర్తన 150*
☄️ *దేవుని స్తుతించడమంటే ఆయన*
*అద్భుతమైన వ్యక్తిత్వం యొక్క మహిమలను*
*గుర్తించడమే!*
✍️ *ప్రిన్సెస్ హడ్సన్*
*అనువాదం బ్రదర్ జాయ్*
. *కీర్తనల గ్రంథంలో 146 నుండి 150 వ కీర్తన వరకు*
*హల్లెలూయ కీర్తనలు అనవచ్చు.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
💁♀️ *హల్లెలూయ అంటే యెహోవాను స్తుతించండి*
*అని అర్థం.*
💁♀️ *ఈ ఐదు కీర్తనలు యెహోవాను స్తుతించుడితో*
*మొదలై యెహోవాను స్తుతించుడితో*
*పూర్తవుతాయి.*
*💁♀️ ఈ ఐదు కీర్తనలలో విజ్ఞాపనలు ఉండవు వారి*
*కష్టాలు, బాధలు వ్యక్తపరచుకోవటం ఉండదు.*
💁♀️ *146 వ కీర్తనలో,నేను అని మొదటి రెండు*
*చరణాల్లో కనబడుతుంది.*
*తర్వాత అంతా కూడా సమాజాన్ని సంఘాన్ని*
*ఉద్దేశించి, దేవుణ్ణి స్తుతించండి అంటూ*
*రాయబడిన కీర్తనలు ఇవి.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
🍇
*లోతైన ధ్యానములకు 💫సరళమైన తలంపులు*
*🎯సామెతలు 10:19*
*విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన*
*పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.*
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
*ప్రభువా, ఇతరులకు ఆశీర్వాదముగా ఉండే*
*మాటలతో ఎల్లప్పుడూ*
*నా హృదయాన్ని నింపండి.*
*✍️ డాక్టర్ థామస్ డేవిడ్* 🍇
🍇 *సామెతలు 5:8*
*"జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము*
*దానికి దూరముగా చేసికొనుము.*
*దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము".*
🍒 *పై వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఈ మాట స్త్రీని*
*గురించే కదా వ్రాసినది అన్నమాట చాలా బాధగా*
*అనిపించినది.*
💁♀️ *ఇట్టి స్థితి ఎవరు కల్పించారు?*
*స్త్రీ ప్రవర్తనే కదా!.*🤦♀️
*తప్పొప్పులు ఎంచుటకు కాదు కాని*
*బలహీనతలలోనున్న స్త్రీల విడుదల కొరకు*
*రక్షింపబడిన మనము ప్రార్థన చేయాలనేది*
*ఈ సందేశ సారాంశము.*
✍️ *శారదాజయకర్,*
*AP, India*.