ఓం శ్రీ చిన్న రేవల్లి అంగడి వీరభద్రాయ నమః
ఈరోజు రెండవ కార్తీక సోమవారం సందర్భంగా వీరభద్ర స్వామికి అభిషేకం చేయడం జరిగింది
అరుణాచల శివ🙏🙏🙏
అరుణాచల శివ🔥🔥🔥
అరుణాచల శివ❤️❤️❤️
అరుణాచలా⛰️⛰️⛰️⛰️
ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🙏🥰🥰🔥🔥❤️❤️
కార్తీకజ్యోతి🔥“ నెయ్యి డొనేషన్స్” ఇలా పంపించండి 🙏 #కార్తీకజ్యోతిఅరుణాచలం #నెయ్యిడొనేషన్స్
https://youtube.com/shorts/2d5LJ17aOA8?feature=share
🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏
🌼*దధీచి మహర్షి కథ* 🌼
🌼🌿🌼🌿🌼🌿🌼🌿
*🌼శ్రీ పద్మ పురాణం లోని కథ🌼
పూర్వం పరా త్వష్ట అనే దంపతులుండే వారు. ఎంతకాలం గడచినా వారికి సంతానం కలగలేదు. ఆమె పుత్రప్రాప్తికై పరమేశ్వరునకు తపము చేయసాగింది. ఏకాగ్ర చిత్తంతో మహాదేవుని ధ్యానం చేసింది. వేయి సంవత్సరముల పరాసాధ్వి యొక్క తపస్సునకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమైనాడు. ఆమె “పరమశివా! శూరుడు శస్త్రాస్త్రాలకు చంపబడని వాడు, విప్రదానవ రూపధరుడు అయిన పుత్రుని ప్రసాదించు” అని కోరినది.
పరమేశ్వరుని వరానుసారం ఆమెకు వృత్రుడనే పుత్రుడు కల్గినాడు. స్వయంగా శుక్రాచార్యులవారే ఆ వృత్రునికి విద్యాబోధ చేసినాడు. వరప్రభావంతో, గురుకృపతో మహాతేజసంపన్నుడైనాడు వృత్రుడు. కాని అతనిలో బలగర్వం ఎక్కువయ్యింది. చివరికి దేవేంద్రుని మీద దండెత్తాడు! అమిత బలవంతుడైన వృత్రుడు దేవాధిపతి అయిన ఇంద్రుడు 4౦౦౦ యేండ్లు యుద్ధం చేశారు. చివరికి వృత్రుడు విజయం పొందాడు. పరాజితుడైన శచీపతి బ్రహ్మలోకం చేరాడు. మించిన బలగర్వం మత్సరంగా మారగా వృత్రుడు శుక్రాచార్యునితో ఇలా అన్నాడు.
“యుద్ధంలో ఓడిన ఇంద్రుడు బ్రహ్మలోకం వెళ్ళాడు. నేనూ అక్కడి వెళ్ళాలి. దారి చెప్పండి”. శుక్రుడిలా బదులిచ్చాడు “రాక్షసనాథా! నీవు బ్రహ్మలోకానికి పోలేవు. తృప్తికి మించిన సంపద లేదు. త్రిలోకాధిపత్యంతో సంతృప్తిపడు”. “ఇంద్రుడున్నంత వరకూ నాకు సుఖం లేదు. వాడిని నాశనం చేయాలి. ఇంద్రుడికి బ్రహ్మలోకం వెళ్ళే అర్హత ఎలా వచ్చింది? నాకెందుకు లేదు” అని వృత్రుడన్నాడు. “పూర్వం పవిత్రమైన నైమిశారణ్యంలో 1000 సంవత్సరాలు ఇంద్రుడు శివునికై తీవ్ర నిష్ఠతో తపస్సు చేశాడు. అంతటి తపశ్శాలి కనక బ్రహ్మలోక ప్రవేశం ఇంద్రునికి శంకరుని అనుగ్రహం వలన కలిగింది” అని చెప్పాడు శుక్రుడు. వెంటనే వృత్రుడు నైమిశారణ్యం చేరి తపస్సు ఆరంభించాడు.
దుష్టుడైన వృత్రుని సంహారమునకు శ్రీకారం చుట్టిన మహావిష్ణువు ఇంద్రునితో ఇలా అన్నాడు “సురేశ్వరా! పరమేశ్వరుని వర ప్రభావం వలన వృత్రుడు శస్త్రాస్త్రాలకు అవధ్యుడు. సరస్వతీ నదీ తీరంలో పరమనిష్ఠతో దధీచి మహర్షి తపమాచరిస్తునాడు. నూరు మూరల ప్రమాణంలో ఉన్న ఆ మహనీయుని వెన్నెముక వ్రజ్రము కంటే రెండు రెట్లు పటిష్టమైనది. ఆ దయాళువును లోకహితార్థము తన అస్థిని ఈయమని ప్రార్థించండి”. నారాయణుని అనుజ్ఞ తీసుకుని దేవేంద్రుడు కురుక్షేత్రంలో నదీతీరంలో ఉన్న మహర్షి శిరోమణి వద్దకు వెళ్ళాడు.
దధీచి మహర్షి ఇంద్రుని రాకకు కారణమేమని అడిగినాడు. ఇంద్రుడు పూర్వ వృత్తాంతమంతయు తెలిపి ఇలా అన్నాడు “మహానుభావా! వృత్రుని ఆగడాలు మితిమీరుతున్నాయి. అతని సంహరించకపోతే విబుధ (పండిత) వినాశం తప్పదు. దయచేసి మీ అస్థిని మాకు ప్రసాదించండి”.
ఇంద్రుడు చేసిన ప్రార్థన విని దధీచి మహర్షి మహదానందంతో పొంగిపోయాడు. లోక హితార్థము తన శరీరం వినియోగపడటం కన్నా కావలిసినది ఏమున్నదన్నాడు. యోగశక్తితో శరీరత్యాగం చేశాడు! దధీచి మహర్షి చేసిన అసామాన్యమైన త్యాగానికి విభ్రమితుడైన వేల్పుదొర దధీచికి నమస్కరించాడు. అస్థితో వజ్రాయుధాన్ని చేయించి లోకభీకరుడైన వృత్ర సంహారం చేశాడు.
🌼ఇందులో నుండి మనం తెలుసుకోవలసిన విషయాలు:🌼
👉మహనీయులు పరోపకారార్థము తమ శరీరమును కూడా త్యాగం చేయడానికి వెనకాడరు. అడగంగానే మహదానందంతో ఇంద్రునికి తన అస్థిని ఇచ్చి దధీచి మహర్షి మహకు మార్గదర్శి అయినాడు.
గర్వం అహంకారం వినాశ హేతువులు. బలగర్వంతో హుంకరీచిన వృత్రుడు ఎంతో వరబలం ఉండికూడా మత్సరంతో ఇంద్రుని నాశనం చేయబోయి తానే నాశనమైనాడు.
🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏
_*అరుణాచల మహాత్మ్యం - గౌతముని పూర్వగాథ & గిరి ప్రదక్షిణ మహాత్యం...*_
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
గౌతమ మహర్షి తల్లి పార్వతితో ఇట్లు చెప్పెను . పరమశివుని ఆజ్ఞ ఒకసారి కైలాసములో నాకు ప్రాప్తించినది . అదేమనగా తీర్థయాత్రలు చేయమని . శివాజ్ఞ నెరవేర్చుటకై నేను అనేక క్షేత్రములను దర్శించి అనేక లింగములను సేవించితిని .
అనేక శివక్షేత్రములు దర్శించితిని . కొన్ని స్వయంభు లింగములను కూడా దర్శించితిని . శివ స్మరణతో భూమండలమంతా తిరిగి తిరిగి ఈ అరుణాద్రి లింగమును చేరుకుంటిని . ఇక్కడ సేవించు మహాపురుషులను చూచి నా తపము ఫలించెనని పర్వత రూపమున నిలిచిన ఈ లింగము మరెక్కడ లేదని గ్రహించితిని .
శివుని స్తుతించితిని . నా ప్రార్థనను విని పరమశివుడు ప్రసన్నుడై దర్శనమిచ్చి అనునిత్యము నన్ను ఈ అరుణాద్రి సన్నిధియందే ఉండి అర్చించి తపమాచరించి శివ మహాత్మ్యమును సర్వజీవులకును తెలియచేయుమని పరమేశ్వరుడు ఆనతినిచ్చెను . కావున ఈ అరుణాచలములో కనిపించే గిరి మామూలు కొండకాదు .
సాక్షాత్తు పరమశివుడు పర్వత రూపముగా నిలిచిన లింగము అని ఎరుంగవలెను . ఆనాటి నుండి గౌతమ మహర్షి శివుని ఆజ్ఞను మరువక అరుణాద్రిని విడువక అక్కడే నివశించుచుండెను .
అంత గౌరీదేవి గౌతముని పూర్వగాధ విని అరుణాచలగిరి ప్రదక్షిణ మహాత్మ్యమును తెలుపమని కోరెను . గౌతముడిట్లు చెప్పెను . పరమేశ్వరుడు నాకిట్లు ఆనతిచ్చెను .
1. నా గిరి ప్రదక్షిణ మాత్రమున సర్వ పుణ్యతీర్ధములలో స్నానము చేసిన ఫలితము కల్గును
2. అరుణగిరి ప్రదక్షిణముచే అన్ని శాస్త్రముల పారంగతత్వము లభించును .
3. సమస్త యజ్ఞకర్మముల ఫలితము దక్కును .
4. మానసిక వాక్కు శారీరక సంబంధించిన పాపములు నశించును .
5. అరుణగిరి చుట్టు ఎందరో సిద్ధులు , దేవతలు మరియు మహర్షుల ఆశ్రమములున్నవి .
6. ఈ గిరి అగ్నిమయమని దానిలోపల గుహ ఉన్నదని తెలిసికొనుము .
7. ప్రదక్షిణ చేయునపుడు ధ్యానించుకొనుచు మెల్లగా ప్రదక్షిణ చేయవలెను .
8. ఎవరి చేయిని పట్టుకొనక నిండు గర్భవతివలె అడుగులో అడుగువేస్తూ ప్రదక్షిణ చేయవలెను .
9 . అడుగుల చప్పుడు కూడా వినపడరాదు .
10. దారిలో నడుచుచున్నప్పుడు మనువులు , దేవతలు , సిద్ధులు మొదలగువారు నడుచురుని గుర్తించి వారి దారికి అడ్డురాక నడువవలెను .
11. శివ నామ సంకీర్తనము చేయవలెను .
12. దారిలో బీదలకు దానము చేయవలెను .
13. నడుచువారి బాధ్యతను నేనే ( శివుడు ) చూచుకొందును .
14. అరుణగిరి ప్రదక్షిణ చేయువారి పాదములను మోయుటకు అనేక దేవతల వాహనములు పోటీపడును .
15. ప్రదక్షిణ చేసిన వారికి శివప్రాప్తి కల్గును .
16. ప్రదక్షిణ చేసినవారికి తక్షణమే వారి శరీరము వజ్ర శరీరమైపోవును .
17. ప్రదక్షిణ చేయువారికి వారు ఎంత భక్తి ప్రపత్తులతో చేయుచున్నారో అని దేవతలు అదృశ్యరూపులై గమనించుచుందురు .
18. సోమవారం ప్రదక్షిణ అజరామరత్వమిచ్చును .
19. మంగళవారం ప్రదక్షిణ సార్వభౌమత్వము నిచ్చును .
20. బుధవారము పాండిత్యమొసంగును .
21. గురువారం గురుత్వమును సంపాదించును .
22. శుక్రవారము విష్ణు పదమును పొందించును .
23. శనివారం గ్రహపీడ వదిలి జయము ప్రాప్తించును .
24. ప్రదక్షిణ చేయువారు పాదములకు దెబ్బ తగిలి రక్తము కారినచో దేవేంద్రుడు ధరించు మందార పువ్వు పొడిచే ఆ రక్తము తుడువబడును .
25. రాళ్ళు తగిలి నొప్పి కల్గిన మహాలక్ష్మి శరీరముపై పూయబడు కుంకుమ లేపనముతో తొలగింపబడును .
26. ప్రదక్షిణము చేయువారు స్వర్గములో మణిపర్వత శృంగములపై విహరించి కల్పవృక్షచ్ఛాయలో విశ్రమింతురు
పై విధముగా గౌతముడు ఆ పరమేశ్వరుడు తనకిచ్చిన ఆనతిచే పార్వతీదేవికి ఆ అరుణాచల గిరి ప్రదక్షిణ మహాత్మ్యమును వివరించెను .
అరుణాచలశివ.. అరుణాచలశివ... అరుణాచలశివ...
*స్వస్తి..*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
*3) అగ్ని :*
*జఠరాగ్ని రూపంలో శరీరంలో ఉంటుంది. చర్మం, ముక్కు, కళ్లు, చెవులు, నాలుక అనే ఐదు జ్ఞానేంద్రియాలు అగ్ని తత్త్వం ఆధారంగా ఏర్పడ్డాయి.*
*4) వాయువు :*
*శరీరంలో ప్రాణం వాయురూపంలోనే ఉంటుంది. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమాసం అనే పంచప్రాణాలు ఈ తత్త్వం ద్వారా ఏర్పడ్డాయి.*
*5) ఆకాశం :*
*అంతఃకరణంగా ఆకాశతత్త్వం మనిషిలో ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారం అనే అంతరింద్రియాలు దీని ద్వారా ఏర్పడతాయి...*
*🔱 ఓం నమః శివాయ 🔱*
🌹🌹🌹 🙏🕉️🙏 🌹🌹🌹
💥 *విజయదశమి శుభాకాంక్షలు.* 💥
*"దశహర"* అనే సంస్కృత పదం క్రమంగా దసరా గా మారింది. మనలోని *పది అవగుణాలను* హరించేది ఈ *దసరా* పండుగ.
01. కామ (Lust).
02. క్రోధ (Anger).
03. లోభ (Greed).
04. మోహ (Attachment).
05. అహంకార (Ego).
06. ఈర్ష్య (Jealousy).
07. ద్వేష (Hate).
08. పగ (Revenge).
09. స్వార్థ (Selfishness).
10. సోమరితనం (Laziness).
ఈ *పది రాక్షస దుర్గుణాలపై* విజయం సాధించే శక్తినిచ్చేది కనుక దీనిని "విజయదశమి అనికూడా అంటారు.
*లోకా సమస్తా సుఖినోభవంతు*🕉️
శూలేనౌ పాహి నౌ
పాహి ఖడ్గన చామ్బికె ||
ఘజ్జాస్వనేన నః పాహి చాపజ్యానిః స్వనేన చ ||ఈ మంత్రంలో 'న' అను అక్షరం 9 మార్లు ప్రయోగించబడినది. దీని అర్థము కూడా అద్భుతమైనది. 'హే దేవీ! నీ ఖడ్గంతో నా దైహిక, దైవిక మరియు భౌతిక కష్టాలను ఖండించి వేయుము.
జాగృత, స్వప్న, సుషుప్తుల వ్యాధులను దూరం చేయుము. నేను మూడు దేహములు అనగా స్థూల సూక్ష్మ కారణశరీరాల కాలావధులను నాద, స్పంద మరియు ప్రణవం ద్వారా అతిక్రమించుదునుగాక!
కారణ మహాకారణ శరీరాలలో మహిషాసుర రూపంలో ఉన్న అహంకారమును షట్చక్రభేదన ద్వారా శమింపజేసి, సహస్రారం లేక బ్రహ్మ రంధ్రంలో ప్రవేశించి,
క్రమక్రమంగా ఊర్ధ్వగతిని పొంది జ్ఞాన సామ్రాజ్యంలో ప్రవేశించుదునుగాక!" అనే ప్రార్ధన ఇక్కడ చెయ్యబడింది. ఈ కొద్ది శబ్దాలలో దీని దివ్యమైన అర్థమును సంకేతముగా పొందగలము.
సాధకుల సముదాయము నవార్ణమంత్రమును నవార్ణవ మంత్రం అని కూడా పిలుస్తారు. నవ అర్ణవ అనగా 9 సముద్రాలు. ఈ మంత్రంలో 9 అక్షరాలు ఉన్నాయి.
అవి సాధకుడికి 9 సముద్రాలను దాటివేసే సామర్థ్యము నిస్తాయి. ప్రతి సాధకుడు 1. కామ, 2. క్రోధ,
3. మోహ, 4. లోభ, 5. మద, 6. మాత్సర్య, 7. ఈర్ష్య,
8. ద్వేషము అనే సముద్రములను దాటాలి.
ఈ ఎనిమిదీ కాక ఈ అష్ట సముద్రాల శృంఖల యొక్క రెండు ఒడ్డులను కలిపే సంగమమే 9వ సముద్రం.
ఈ 9 సముద్రాలను దాటిన మానవుడు తన జీవన లక్ష్యమును సాధిస్తాడు.
ఈ 9 సముద్రాల శృంఖలలో 'కామం' మొదటి సముద్రము. ఏ కామకళ మనిషిని నాశనము చేస్తుందో, దానినే సదుపయోగం చేసినప్పుడు అతనిని జగదంబ యొక్క శ్రీచరణాల సన్నిధికి చేరుస్తుంది.
నవార్ణ మంత్రములోని మూడవ అక్షరము కామబీజమైవుంది. దీని సమ్యక్ లేక సరియైన సాధన వలన సాధకుడు కామమనే సముద్రమును దాటుతాడు.
ఐం బీజం విజ్ఞానముతో కలిసిన వాక్కునకు సంబంధించినది. దీనితో మనిషి క్రోధమనే సాగరమును దాటగల సామర్థ్యమును పొందుతాడు.
వాక్కు కఠినముగా ఉంటే సాధకుడు మునిగిపోతాడు. వాక్కుతో క్రోధావేశం చెందకుండా సాధకుడు,
దేవిగుణ కీర్తన చేస్తూ
ఆ భావంలో మునిగి తేలినప్పుడు త్రికాలజ్ఞుడు అవుతాడు.
హ్రీం-మాయాబీజం. అది సాధకుని మోహబంధనాల నన్నింటిని త్రెంచివేస్తుంది. చివరకు మానవుడిని అన్ని మోహజాలములనుండి మహామాయే బయటపడవేసేది.
'చా' అనే అక్షర సాధన సాధకులను లోభమనే సముద్రమును దాటించివేస్తుంది. ఈ సాధనా రహస్యాలను తెలుసుకుని అర్ధం చేసుకున్నప్పుడు మానవుని అసంతృప్తి నశించిపోతుంది.
'ము' మదరూపంగల సముద్రమును దాటించగల సామర్థ్యమును ఇస్తుంది.
'మ' అమృతబీజం. దీని సాధనా రహస్యము లోతైనది.
దీని సాధనతో సాధకుడు మదం నుండి బయటపడే సామర్థ్యమును పొందుతాడు. 'డ' జడత్వమును సూచించే అక్షరము. జడత్వము వలన మనిషిలో మత్సరం (అసూయ) వస్తుంది.
శ్రద్ధాపూర్వకంగా 'డా' మంత్రాక్షర రహస్యమును హృదయంలో భావనాత్మకంగా జపించినప్పుడు మనిషి తన ధ్యేయం వరకు చేరుకుంటాడు.
'యై' వాయువు మరియు వాక్భీజం సంయోగంతో ఉద్భవించినది. ఇది ద్వేషమనే సముద్రమును దాటించివేస్తుంది.
'వి' ఈర్ష్య రూప సముద్రమును అధిగమింపజేసే బీజమంత్రం. 'చ్చె' ఇది 9వ సముద్రానికి చెందినది. ఇది అష్ట సముద్రములను కలిపే కూడలి. దివ్యతత్త్వంతో కూడిన 'చ్చె' అక్షర సాధన సాధకుడిని ఈ సంగమం నుండి పైకి లేపి ఉద్ధరిస్తుంది.
నవార్ణమంత్ర రహస్యార్ధ్యము మరియు సాధనా రహస్యము ఇంకా చాలా ఉంది. ఇందులో మొదటగా తత్త్వ నవార్ణ భేదములు మరియు వివిధ సాధనా ప్రక్రియలు ఉన్నాయి.
నవార్ణమునకు చాలా విస్తృమైన రూపముంది. దాన్ని మహావార్ణం అని అంటారు. ఇంతేకాకుండా గాయత్రీ మహామంత్రమునకు కూడా నవార్ణమంత్రంతో రహస్య సంబంధము ఉంది. నవార్ణమంత్రము యొక్క ఇతర రహస్యాలను రాబోయే సంచికలో చెప్పబడతాయి.
*సశేషం...*
_*రేపు కాత్యాయని దేవి జయంతి*_
*ఈమె భాద్రపద బహుళ చుతుర్దశినాడు జన్మించెను*
*కాత్యాయని చంద్రహాసోజ్జ్వలకరా* *శార్దూలవరవాహనా కాత్యాయనీ శుభం* *దద్యాద్దేవీ దానవఘాతినీ దుర్గామాత యొక్క ఆఱవ స్వరూపనామము*
కాత్యాయని , పూర్వము కత నామకుడైన ఒక ప్రసిద్ధ మహర్షి గలడు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్యగోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ఇతడు పరాంబా దేవిని ఉపాసించుచు పెక్కు సంవత్సరములు కఠినమైన తపస్సును ఆచరించెను.
దుర్గాదేవి (భగవతీదేవి) పుత్రికగా తన ఇంట జన్మింపవలెనని అతని కోరిక. భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరించెను. కొంతకాలము పిమ్మట మహిషాసురుడు అను రాక్షసుని అత్యాచారములు భూలోకమున పెచ్చరిల్లెను. ఈ మహిషాసురుని సంహరించుటకై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టించిరి. మొట్టమొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజించెను. అందువలన ఈమె కాత్యాయని అని ప్రసిద్ధికెక్కెను.
ఈమె కాత్యాయ మహర్షి ఇంట పుత్రికగా అవతరించినదని మరియొక కథయు గలదు. *ఈమె భాద్రపద బహుళ చుతుర్దశినాడు జన్మించెను (ఉత్తర భారత పంచాంగ సంప్రదాయమును అనుసరించి ఈ దినము ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి).* ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి , అష్టమి , నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.
*కాత్యాయనీదేవి అమోఘఫలదాయిని.* కృష్ణభగవానుని పతిగా బడయుటకు గోకులమునందలి గోపికలందరును యమునానదీ తీరమున ఈమెను పూజించిరి. ఈమె వ్రజమండలమునకు (గోకులమునకు) అధిష్ఠాత్రిగా వెలసినది. ఈమె స్వరూపము దివ్యము భవ్యము. ఈమె శరీరకాంతి బంగారమువలె తళతళ మెరయుచుండును. ఈమె నాలుగు భుజములతో విరాజిల్లుచుండును.
ఈమె కుడిచేతులలో ఒకటి అభయముద్రను , మరియొకటి వరముద్రను కలిగియుండును. ఈమె ఎడమచేతులలో ఒక దానియందు ఖడ్గము , వేరోక దానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమేకు సింహవాహనం. దుర్గానవరాత్రములలో ఆరవరోజున కాత్యాయనీ స్వరూపము పూజింపబడును.
ఆ దినమున సాధకుని మనస్సు ఆజ్ఞాచక్రము నందు స్థిరమగును. యోగసాధనలో ఈ ఆజ్ఞాచక్రము యొక్క స్థానము ప్రముఖమైనది. కావున మనము అన్నివిధముల ఈ తల్లిని శరణుజొచ్చి , ఈమె పూజల యందును , ఉపాసనల యందును తత్పరులము కావలెను.
*పంచభూతాలు.....*
*నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం... జగత్తంతా నిండిన పంచభూతాలవి.. వాటిని పరిశోధించాలి.. పరిరక్షించాలి.. ఆరాధించాలి... ఎందుకంటే అవి ప్రకృతికి ప్రతిరూపాలు.. మనుగడకు ఆలంబనలు... వాటిని స్వచ్ఛంగా ఉంచుకోవడం మనిషి ధర్మం. వాటికి ప్రణమిల్లుదాం. ఆ విశిష్ఠతలు తెలుసుకుందాం.*
*పంచభూతాలకు ప్రతీక అయిన ప్రకృతిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనం చేసే పూజలు భూ తత్త్వానికి, అభిషేకాదులు జలతత్వానికి, యజ్ఞయాగాది క్రతువులు అగ్నితత్వానికి, మంత్రోచ్చారణ వాయు తత్త్వానికి, ధ్యానం మొదలైన సాధనలు ఆకాశ తత్వానికి ప్రతీకలు. మొత్తంగా మనిషి మనిషిగా మారడానికి, ప్రకృతితో అనుబంధం పెంచుకోవడానికి, అంతిమంగా మోక్షాన్ని సాధించటానికి పంచభూతాత్మకమైన ప్రకృతే ఆలంబన అనే సందేశం ఇందులో దాగి ఉంది.*
*భూమండలాన్ని ఆవరించి ఉన్న పంచభూతాలు మనిషిలోనూ ఉన్నాయి. వాటి వల్లే మనిషి సుఖంగా జీవించగలుగుతున్నాడు. అవి తమ శక్తులు ప్రసారం చేయటంతో పాటు కర్తవ్యాన్ని ఏమరుపాటులేకుండా నిర్వహిస్తుంటాయి. అందువల్లనే మానవ జీవన వ్యవస్థతో పాటు మొత్తం ప్రాణి వ్యవస్థ నడుస్తోంది. ఈ విషయాన్ని మనిషి గుర్తించాలి. ఈ జీవనచక్రం సవ్యంగా సాగిపోవటానికి ప్రకృతితో, తనని తాను సమన్వయం చేసుకోవాలి. ప్రకృతిని ఆశ్రయించాలే కానీ ఆక్రమించకూడదు. ఈ సూత్రం ఆధారంగానే సనాతన భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ రూపుదిద్దుకుంది.*
*మనిషిలో పంచకోశాలు ఉంటాయి. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. వీటిలో అన్నమయ కోశం భూ తత్త్వానికి, ప్రాణమయ కోశం జలతత్వానికి, మనోమయకోశం అగ్నితత్వానికి, విజ్ఞానమయకోశం వాయుతత్వానికి ఆనందమయకోశం ఆకాశతత్త్వానికి సంబంధించి ఉంటాయి. వీటితో పాటు పంచభూతాల ప్రతీకలుగా మానవ శరీరంలో ఐదు నాడీ కేంద్రాలు ఉంటాయి. వీటిని శక్తి చక్రాలు అంటారు. వీటిలో మూలాధార చక్రం భూ తత్వాన్ని, స్వాధిష్టాన చక్రం జలతత్వానికి, మణిపూరక చక్రం అగ్నితత్వానికి, అనాహతచక్రం వాయుతత్త్వానికి, విశుద్ధిచక్రం ఆకాశతత్త్వానికి ప్రతీకలుగా ఉంటాయి. ఈ ఐదు చక్రాలు కాకుండా శరీరంలో ఉండే ఆజ్ఞ, సహస్రార చక్రాలు అన్ని తత్త్వాలకు అతీతం. మనిషి ఆలోచనలు, నడవడిక, సంస్కారం, ప్రారబ్ధకర్మ వల్ల ఇవి ప్రభావితమవుతుంటాయి.*
*ప్రకృతిలోని పంచభూతాలను పరిరక్షించుకోవడం, కలుషితం కాకుండా చూడడం, భావితరాలకు ప్రాకృతిక వారసత్వ సంపద అందించడం మొదలైన అంశాల గురించి రుక్, యజుర్, అధర్వణ వేదాల్లో విస్తారంగా ఉంది.*
*'ఓం భూశ్శాంతి ఓం భువశ్శాంతి'... భూమికి శాంతి కలుగుగాక. భూమ్యాకాశాల మధ్యలో ఉండే మొత్తం ప్రదేశమంతటికీ శాంతి కలుగుగా అంటుంది కృష్ణ యజుర్వేదం.*
*అధర్వణవేదం వాయువును మొత్తం ప్రపంచానికి వైద్యుడిగా పేర్కొంది. రుగ్వేదంలో ‘యదతో వాత తే గృహే అమృతస్య నిధిరిత: తేన నో దేహి జీవాసి...’ అంటూ ప్రార్థన మంత్రం ఉంది. ‘నీతో అమృత నిధి ఉంది... ఓ వాయు దేవా.. నీవు మాకు దీర్ఘ జీవనాన్ని ప్రసాదించమ’ని దీని అర్థం. మొత్తంగా ప్రకృతిలోని వాయుతత్త్వ ప్రాధాన్యాన్ని ఈ మంత్రాలు వివరిస్తున్నాయి.*
*జలవనరుల పరిరక్షణ ప్రాధాన్యం అధర్వణవేదంలో కనిపిస్తుంది. నీటిని పాడుచేయటం మహా పాపమని, వర్షపు నీరు అత్యంత పరిశుభ్రమైందని, ఈ నీటికి ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి ఉందని చెబుతుంది. ఇదే వేదంలో చెప్పిన ‘సముద్రే అంతర్నిహితాని నాభి’, రుగ్వేదంలోని ‘ఆప ఓషధుతః.. అవస్తు ద్యౌర్వనగిరయో హృషీకేశః’ తదితర మంత్రాలు జలవనరుల ప్రాధాన్యత, సంరక్షణ గురించి వివరిస్తాయి. నదుల్లో ఉమ్మి వేయడాన్ని కూడా నిషేధించాయి మన శాస్త్రాలు.*
*ఐదు వేళ్లు... మన చేతి వేళ్లలో కూడా పంచభూత తత్త్వం నిక్షిప్తమై ఉంది. ఆ శక్తిని జాగృతం చెయ్యగలిగితే మన చేతికి ఎంతో శక్తి ఏర్పడుతుంది. ‘ఆ చేతిలో ఏదో మహత్తు ఉంద’ని చెప్పిడానికి ఏర్పడటానికి కారణం ఇదే. బొటన వేలు అగ్నితత్త్వానికి, చూపుడు వేలు వాయుతత్త్వానికి, మధ్యవేలు ఆకాశ తత్త్వానికి, ఉంగరపు వేలు భూతత్త్వానికి, చిటికిన వేలు జలతత్త్వానికి సంకేతం. మంత్రజపాలు చేసేటప్పుడు అంగన్యాస, కరన్యాసాలు చేస్తారు. ఈ ప్రక్రియలో చేతివేళ్ల మొదలు నుంచి కొన వరకు సున్నితంగా తాకుతారు. దీనిద్వారా ఆ వేళ్లలో ఉండే పంచభూత శక్తులు ఉద్దీపనం చెందుతాయి. తద్వారా మనిషిలో ఆత్మచైతన్యశక్తి జాగృతమవుతుంది. అలాగే, ఆశీర్వచనం తీసుకునేటప్పుడు కూడా హస్త మస్తక సంయోగం ద్వారా శక్తి ప్రసారం జరుగుతుంది. అందుకే సాధకులైన పెద్దల నుంచి ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పారు.*
*ఈ సృష్టి మొత్తం పంచభూతాల కలయికతో ఏర్పడిందే. సృష్టికి ఆధారమైన ఈ పంచభూతాలు మానవ శరీరం వాటితోనే ఏర్పడింది. శరీరంలోని వివిధ భాగాల్లో వివిధ తత్త్వాలు, శక్తుల రూపంలో ఇవి కేంద్రీకృతమై ఉంటాయి. మనిషి స్థూల దేహానికే కాదు సూక్ష్మ దేహానికి కూడా ఇవే ఆధారం.*
*1) పృథివి (భూమి) :*
*వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు పృథివీ తత్త్వం ద్వారా ఏర్పడతాయి.*
*2) జలం :*
*ఇది శరీరంలో రక్తరూపంలో ఉంటుంది. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే పంచతన్మాత్రలు జలతత్త్వానికి ప్రతీకలుగా ఉంటాయి.*
*ఆదిశక్తి యొక్క లీలాకథలు*
*11.భాగము*
*నవార్ణమంత్రం యొక్క రహస్యార్థము - సాధనా మర్మము*
ఆదిశక్తి యొక్క లీలాకథ బీజరూపములో నవార్ణమంత్రంలో ఇమిడివున్నది. నవార్ణ మంత్రం యొక్క విస్తారం వికాసమే,
శ్రీదుర్తాసప్తశతి యొక్క మూడు రకాలైన చరిత్రలు మరియు 700 మంత్రాల రూపములో జరిగింది అని కూడా చెప్పవచ్చును.
బహుశా అనేకమంది పలురీతులలో “ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చె" అను
9 అక్షరాలు గల ఈ నవార్ణమంత్రంతో పరిచయమును కలిగి వుంటారు. కానీ దీని రహస్యానుభూతిని కొద్దిమందే సాధించి ఉంటారు.
మంత్రవేత్తలు ఇందులో 33 కోట్లమంది దేవీ-దేవతల వివిధ మంత్ర మహామంత్రాల సారమును అనుభూతి చెందుతారు.
ఈ సాధనతో ప్రకృతి మరియు సృష్టియొక్క దుర్లభమమైన రహస్యాలు పరిశోధింపబడి, తద్వారా వాటి జ్ఞానమును పొందటం జరుగుతుంది.
ఈ మహా మంత్రంలో "ఐం హ్రీం క్లీం" మంత్రబీజాలే కాక మంత్రాక్షరాలలోని మిగిలిన ప్రతి అక్షరము బీజమంత్రము లతో సమానంగానే సాధకుని అస్తిత్వంలో ఆధ్యాత్మిక విస్ఫోటనం కలిగించి,అలౌకిక శక్తిధారలను వికసింపజేసే సామర్ధ్యమును కలిగి వున్నాయి.
జగన్మాత లీలాకథలను వివరిస్తూ ఇప్పటివరకు గడచిన భాగాలలో దీనిలో ఉన్న మొత్తం ఆరు అంగాల వివేచన చేయబడింది.
కవచం, అర్గలా, కీలకము, ప్రాధానికరహస్యము, వైకృతికరహస్యము, మూర్తిరహస్యము అను
ఈ మొత్తం ఆరు అంగాలు శ్రీదుర్గాసప్తశతితో అనివార్యమైన మరియు అభిన్నమైన రూపంలో జోడింపబడివున్నాయి.
వీటి పారాయణ చెయ్యకుండా సాధనావిధానము పూర్తి అవ్వదు. ఇదేక్రమంలో నవార్ణ మంత్రమునకు విశేష స్థానమున్నది.
సప్తశతి పారాయణకు ముందు, పారాయణ తరువాత నవార్ణమంత్ర జపమును చేయుట తప్పనిసరి అని శక్తి సాధకులు భావిస్తారు.
ఆద్యనౌ నవార్ధమంత్ర జపేత్ అనగా పారాయణ ఆది, అంతములలో నవార్ణమంత్రమును జపించాలి, ఎందుకంటే నవార్ణమంత్రముతో,
సంపుటీకరణ చేయుట వలన పారాయణ అతి ప్రభావశాలిగా ఉంటుంది అని శాస్త్రములు కూడా చెప్తున్నాయి. సాధకులు తమ సాధనా క్రమంలో దీని అనుభూతి చెందగలరు.
నవార్ణ మంత్ర బీజాక్షరములు మరియు మంత్రాక్షరముల రహస్యాత్మకత విషయానికి వస్తే వీటి కథా వివరణ బహు విస్తారమైనది.
ఐం హ్రీం క్లీం రూపంలో
ఈ మూడు వాగ్బీజం, మాయాబీజం మరియు కామబీజం ప్రకృతి యొక్క త్రిగుణాత్మక ధారలకి ప్రతీకలు.
అవే మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపములో చిత్రీకరించబడినాయి. చాముండాయై విచ్చే మంత్రాక్షరాలలో త్రిగుణాత్మిక మహాశక్తి భగవతి పట్ల నిండైన శరణాగతి భావం ఉంది.
అందువల్ల పారాయణ క్రమంలో భగవతి మహాకాళీ స్వరూపము ముందుగా ఇవ్వబడింది. అందులో క్లీం బీజమంత్ర సామర్థ్యము విపులంగా వివరించబడినది.
దీని తరువాత మధ్యమ చరిత్రలో మాత మహాలక్ష్మి యొక్క మంత్ర మహిమయే బీజాక్షరములు విస్తారక్రమంలో ప్రకటీకరించబడినది.
చివరలో ఐం బీజ సామర్థ్యం మాత సరస్వతి యొక్క మంత్ర మహిమరూపంలో ఇవ్వబడింది.
చాముందాయై విచ్చె: ఈ మంత్రాక్షరాలలో కూడా అనేక ప్రత్యక్ష మరియు రహస్యమైన శక్తులు ఇమిడివున్నాయి. చాముండాయై అనే పదానికి ఒక అర్థము ' అజ్ఞానమనే సేనను నశింపజేసే మహాశక్తి' అని కూడా ఉంది.
సప్తశతి పారాయణ క్రమాన్ని అనుసరించి 7 వ అధ్యాయంలో భగవతి పరాంబ యొక్క లలాటం నుండి ఉద్భవించిన మహాశక్తి శుంభ నిశుంభుల సేనానాయకులైన చండ ముండులను వధించినది అని వర్ణించబడివుంది.
వధానంతరము వారు ఈ బలి పశువులను భగవతికి అర్పించినప్పుడు ఆమె నవ్వుతూ లేక మందహాసం చేస్తూ ఇలా అంది.
యస్మాచ్చణం చ ముణ్ణంచ చ గృహీత్వా త్వముపాగతా చాముణ్ణితి తతో లోకే ఖ్యాతా దేవి భవిష్యసి
'నువ్వు చండ, ముండులను తీసుకొని మా వద్దకు వచ్చినావు, అందువల్ల
ఈ లోకంలో నువ్వు చాముండాదేవీ అను నామధేయంతో విఖ్యాతి చెందెదవుగాక!'
విజ్ఞుల అభిప్రాయాన్ని అనుసరించి ఈ చాముండాయై పదం ఆ మహాశక్తినే తలపిస్తుంది. అదేవిధంగా పదంలో 4 అక్షరాలే లెక్కించబడతాయి.
కానీ ఇందులో - చ్, మ్, ణ్, డ్, య్ అను 5 వ్యంజనములు; అ, ఉ, ఆ, ఎ - అను 4 స్వరాలు ఉన్నవి. ఈవిధంగా దీని వర్ణసంఖ్య 9 అయివున్నది. ఈ 9 అక్షరాలకు లేక వర్ణాలకు చాలా అద్భుతమైన ప్రభావం ఉంది.
అందువల్ల ఇవి మంత్రానికి మధ్యన ఉంచబడినవి. ఈ పదం తరువాత వచ్చే 'విచ్చే' అను పదం భగవతికి శరణాగతి చేసుకోమని సూచిస్తుంది. మంత్రదృష్టిని అనుసరించి దీని గొప్పతనం కూడా సాటిలేనిది.
సిద్ధిని సాధించిన కొంతమంది పరాతంత్రయోగుల అభిప్రాయం ప్రకారం శ్రీదుర్గాసప్తశతి యొక్క 4 వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో దేవీ ప్రార్ధన చేసే మంత్రం కూడా నవార్ణ మంత్రంగా అంగీకరించబడుతుంది.
ఇందులో 9 సార్లు 'న' వర్ణ లేక అక్షర ప్రయోగం చేయబడింది. నిస్సందేహంగా ఈ మంత్ర మహత్యము, అర్థము సాటిలేనివి.
శక్తి సాధకుల కొరకు వీటి గోపనీయమైన అర్థమును ఇక్కడ వివరించబడుతున్నది. తద్వారా వీటి అద్భుత ప్రభావమును సరైన రీతిలో అర్థము చేసుకోవచ్చును.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*శ్రీ అన్నపూర్ణా దేవి హారతి పాట*
అన్నపూర్ణా దేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
విస్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంటా
నా తనువునోతల్లి, నీ సేవ కొరకు అర్చింతునోయమ్మ పైజన్మవరకు
నా ఒడలి అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి
అన్నపూర్ణా దేవి
నా ఒడలి ఉధకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి 2
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి 2
అన్నపూర్ణా దేవి
నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలతో విసరాలి తల్లి 2
నా తనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామ గానాలు మ్రోయాలి తల్లి 2
అన్నపూర్ణా దేవి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸