42623
👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
ఈరోజు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!
'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026'కు ఆమోదం.
'పీపీపీ పాలసీ-2026' ముసాయిదాకు కేబినెట్ ఆమోదం.
'దిశా బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024' ఉపసంహరించి మరింత పటిష్ఠ చట్టాలకు ఆమోదం.
UDAల పునర్‌వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం.
'పాదచారుల భద్రత పాలసీ-2026'కు కేబినెట్ ఆమోదం.
DSC - 2025 పై AP హైకోర్టులో విచారణ..
CBI విచారణకు ఆదేశించాలంటూ పిల్‌లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ.
స్పోర్ట్స్ కోటాతో నష్టపోయిన అభ్యర్థులు నేరుగా కోర్టుకు ఎందుకు ఆశ్రయించడం లేదు?: హైకోర్టు
బాధిత అభ్యర్థులు నేరుగా కోర్టును ఆశ్రయించేందుకు భయపడుతున్నారన్న వాదనతో ఏకీభవించలేం: హైకోర్టు.
DSC 2025 పై CBI విచారణకు హై కోర్టు నిరాకరణ.
సుప్రీం కోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు ఆమోదం..
సుప్రీం కోర్టు సవరణ బిల్లు-2026 కు ఆమోదం తెలిపిన లోక్ సభ..
చీఫ్ జస్టిస్తో కలిపి 34 నుంచి 38కి పెరగనున్న న్యాయమూర్తుల సంఖ్య..
బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే లోక్ సభ ఆమోదం.
ఏకోపాధ్యాయ పాఠశాలలపై ప్రజాహిత వ్యాజ్యం.
పూర్తి స్థాయిలో బోధన అందడం లేదని ఫిర్యాదు..
ఉపాధ్యాయుల ఖాళీలు, భర్తీ చర్యలపై వివరాలివ్వాలని ప్రభుత్వానికి AP హైకోర్టు ఆదేశాలు.
నిరుద్యోగుల గళం – ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు మా విజ్ఞప్తి
గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి శ్రీr నారా లోకేష్ గారు, ప్రజాప్రతినిధులారా..
మేము రాజకీయాల కోసం రాలేదు..
మా భవిష్యత్తు కోసం వచ్చాం..
మా ఉద్యోగాల కోసం వచ్చాం..
మా కుటుంబాల ఆశల కోసం వచ్చాం..
👉 నిరుద్యోగుల తరఫున ప్రభుత్వానికి మా ప్రశ్నలు.
👉 ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ మొదటి రెండు సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు.
👉 రెండు సంవత్సరాల తర్వాత ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌లో కూడా రెండో దశ నోటిఫికేషన్లు వాయిదా పడుతున్నాయి.
👉 ఆగస్టు 15న విడుదల కావాల్సిన నోటిఫికేషన్లు సెప్టెంబర్ 15కు వాయిదా పడ్డాయి.
👉 సెప్టెంబర్ 15న విడుదల కావాల్సిన నోటిఫికేషన్లు అక్టోబర్ 15కు వాయిదా పడ్డాయి.
ఇలా ప్రతి నెల నోటిఫికేషన్లు వాయిదా వేస్తూ పోతే ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఎలా పూర్తి చేస్తారు?
వచ్చే సంవత్సరం కొత్త జాబ్ క్యాలెండర్‌ను ఎలా ఇస్తారు?
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిరుద్యోగులు ఎలా నమ్మాలి?
10,000 పోస్టులు కాదు..కనీసం 50,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ కావాలి..!
బడ్జెట్ లేదని ఉద్యోగాలను తగ్గించడం కాదు..
యువత భవిష్యత్తును తగ్గించడం.
ఉద్యోగాలపై చేసే ఖర్చు వ్యయం కాదు..
అది రాష్ట్ర భవిష్యత్తుపై పెట్టుబడి.
ఉద్యోగాల భర్తీతో రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు..
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కేవలం నిరుద్యోగులకు అవకాశం ఇవ్వడం మాత్రమే కాదు.. రాష్ట్ర అభివృద్ధికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
ఒక యువకుడికి ఉద్యోగం వస్తే ఒక కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది..
ఉద్యోగుల ఆదాయం పెరగడం వల్ల మార్కెట్‌లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. వ్యాపారాలు, సేవా రంగాలు అభివృద్ధి చెందుతాయి.
ఉద్యోగుల ద్వారా పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది.
చదువుకున్న యువత తమ ప్రతిభను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించగలుగుతుంది.
ఖాళీ పోస్టులు భర్తీ అయితే ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా, సమర్థవంతంగా అందుతాయి.
అందుకే ఉద్యోగాల భర్తీని ఖర్చుగా చూడకండి..రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే పెట్టుబడిగా చూడండి.
నిరుద్యోగుల బాధ ఒక్కసారి ఆలోచించండి
సంవత్సరాల తరబడి చదువుతున్నాం..
కుటుంబాలు అప్పులు చేసి చదివిస్తున్నాయి..
కోచింగ్, పుస్తకాలు, హాస్టల్ కోసం ఖర్చు చేస్తున్నాయి..
ప్రతి నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాం...
కానీ..
నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్నాయి..
పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది..
నియామకాలు సంవత్సరాల తరబడి పూర్తికావడం లేదు..
దీని వల్ల వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితిని కోల్పోతున్నారు.
ఒకసారి వయస్సు దాటితే..
ఆ అవకాశం జీవితంలో తిరిగి రాదు.
నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు..
1. జాబ్ క్యాలెండర్‌ను వెంటనే అమలు చేయాలి.
2. 10,000 పోస్టులు కాదు.. కనీసం 50,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.
3. హోం శాఖలో ఖాళీగా ఉన్న 19,999 పోస్టుల్లో 11,639 పోస్టులు భర్తీ చేయాలి. అందులో 1,639 ఎస్సై పోస్టులు, 10,000 కానిస్టేబుల్ పోస్టులు విడుదల చేయాలి.
4. హోం శాఖలో గత ఏడు సంవత్సరాలుగా సరైన సమయంలో నోటిఫికేషన్లు లేకపోవడం వల్ల వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితిని కోల్పోయారు.
5. నోటిఫికేషన్ల ఆలస్యం కారణంగా పెరిగిన వయస్సును దృష్టిలో ఉంచుకుని హోం శాఖ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు వయోపరిమితిని పెంచి న్యాయం చేయాలి.
6. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.
7. గ్రూప్–2 పోస్టులను 1,000కు పెంచాలి.
8. లైబ్రేరియన్ పోస్టులు 100 కాదు.. 2,000 పోస్టులు భర్తీ చేయాలి.
9. డీఎస్సీ, హాస్టల్ వార్డెన్ మరియు అన్ని శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.
ప్రజాప్రతినిధులారా..
"నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు.. నిరుద్యోగానికి వ్యతిరేకం."
మేము ఉద్యోగాలు అడుగుతున్నాం... ఉపకారం కాదు..!
మేము అవకాశాలు అడుగుతున్నాం.. దానం కాదు..!
మా హక్కులను మాత్రమే కోరుతున్నాం.
గత ప్రభుత్వాల కాలంలో కూడా నిరుద్యోగుల సమస్యలను చూశాం. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నాం.
ప్రజాస్వామ్య పద్ధతిలో మా సమస్యలను తెలియజేస్తున్నాం. మా గళాన్ని ప్రభుత్వం వినాలని కోరుతున్నాం.
ఒక ఉద్యోగం అంటే ఒక జీతం మాత్రమే కాదు..
👉 ఒక కుటుంబానికి భరోసా.
👉 తల్లిదండ్రుల కష్టానికి ఫలితం.
👉 ఒక యువకుడి ఆత్మగౌరవం.
👉 ఒక కుటుంబ భవిష్యత్తు.
హామీలు కాదు.. అమలు కావాలి!
మాటలు కాదు.. నోటిఫికేషన్లు కావాలి!
ఆలస్యం కాదు.. వెంటనే జాబ్ క్యాలెండర్ అమలు కావాలి!
"నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు.. కేవలం నిరుద్యోగానికి మాత్రమే వ్యతిరేకం."
కానిస్టేబుల్, గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచాలి.
Читать полностью…
పగలు కొలువు..రాత్రి చదువు
ఉద్యోగం చేస్తూనే డిగ్రీ, పీజీ అభ్యసించొచ్చు..
బిఈ, బి టెక్, ఎం టెక్, ఎంబిఎ కోర్సుల్లో ఉద్యోగుల ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతి.
AP history జోగి నాయుడు సార్ నిన్న సాయంత్రం చనిపోయారు.
ఏపీ హిస్టరీ కి తిరుగులేని బుక్ గా నిలిచింది..
ఆ బుక్ రాసిన వారికి రుణపడి ఉంటాం ..
రాష్ట్ర aspirants కి AP హిస్టరీ విషయంలో మీరు చేసిన సేవ మరువలేనిది.
ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిద్దాం.
AP police aspirants demand 10000 post's
Читать полностью…
గడియారం ప్రతిరోజూ ఒకే సమయాన్ని చూపిస్తుంది..
కానీ ఆ సమయాన్ని ఎలా ఉపయోగించాలో నిర్ణయించేది మనమే..
ఈరోజు మనం చేసే ప్రతి సరైన నిర్ణయం..
రేపటి మన భవిష్యత్ ని నిర్మిస్తుంది.
ఒక్క గంట మొబైల్ వాడితే..
ఒక రోజు ఆనందం దొరకొచ్చు.
అదే ఒక్క గంట పుస్తకానికి ఇస్తే..
జీవితాన్ని మార్చే అవకాశం దొరుకుతుంది.
అందుకే ఈరోజు మన సమయాన్ని
మన కలలపై పెట్టుబడిగా పెడదాం.
గుర్తుంచుకోండి..
"విజయం ఒక్కసారిగా రాదు.
ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఒకరోజు పెద్ద విజయంగా మారుతాయి."
'హీరో' అవ్వాలన్నా సోషల్ మీడియా నే..
'జీరో' అవ్వాలన్నా సోషల్ మీడియా నే..
సోషల్ మీడియా ని మనం ఎలా వాడుతున్నాం అనే దాని మీదే మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
ఉపయోగపడే పనులకి సోషల్ మీడియా ని ఉపయోగిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయ్.
పనికిరాని వాటికి సోషల్ మీడియా ని ఉపయోగిస్తే అదే మన జీవితాన్ని సంకనాకిస్తుంది.
ప్రస్తుత సమాజంలో దాదాపుగా అందరు సోషల్ మీడియా బానిసలే ..జాగ్రత్త..!
FIFA WC కరెంట్ అఫైర్స్
ఫిఫా వరల్డ్ కప్ 2026 విశ్వ విజేత స్పెయిన్ :
స్పెయిన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఫిఫా (FIFA) ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌లో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో అదనపు సమయంలో (Extra Time) 106వ నిమిషంలో కార్లోస్ సోలెర్ (Carlos Soler) చేసిన గోల్‌తో స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించింది.
2. 2026 ప్రపంచకప్ ఎడిషన్ సంఖ్య (World Cup Edition Number)
2026లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ 23వ ఎడిషన్ (23rd Edition). ఇది చరిత్రలోనే మొదటిసారిగా 48 జట్లతో నిర్వహించిన అతిపెద్ద ప్రపంచకప్ టోర్నమెంట్.
3. ఆతిథ్య వేదికల వివరణ (Venues Information)
ఆతిథ్య దేశాలు (Co-hosts): ఈ ప్రపంచకప్ టోర్నమెంట్ చరిత్రలోనే తొలిసారిగా మూడు ఉత్తర అమెరికా దేశాలు — అమెరికా (USA), మెక్సికో (Mexico), మరియు కెనడా (Canada) సంయుక్తంగా నిర్వహించాయి.
నగరాలు/స్టేడియంలు :
మొత్తం 16 నగరాల్లో మ్యాచ్‌లు జరిగాయి (అమెరికాలో 11, మెక్సికోలో 3, కెనడాలో 2).
4. ఫైనల్ మ్యాచ్ వేదిక (Final Match Venue)
ఫిఫా 2026 ప్రపంచకప్ ఫైనల్ పోరు అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న మెట్‌లైఫ్ స్టేడియం (MetLife Stadium - East Rutherford / New York New Jersey) వేదికగా జరిగింది.
5. స్పెయిన్ ఎన్నిసార్లు ప్రపంచకప్ గెలిచింది? (How many times Spain won)
స్పెయిన్ ఇప్పటివరకు మొత్తం 2 సార్లు (Two Times) ఫిఫా ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది:
మొదటి టైటిల్: 2010 (దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీ)
రెండవ టైటిల్: 2026
6. అర్జెంటీనా ఎన్నిసార్లు ప్రపంచకప్ గెలిచింది ? (How many times Argentina won)
అర్జెంటీనా ఇప్పటివరకు మొత్తం 3 సార్లు (Three Times) ప్రపంచకప్ విజేతగా నిలిచింది:
మొదటి టైటిల్: 1978
రెండవ టైటిల్: 1986
మూడవ టైటిల్: 2022
(ఈ 2026 ఎడిషన్‌లో అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది).
7. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ / గోల్డెన్ బాల్ (Player of the Series)
ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టును విజేతగా నిలిపిన స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ (Lamine Yamal) కు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' (గోల్డెన్ బాల్) పురస్కారం లభించింది.
8. బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador)
ఫిఫా అధికారికంగా ఒకే ఒక్క వ్యక్తిని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించదు. అయితే ప్రపంచకప్‌కు ముందు ప్రచారం మరియు రష్యా/ఖతార్ నుంచి 2026 ఎడిషన్ మార్కెటింగ్ బాధ్యతల్లో ఫిఫా ఫ్యాన్ అంబాసిడర్లుగా (FIFA Fan Ambassadors) ప్రముఖ అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజాలు మరియు స్థానిక క్రీడా ప్రముఖులు వ్యవహరించారు.
9. ప్రసార హక్కులు/ భారతదేశంలో ఎవరు ? (Who is in India / Broadcast Rights)
భారతదేశంలో ఫిఫా 2026 ప్రపంచకప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులను (Broadcasting & Streaming Rights) వియాకామ్ 18 (Viacom18) సొంతం చేసుకుంది. అభిమానులు ఈ మ్యాచ్‌లను టీవీలో Sports18 ఛానెళ్ల ద్వారా మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై JioCinema యాప్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించారు.
PV SINDHU BECOMES THE FIRST EVER INDIAN TO WIN THE JAPAN OPEN 🇮🇳
- Sindhu defeats home favourite and Three-time World champion Akane Yamaguchi
AP Group-2 phase -3 Job calendar
Date of Notification : September 15th
ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయబడినవి.
Читать полностью…
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బిల్లుకు రాజ్యసభ ఆమోదం..
Читать полностью…
EWS సర్టిఫికెట్ ఉద్యోగ నోటిఫికేషన్ కి ముందు సంవత్సరానిదే ఉండాలి: సుప్రీం కోర్ట్
Читать полностью…
639 పోస్టులకు 1,00,000 మంది పోటీ పడితే..
ఒక్కో పోస్టుకు పోటీ = మొత్తం అభ్యర్థులు ÷ మొత్తం పోస్టులు..
= 1,00,000 ÷ 639 ≈ 156.5
అంటే..
ఒక్కో పోస్టుకు సుమారు 157 మంది పోటీ పడుతున్నట్లే.
పోటీ నిష్పత్తి (competition ratio): 1 : 157 (సుమారుగా)
అంటే ఒక పోస్టు కోసం సగటున 157 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఇక పోటీ ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోండి.
ఈ ఒక్క నోటిఫికేషన్ నే కాదు రాబోయే అన్నీ నోటిఫికెషన్స్ కి కూడా ఇదే విధంగా పోటీ ఉంటుంది.
ఇంత పోటీలో మనము ఎంత కష్టపడి చదవాలో అర్ధం చేసుకోండి.
సమయం వృధా చేయకండి.. సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి.
ప్రభుత్వ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు, 2026కు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదల..
ఈ బిల్లును పార్లమెంట్ గురువారం ఆమోదించింది. కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టడం, ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ పరీక్షలలో అక్రమ పద్ధతులను అరికట్టడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం.
సమయం గడిచిపోయాక బాధపడటం కన్నా, సమయం ఉన్నప్పుడే శ్రమించడం ఉత్తమం..
"రేపు అనేది మన భ్రమ, ఈరోజు మనం చేసే పనే మన భవిష్యత్తు"..
"నిద్రపోతూ కలలు కనడం కాదు, ఆ కలల కోసం నిద్రను కూడా త్యాగం చేయడమే అసలైన విజయం".
"Never give up"
జాబ్ క్యాలెండర్ లో పోస్టులు పెంచాలని నిరసన..
Читать полностью…
2026 ఆగస్టు 15న విడుదల కావాల్సిన Phase-II Job Calendar Notifications ఇప్పుడు 2026 సెప్టెంబర్ 15న విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
ఈ దశలో ప్రధానంగా:
1. APPSC Group-1
2. SI Notification
3. Constable Notification
4. ఇతర శాఖల నోటిఫికేషన్లు
విడుదలయ్యే అవకాశముందని సమాచారం.
ఇది అధికారిక ప్రకటన కాదు. ప్రభుత్వం/సంబంధిత నియామక సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి ఉండండి..
ప్రస్తుతం దీనిపై అధికారిక ధృవీకరణ విడుదల కాలేదు.
Note:
2026 అక్టోబర్ 15న APPSC గ్రూప్-2 మరియు ఇతర నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.
మిత్రమా సమయం వృధా చెయ్యకు..
30 సంవత్సరాలు వయస్సు వస్తున్నా ఇంకా చదువుతూనే ఉన్నావా అని అందరు ఎత్తి పొడిచే మాటలు..
యవ్వనం మొత్తం ప్రేపరషన్ లోనే గడిచిపోయింది..
రేపు ఏ ఉద్యోగం రాకపోతే.. మన పరిస్థితి ఏంటీ అన్న ఊహే చాలా భయంకరంగా ఉంది.
విలువైన వయస్సు, డబ్బు రెండు ప్రేపరషన్ లోనే పెట్టుబడిగా పెట్టేసాం..
ఆ విలువైన పెట్టుబడి(వయస్సు) కి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా పొందే తీరాలి.
బయట మనం చూసినంత అందంగా మరియు మనం కలలు కనెంత గొప్పగా ఎం ఉండదు ప్రభుత్వ ఉద్యోగం అంటే..
ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చెప్తున్నా..
చాలి చాలని జీతాలు..
పై అధికారులకి సేవలు..
కష్టానికి తగ్గ గుర్తింపు ఉండదు..
రాజకీయ ఒత్తిళ్ళు..
కులాన్ని చూసి ఇచ్చే మర్యాద..
ఒక రకంగా చెప్పాలంటే చదువుకున్న బానిసలం..
వీటి కోసమా నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివి job కొట్టింది అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది.
ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి job సాధించిన మన వాళ్లకి కష్టం విలువ తెలుసు.
అందుకే జనాల్ని మోసం చేయలేని మనస్సు..
మాటలతో మాయ చేయలేని మనస్తత్వం..
ఆ రెండు ఉన్న వాళ్ళే చాలా వరకు పై అధికారులకు డబ్బా కొడుతూ బ్రతికేస్తున్నారు.
అందుకే చెప్తున్నా మిత్రులారా..
ఏదొక ఉద్యోగం కాదు.. కొడితే గట్టిగనే కొట్టాలి
బాగా చదవండి.. మంచి job, పెద్ద job సాధించండి.
ఒక్కసారి అవకాశం పోతే తిరిగి రాదు..
వచ్చిన కూడా ఆ సమయానికి మనకి ఓపిక, వయస్సు రెండు ఉండవు.
వయస్సు, ఓపిక ఉన్నప్పుడే ఏదైనా గట్టిగా సాధించాలి (మళ్ళీ పుడతామా ఏంటీ🔥)
పోలీస్ శాఖలో 10,000 పోస్టులు భర్తీ చెయ్యాలి - పోలీస్ అభ్యర్థులు
Читать полностью…
FIFA Word Cup 2026
SPAIN ARE WORLD CUP CHAMPIONS FOR THE SECOND TIME! 🏆🏆