👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
గ్రూప్ 2 ఎక్సమ్ పోస్టుపోన్ అవ్వదు అని గ్రూప్ 2 అభ్యర్థులు సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి అని అప్పుడు చెప్పా కానీ చాలా మంది అప్పుడు వినలేదు..
మళ్ళీ ఇప్పుడు DSC అభ్యర్థులకి చెప్తున్నా.. DSC ఎక్సమ్ షెడ్యూల్ ప్రకారం జరపాలని ప్రభుత్వం దృడంగా నిర్ణయించు కుంది.. కాబట్టి DSC ఎక్సమ్ పోస్టుపోన్ అవ్వదు.. సీరియస్ గా ప్రిపేర్ అయితే జాబ్ లో ఉంటారు.. పోస్టుపోన్ అవుతుంది అని సమయం వృధా చేసుకుంటే మళ్ళీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ నిరుద్యోగి గానే ఉండాల్సొస్తది..
💥 గ్రూప్1 సర్వీసెస్ లో ఉన్న 44 రకాల ఉద్యోగాలుకు ప్రిపేర్ అయ్యే మిత్రులు ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/APPSC_GROUP1_ASPIRANTS
💥ENGINEERING విభాగాల్లో ఉన్న 68 రకాల ఉద్యోగాలుకు ప్రిపేర్ అయ్యే మిత్రులు ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/AP_ENGINEERING_ASPIRANTS
💥 TEACHING సర్వీసెస్ విభాగములో ఉన్న 47 రకాల ఉద్యోగాలు కి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/AP_TEACHING_SERVICES_ASPIRANTS
💥పోలీస్, ఫారెస్ట్ విభాగములో ఉన్న అన్ని రకాల ఉద్యోగాలుకు ప్రిపేర్ అయ్యే మిత్రులు ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
💥 JOB CALENDAR,APPSC REFORMS గురించి తక్షణమే అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/AP_JOB_CALENDAR
జ) అభ్యర్థి తన విద్యార్హతలు బట్టి ఏయే పోస్టులకు అర్హులవుతారో అప్లికేషన్ సాఫ్టువేర్ తెలియజేస్తుంది. అర్హత గల పోస్టులకు అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఒకసారి పోస్టుల ప్రాధాన్యత క్రమాన్ని (ఆప్షన్లు) ఎంపిక చేసుకున్న తరువాత మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు కాబట్టి అభ్యర్థి జాగ్రత్తగా ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
14. మొదటి పోస్టుప్రాధాన్యత క్రమా నికి (ఆప్షన్ కు) అభ్యర్థి ఎంపిక కాకపోతే ఇక వుద్యోగం రాదా?
జ) అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టుప్రాధాన్యత క్రమా నికి ఆప్షన్ కు ఎంపిక కాకపోతే అతని పేరు రెండవ ఆప్షన్ కు బదిలీ అవుతుంది. అదికూడా రాకపోతే మూడవ ఆప్షన్ కు బదిలీ అవుతుంది. ఈ విధముగా చివరి ఆప్షన్ వరకు కొనసాగుతుంది. ఒకవేళ అభ్యర్థి మొదటి ఆప్షన్ కు ఎంపికైతే మిగిలిన ఆప్షన్లు రద్దు అవుతాయి. ఒక పోస్టుకు ఎంపికైన తరువాత ఎట్టి పరిస్థితులలోనూ పోస్ట్ మార్చుకోడానికి అవకాశం లేదు.
15 మెగా డి యస్ సి కి వయోపరిమితి ఏమిటి?
జ) 01-07-2024 నాటికీ 18 సంవత్సరాలకన్నా తక్కువ 44 సంవత్సరాలకన్నా ఎక్కువ ఉండరాదు. రిజర్వుడు కేటగిరి అభ్యర్థుల గరిష్ట వయస్సు 49 సంవత్సరాలు, దివ్యంగులకు గరిష్ట వయస్సు 54 సంవత్సరాలుగా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మన్ విభాగంలో నిభందనలు అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
16 షెడ్యూల్డు కులాల వర్గీకరణను ఎలా అమలుచేస్తారు?
జ) రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డు కులాల వర్గీకరణకై విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర సంఖ్య 7, తేదీ 18-04-2025, సాధారణ పరిపాలన శాఖ నియమావళి ఆధారముగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 విభాగాలు గా నిర్ధారిత శాతం మేరకు షెడ్యూలు కులాల రిజర్వేషన్ అమలు జరుగుతుంది
17. మెగా డిఎస్సి లో స్పోర్ట్స్ కోటా ఎలా అమలుచేస్తారు?
జ) రాష్ట్ర ప్రభుత్వ నియమావళిని అనుసరించి అభ్యర్థుల అర్హతల మేరకు 3 % స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
18. అభ్యర్థులు తమకు ఎదురయ్యే సమస్యల గురించి ఎవరిని సంప్రదించాలి ?
జ) మెగా డి యస్ సి లో దరఖాస్తు చేయడం హాల్ టికెట్ పరీక్షా కేంద్రాలు తదితరాల గురించి సహాయంకోసం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. ఫోన్ నంబర్లు ఇన్ఫర్మేషన్ బులిటన్ ఇవ్వబడ్డాయి.
19. ఏయే జిల్లాల్లో మెగా డిఎస్సి పోస్టులు ఎక్కువగా వున్నాయి?
జ) మెగా డిఎస్సి లో ప్రకటించిన 16347 పోస్టులలో 2678 పోస్టులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా 543 పోస్టులతో చివరి స్థానంలో ఉంది.
20. మెగా డిఎస్ సి -2025 సిలబస్ గురించి ఎలా తెలుసుకోవాలి?
జ) అభ్యర్థుల సౌకర్యం కోసం గత సంవత్సరం నవంబరు నెలలోనే పోస్టుల వారీగా సిలబస్, ప్రశ్నపత్రం మార్కుల స్వరూపం గురించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారం వెబ్సైటు .. లో అందుబాటులో ఉంచడం జరిగింది.
గ్రూప్-1 మూల్యాంకన అవకతవకలపై కేసు — జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ అధికారి PSR Anjaneyuluను కలవడానికి ప్రయత్నించిన APPSC ఉన్నతాధికారులు IN Murthy, KV Prasad
మాజీ ఇంటెలిజెన్స్ అధికారి PSR Anjaneyulu ప్రస్తుతం Jethwani case లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజా సమాచారం మేరకు గ్రూప్-1 పరీక్ష మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించి కూడా ఆయనపై ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు అప్పటి ఉన్నతాధికారులైన Vishala, IN Murthy, N Venkata Subbiah, KV Prasad తదితరులు కలిసి మూల్యాంకన వ్యవస్థను గాడితప్పేలా చేసి, నిధులను అనధికారికంగా వినియోగించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో గ్రూప్-1 కేసుకు సంబంధించి తాజా ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతానికి APPSCలో ఉన్న ఉన్నతాధికారులు అయిన IN Murthy, KV Prasad లు, జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న PSR Anjaneyuluను కలవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దర్యాప్తును తమకు అనుకూలంగా మలచే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం జరిగిందని సమాచార వర్గాలు తెలిపాయి.
/channel/+3fe1hms4HB5mZmZl
లైబ్రరీ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఈ గ్రూప్ లో join అవ్వండి ☝️☝️
ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులను ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి ఔట్ సోర్సింగ్ పద్దతి ద్వారా భర్తీ చేయుటకు ప్రతిపాదనలు పెట్టారు..
గత 20 సంవత్సరాలనుండి లైబ్రరీ నోటిఫికేషన్స్ లేవు.. లైబ్రరీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ?
ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్..కొత్త నోటిఫికెషన్స్ ఇవ్వకపోగా.. ఉన్న పోస్టులను కూడా ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తే ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ?
ఇది మంచి ప్రభుత్వం అని చెబుతున్న మీకు ఔట్ సోర్సింగ్ పద్దతిలో కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులను భర్తీ చేయండి అప్పుడు నిరుద్యోగులమే చెప్తాం మనది మంచి ప్రభుత్వం అని..
ఈ నోటిఫికెషన్ కోసమే లైబ్రరీ నిరుద్యోగులు గత కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు.. ఇప్పుడు ఈ 970+ పోస్టులని ఔట్ సోర్సింగ్ పద్దతి ద్వారా భర్తీ చేసి లైబ్రరీ అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టకండి..
ఒక అవకాశం కోసం ఎదురు చూడడం ఎంత నరకమో అది నిరుద్యోగులకే తెలుసు..
DSC అభ్యర్థులు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదు - మంత్రి నారా లోకేశ్ గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని DSC అభ్యర్థులకు సర్టిఫికెట్ అప్లోడ్ చేయడంలో సమస్యలు ఎదురవుతుండటంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది...
సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు..
అయితే వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్స్ సమర్పించాలని పేర్కొన్నారు..
💥వర్చ్యువల్ మోడ్ లో కోర్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాపుడు అనధికారికముగా ప్రవేశించి వింటున్న మిత్రులకు రెడ్ అలెర్ట్ 🛑🛑
వర్చ్యువల్ మోడ్ లో కోర్ట్ ప్రొసీడింగ్స్ వినడానికి కోర్ట్ వారు పిటిషనర్స్ కి, వాళ్ళ లాయర్స్ కి మాత్రమే అధికారకముగా అవకాశం ఉంది. కానీ కొందరు ఆకాతాయిలు కోర్ట్ ప్రొసీడింగ్స్ వినడానికి అనధికారముగా ప్రవేశించడమే మొదటి తప్పు అయితే, జాయిన్ అయ్యి తెలిసో, తెలియకో వీడియో🎬, ఆడియో 🎤మైక్ లను Unmute చేసుకొని కోర్ట్ హియరింగ్స్ కి అంతరాయం /ఆటంకం కలిగేలా చేస్తున్నారు. దీనివలన అలాంటి వాళ్లపై కోర్ట్ కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఆకతాయి మిత్రులు గమనించగలరు.
NOTE:
1. సాధ్యమైనంత వరకు వర్చ్యువల్ మోడ్ లో హాజరు కావద్దు (9.30 VC లో ఏమి జరిగిందో చెపుతాము ).
2. ఒకవేళ హాజరైతే అన్ని మూసుకొని అనగా వీడియో, ఆడియో off చేసి కూర్చోండి.
3.ఎవరినైనా డిస్టబెన్స్ క్రియేట్ చేస్తే మేమే కోర్ట్ వారికీ హ ID లు సెండ్ చేస్తాం.
DSC అభ్యర్థులకి 45 - 60 రోజులు సమయం వస్తుంది అని ఎక్సమ్ పోస్టుపోన్ అవుతుంది అని చాలా గ్రూప్ లలో చెప్తున్నారు..
ప్రస్తుతం DSC అభ్యర్థులను చూస్తుంటే 3 నెలల క్రితం మమ్మల్ని (గ్రూప్ 2 అభ్యర్థులు) మేము చూసుకున్నట్లు ఉంది..
ఏవేవో గ్రూప్ లలో DSC గురించి వచ్చే msgs లు చూస్తూ లేదా ఎవరో చెప్పారు అని DSC పోస్టుపోన్ అవుతుంది అని మీకు మీరే అనుకోని ప్రిపేర్ అవ్వకుండా మీ జీవితాల్ని మీరు నాశనం చేసుకోకండి..
DSC అభ్యర్థులకి ఎన్నో సంవత్సరాల తరువాత వచ్చిన అవకాశం ఇది.. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎక్సమ్ పోస్టుపోన్ అవుతుంది అని సమయం వృధా చేసుకుంటున్నారు..
మా గ్రూప్ 2 అభ్యర్థులు కూడా మెయిన్స్ పోస్టుపోన్ అవుతుంది అని ప్రిపేర్ అవ్వకుండా చాలా ప్రయత్నం చేసారు.. కాని ఎక్సమ్ జరిగిపోయింది ఇప్పుడు భాదపడుతున్నారు అందరు అనవసరంగా అప్పుడు సమయం వృధా చేసుకున్నాం అని..
మీరు కూడా ప్రస్తుతం అలానే చేసుకుని మా గ్రూప్ 2 అభ్యర్థుల పరిస్థితి కి DSC అభ్యర్థులు రాకండి.. పోస్టుపోన్ అనేది మర్చిపోండి.. ఎక్సమ్ జూన్ లోనే అని సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి..
ఒకవేళ పోస్టుపోన్ అయితే ఆ సమయం మీకు రివిజన్ కి ఉపయోగ పడుతుంది.. పోస్టుపోన్ అవ్వకపోతే మీరు ముందుగానే జూన్ లోనే ఎక్సమ్ అని ప్రిపేర్ అయ్యుంటారు కాబట్టి ఇబ్బంది లేదు..
అలా కాకుండా గ్రూప్ లలో మీకు మీరు సొల్లు msgs లు పెట్టుకుంటూ ఎవరో ఏదో పోస్టుపోన్ అవుతుంది అని చెప్పారు అని ప్రిపేర్ అవ్వకపోతే.. చెప్పినోడు బానే ఉంటాడు అవి విన్నోళ్లు మాత్రం సంకనాకిపోతారు..
కొన్ని గ్రూప్ లలో DSC పోస్టుపోన్ అవుతుంది అని చెప్తున్నారు అని నాకు స్క్రీన్ షాట్స్ పెట్టారు.. ప్రభుత్వం DSC మీద ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.. ఇవన్నీ మిమ్మల్ని మభ్య పెట్టడానికి మాత్రమే..
సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి.. మీ సమయాన్ని వృధా చేసుకోకండి.. ప్రభుత్వం చెప్పిన డేట్స్ కే ఎక్సమ్ జరుగుతుంది అని సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి..
👉 Hit 3 Movie 👈
A Must Watch for Aspirants 💯 ..
Purpose enti !?
Just to Realise the Struggles and Sacrifices of the OFFICERs because of whom we are breathing here ...
Just to Rejuvenate yourself 💫 ..
Just To Remind Yourself Why You chosen this Path and What change you can bring once you become an Officer 🤘..
Good Message & Motivation you will get after watching the movie 🎯..
There are many Stories untold ...
Especially the ones who work as undercover they hardly get any recognition they deserve because of security issues...but still..
THEY ARE THE REAL HEROES🥇..
Go watch and Visualise Your Future as an OFFICER soon 👍..
👉 మే 1 నుంచి కొత్త జాబ్ నోటిఫికేషన్లు - తెలంగాణ
👉 జాబ్ క్యాలెండర్ & కొత్త నోటిఫికెషన్స్ ఎప్పుడు ఇస్తారో పక్కన పెడితే..
జాబ్ క్యాలెండర్ & కొత్త నోటిఫికెషన్స్ గురించి కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు - ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ ఉద్యోగం అనే మోజులో యువత ఉన్నంత వరకు ఈ మాఫియా ఆగదు..
వాళ్ళ పుస్తకాలు, వల్ల కోచింగ్ సెంటర్లు, వాళ్ళ యూట్యూబ్ సంపాదన కోసం ఏదొక సోది చెప్పుకుంటూ ఉచ్చులోకి దింపుతారు..
ప్రభుత్వ ఉద్యోగం ఆశ చూపి దోచుకోవడానికి కొన్ని కోచింగ్ వ్యాపార సంస్థలు ఉన్నాయి. మనం ఎలాగూ ఈ ఉచ్చులో పడి బయటకు రాలేక పోతున్నాం..
కొత్తగా వచ్చేవారిని మాత్రం ఈ ఉచ్చులోకి రానివ్వకండి. సంపాదించే వయసు లో సంపాదించాలి..వయసు తిరిగిరాదు.
రాజమండ్రి లోని dafini civils acadamy ఎవరికైనా తెలిస్తే మెసేజ్ చెయ్యగలరు..
రామచంద్ర
నిరుద్యోగ ఐక్య సమితి
1. ప్రస్తుత మెగా డీఎస్సీలో ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తున్నారు?
జ) మెగా డీఎస్సీ ద్వారా 16347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
2. ఈ పోస్టులు ఏ ఏ యాజమాన్యాల లో ఉంటాయి?
జ) ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, జువనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖాళీలతో పాటు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు మరియు ఆశ్రమ పాఠశాలలో ఖాళీలను భర్తీ చేస్తారు.
3. యాజమాన్యాల వారీగా ఖాళీల వివరాలను తెలపండి.?
1.MP, ZP, Municipal and Municipal corporation - 13192
2 APMS - 286
3.APREIS - 190
4.APSWREIS - 439
5.BCWREIS - 170
6.TW Ashram - 881
7.TW Gurukulam - 1143
8.Welfare of Differently Abled - 31
9 .Juvenile Welfare - 15
Total: 16347
4. మెగా డీఎస్సీ ద్వారా నింప పోతున్న పోస్టుల వివరాలు తెలపండి?
జ) మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారు
>సెకండరీ గ్రేడ్ టీచర్స (సాధారణ పాఠశాలలు)
> స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ (సాధారణ పాఠశాలలు)
>సెకండరీ గ్రేడ్ టీచర్స (స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక పాఠశాలలు)
> ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (స్పెషల్ ఎడ్యుకేషన్- ప్రత్యేక పాఠశాలలు )
> ఫిసికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (స్పెషల్ ఎడ్యుకేషన్- ప్రత్యేక పాఠశాలలు )
> పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (సొసైటీ పాఠశాలలు)
> ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (సొసైటీ పాఠశాలలు)
> ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (సొసైటీ పాఠశాలలు)
> ఫిజికల్ డైరెక్టర్స్ (సొసైటీ పాఠశాలలు)
> ప్రిన్సిపాల్ (సొసైటీ పాఠశాలలు)
5. మెగా డీఎస్సీలో అప్లికేషన్ నింపడంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
జ) మెగా డీఎస్సీ అప్లికేషన్ లో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం, రెండవ భాగంలో విద్యా అర్హతలు, అర్హత కలిగిన పోస్టుల వివరాలు, మూడవ విభాగంలో ఫీజు చెల్లింపు వివరాలు ఉంటాయి. ఒకటి రెండు విభాగాలలోని అంశాలను అభ్యర్థి ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చ. దరఖాస్తు ఫారం లోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. మూడు విభాగాలలోని వివరాలను నింపిన తర్వాత అర్హత కలిగిన మరియు ఎపిక చేసుకున్న పోస్టులను బట్టి ఒకొక్క పోస్టుకు రూ. 750 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడవ విభాగం లో ఎలాంటి సవరణలకు అవకాశం లేదు
6. గత డీఎస్సీలో ఫీజు చెల్లించిన వారు మరలా తిరిగి ఫీజు చెల్లించవలసిన అవసరం ఉందా?
జ) గత డీఎస్సీలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు, కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయదలచినట్లయితే ఆ పోస్టులకు మాత్రమే పోస్టుకు 750 రూపాయల చొప్పున అదనంగా ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
7. దరఖాస్తు నింపడానికి ఎప్పటి వరకు అవకాశం ఉంటుంది?
జ) మెగా డీఎస్సీ అభ్యర్థులు 20-04-2025 తేదీ నుండి 15-05-2025 తేదీ వరకు ఫీజు చెల్లించి దరఖాస్తులు నింపుకోవచ్చు.
8. మెగా డీఎస్సీ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఏమి చేయాలి?
జ) మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://cse.ap.gov.in /https://apdsc.apcfss.in వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులిటన్స్, సిలబస్, ఖాళీల వివరాలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
9. మెగా డిఎస్సి రాయాలంటే టెట్ లో కనీస అర్హత మార్కులు ఎన్ని ?
జ) ఓసీ అభ్యర్థులు 60% (90 మార్కులు) బిసి అభ్యర్థులు 50% (75 మార్కులు), యస్.సి, ఎస్.టి, వికలాంగ అభ్యర్థులు 40% (60 మార్కులు) కనీస అర్హత మార్కులు పొందాలి
10. అభ్యర్థి తన సర్టిఫికెట్లను ఎప్పుడు అప్లోడ్ చేయాలి ?
జ) అభ్యర్థి దరఖాస్తును నింపిన తరువాత అభ్యర్థి తప్పనిసరిగా తన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి.
11. మెగా డిఎస్సి లో రిజర్వేషన్లు ఎలా అమలు పరుస్తారు?
జ) జి ఓ 77 dt : 02-08-2023, సాధారణ పరిపాలన శాఖ ఇచ్చే తదుపరి ఉత్తర్వులను అనుసరించి వర్టికల్ మరియు హారిజాన్టల్ రిజర్వేషన్లు అమలు పరుస్తారు. హారిజాన్టల్ 8 4 2 (woman, PwBD, Ex - Service man, Sports) ముందుగా కేటాయింపబడవు. అభ్యర్థులు ఈ విషయంలో ఎలాంటి అపోహలకు లోనుకావద్దు.
12. హారిజాన్టల్ రిజర్వేషన్లో మహిళలకు రిజర్వేషన్ ఏవిధంగా అమలుచేస్తారు?
జ) 100 సైకిల్ హారిజాన్టల్ రిజర్వేషన్ అమలుజరుగుతుంది. జి ఓ 77 dt: 02-08-2023, ຜູ້ ລ້ ຕູ້ 5 ລ້ (woman, PwBD, Ex Service man, Sports) విభాగాలకు రోస్టర్ పాయింట్లను ముందుగా నిర్దారించకుండా అమలు చేయడం జరుగుతుంది
13. దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హతగల పోస్టులకు ఆప్షన్ ఎంపిక ఎలా చేసుకోవాలి?
షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదు.. అట్రాసిటీ కేసు చెల్లదు..
ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి చర్చి పాస్టర్ గా జీవనం సాగిస్తున్నాడు
అయితే చర్చి నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అక్కల రామిరెడ్డి మరికొంత మందిపై చింతాడ ఆనంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు..
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ అక్కల రామిరెడ్డి మరియు ఇతరులు హైకోర్టును ఆశ్రయించగా.. ఇరు వాదనలు విన్న హైకోర్టు మతం మారిన ఎస్సీ వ్యక్తి హిందువు కాజాలడని, అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని తీర్పునిచ్చింది..
నారా లోకేష్ గారి అకౌంట్ ఇది.. Msg ఆప్షన్ కూడా ఉంది..
జాబ్ క్యాలెండర్ కావాలి అనే ప్రతి నిరుద్యోగి లోకేష్ గారికి మర్యాదపూర్వకంగా msg చేయండి..
వేలల్లో msgs వెళ్ళాలి.. జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఇంతలా ఎదురు చూస్తున్నారా అనేంతగా msgs ద్వారా తెలియజేయండి..
ఇందులో తప్పు ఏం లేదు.. మనం మన నిరుద్యోగుల ఆవేదనని తెలియపరుస్తున్నాం అంతే..
ఎవరైతే జాబ్ క్యాలెండర్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ మీరు అది చేయండి ఇది చేయండి అనట్లేదు కేవలం ఒక msg మాత్రమే చేయండి చాలు.. మీరు మీ point of view లో జాబ్ క్యాలెండర్ కావాలి అని తెలియజేయండి
కనీసం 10వేల మంది నిరుద్యోగులు అయినా msgs ద్వారా ఈ రోజు మన నిరుద్యోగుల ఆవేదనని తెలియజేద్దాం..
#WE WANT JOB CALENDAR
#WE WANT GOVT JOB NOTIFICATIOS
లైబ్రరీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే మిత్రులు అందరు ఈ లెటర్స్ ని అందరికి MLC లకు పంపి ఈ ఔటసోర్సయింగ్ ద్వారా భర్తీ పక్రియని ఆపమని రిక్వెస్ట్ చేయండి.
Читать полностью…Tentative vacancies breakup for CSE 2025..
Читать полностью…DEPARTMENTAL TESTS - MAY 2025..
6th June, 2025 to 12th June, 2025..
CRIME INVESTIGATION DEPARTMENT (CID), ANDHRA PRADESH
NOTIFICATION FOR ENROLLMENT OF HOME GUARDS (CATEGORY-B)
(TECHNICAL & OTHER TRADES – VOLUNTARY SERVICE)
Notification No: 2007/E1/CID-AP/2024-25
Date: 28-04-2025
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం మరియు విద్యావంతులే నడుం బిగించాలి..
ప్రవేట్ పాఠశాలలను మించి ప్రభుత్వ పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాలను సదుపాయాలను విద్యను ప్రజలకు చేరువ చేద్దాం..
ప్రభుత్వ పాఠశాలల ప్రతిభను ప్రజల్లోకి తీసుకెళ్లదాం...