telanganacmo | Unsorted

Telegram-канал telanganacmo - TelanganaCMO

123

Government Of Telangana

Subscribe to a channel

TelanganaCMO

Http://t.me/telanganaCMO

Читать полностью…

TelanganaCMO

*సీఎం పర్సనల్‌ సెక్రటరీనంటూ..*

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు పర్సనల్‌ సెక్రటరీనంటూ నమ్మించి ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నించిన యువకుడు అరెస్ట్‌ అయ్యాడు. శనివారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తిమ్మాపూర్‌ మండలం, మొగిలిపాలెం గ్రామానికి చెందిన సాయి చందన్‌ కరీంనగర్‌లోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్నాడు. సీఎం అడిషినల్‌ సెక్రటరీగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాల వ్యవహారాలను చూస్తుండటంతో పాటు అవినీతి నిరోధక విభాగం కరీంనగర్ జిల్లా ఛైర్మన్‌గా కొనసాగుతున్నానని చెప్పుకుంటూ గత కొద్ది నెలలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. సీఎం కార్యాలయానికి చెందిన రాజశేఖర్ రెడ్డి పేరు మీద నకిలీ నియామకపు ఉత్తర్వులు సృష్టించాడు.

ఉత్తర్వుల ఆధారంగా చేసుకొని సీఎం దగ్గర పని చేస్తున్నానని చెబుతూ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో దిగిన ఫోటోలను చూపిస్తూ ప్రజలను మోసం చేసేందుకు యత్నించాడు. సాయి చందన్‌ సీఎం ఆఫీస్ ఉత్తర్వులు, నకిలీ అవినీతి నిరోధక శాఖ ఛైర్మన్ గుర్తింపు కార్డులతో మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతని మోసాలు బయటపడ్డాయి.
/channel/Telanganalivenews

Читать полностью…

TelanganaCMO

🎯రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలకు సంబంధించిన ఫీజులను రాష్ట్ర విద్యాశాఖ ఖరారు చేసింది. ఖరారు చేసిన ఫీజులు 2020-21, 2021-22, 2022-23 విద్యాసంవత్సరాలకు అమల్లోకి రానున్నాయి. కేవలం విద్య కోసం ఖర్చు చేసే వ్యయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఫీజులను నిర్ణయించాలని గతంలోనే ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

🎯ఆయా కాలేజీల్లో ఉండే సౌకర్యాలు, ప్రమాణాలు, వసతులను దృష్టిలో పెట్టుకుని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులను నిర్ణయించి.. ప్రభుత్వానికి అందజేసింది. దానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజా నివేదిక ప్రకారం.. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, న్యాక్ గుర్తింపు, జాతీయ ర్యాంకుల ఆధారంగా తీసుకుని నాలుగు కేటగిరీలుగా డిగ్రీ కాలేజీలను విభజించి ఫీజులను ఖరారు చేశారు.

▪మొదటి కేటగిరిలోని కాలేజీలకు గరిష్టంగా రూ. 18 వేలు

▪రెండో కేటగిరికి గరిష్టంగా రూ. 16 వేలు

▪మూడో కేటగిరి కళాశాలలకు గరిష్టంగా రూ. 14 వేలు

▪నాలుగో కేటగిరి కాలేజీలకు గరిష్టంగా రూ. 12 వేలుగా నిర్ణయించారు.

🎯 అలాగే తొలిసారిగా యాజమాన్యం కోటా కింద 30 శాతం సీట్లను కేటాయించారు. అటు డిగ్రీ, పీజీ కోర్సులకు ఒకే రకమైన ఫీజులు అమలు కానున్నాయి. కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటాలో చేరే విద్యార్థులకు కమిషన్ నిర్ధారించిన ఫీజులను మాత్రమే కాలేజీలు వసూలు చేయాలి. అలా కాదని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. అంతేకాకుండా విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడితే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు గ్రీవెన్స్‌ సెల్‌‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.

Читать полностью…

TelanganaCMO

CM Sri KCR has greeted people in the State on the occasion of #VinayakaChaturthi and wished them prosperity, good health and happy life. Hon'ble CM prayed Lord Ganesha for an early end to the #CoronaVirus pandemic and for the restoration of normal life for each and everyone in the State and the country.

मुख्यमंत्री के. चंद्रशेखर राव ने विनायक चतुर्थी के अवसर पर राज्य के सभी लोगों को शुभकामनाएं दी हैं। मुख्यमंत्री ने विनायक चतुर्थी के अवसर पर लोगों की समृद्धि और अच्छे स्वास्थ्य और खुशहाल जीवन की कामना की। उन्होंने भगवान गणेश से प्रार्थना की कि इस देश और राज्य से बहुत जल्द कोरोना वायरस की महामारी समाप्त हो जाए और विशेष रूप से हर किसी के लिए जीवन की सामान्य स्थिति स्थापित हो।

Читать полностью…

TelanganaCMO

Http://t.me/telanganacmo

Читать полностью…

TelanganaCMO

*ఆర్టీసీ కార్గో & పార్శిల్ సర్వీసు*

*సమాజానికి బహిరంగ విన్నపం*

మిత్రులారా...ఆర్టీసీ బస్సు చక్రాలు ప్రగతి రథ చక్రాలన్నాడు ఓ కవి ఏనాడో
ఎందుకంటే, ఎక్కడో ఉన్న మారుమూల పల్లెకు ఆర్టీసీ బస్సు వస్తోందంటే అవూరు అభివృద్ధికి తొలి మెట్టు ఆర్టీసీ బస్సు చక్రమని అందరికీ తెలుసు.

దదాపు 70 ఏళ్ళ నుంచి పేద, మధ్య తరగతి వారికి అతి తక్కువ చార్జీలు వసూలు చేస్తూ సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిచడమే గాక బడి పిల్లలకు, కాలేజీ పిల్లలకు ఉచిత మరియు రాయితీ బస్సు పాసులనిచ్చింది.

అంతే కాక, గర్భిణీ మహిళలకని, కిడ్నీ వ్యాధిగ్రస్థులకని, జర్నలిస్టులకని, ప్రీడమ్ పైటర్స్ అని, NGOsకు అని ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరికో సేవలందించిన నాటి APSRTC నేటి ప్రజా రవాణా శాఖ నేడు కరోనా మహమ్మారి వల్ల బస్సులు నడవక రోజుకు కోట్ల రూపాయల నష్టాలను చవిచూస్తున్నది.

మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడుకోవాలంటే....ప్రయాణీకులను
చేరవేయడమే గాక వస్తువులను కూడా చేరవేస్తూ లబ్ది పొంది సంస్థను ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతో మరియు భావి తరాలకు కూడా ఆర్టీసీ సేవలందించేలా ప్రజా రవాణా శాఖను నిలబెట్టాలని నేడు *కార్గో-పార్సిల్ సర్వీసును* ప్రారంభించడం జరిగింది.
కావున మిత్రులారా... మీ, మీ కంపెనీలలో, ఏజెన్సీలలోనే కాక మీ పర్సనల్ వస్తువులను కూడా ఒక చోట నుంచి మరో చోటుకు చేరవేయుటకు *మా యొక్క రవాణా ఐన* ఆర్టీసీ Cargo-parcel service ను ఉపయోగించుకోవాలని కోరడమైనది. అతి తక్కువ రేట్లతో, మీరు అనుకునే గమ్యస్థానానికి ఆనుకున్న సమయానికి సురక్షితంగా చేరవేయుటకు సిద్ధముగా వున్నది*

కావున, దయచేసి అందరూ మీ మీ వ్యాపార వస్తువుల రవాణా కార్యకలాపాల్లో ఆర్టీసీ కార్గో-పార్సిల్ సర్వీసును వినియోగించుకొని మీలో ఆర్టీసీని భాగస్వామం చేసుకోవాలని మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటున్నాను* ధన్యవాదములతో 🙏🙏🙏🙏
మీ
APSRTC (ప్రజా రవాణా శాఖ), ఆంధ్ర ప్రదేశ్.


N0TE :- *ప్రియ మిత్రులారా.... ఈ సమాచారాన్ని చదివిన ప్రతి ఒక్కరూ కనీసం మరో ముగ్గురికైనా forward చేసి ఆర్టీసీ కార్గో సర్వీసుల సేవలను అందరూ వినియోగించుకోవాలి.

Читать полностью…

TelanganaCMO

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు సీఎం శ్రీ కేసీఆర్ ఆర్థిక సహాయం, ఇతరత్రా సహాయాలు ప్రకటించారు. మరణించిన డిఇ శ్రీ శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి రూ. 50 లక్షలు, మిగతా వారందరి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం చెప్పారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, ఇతర శాఖాపరమైన ప్రయోజనాలు అందిస్తామని వెల్లడించారు.

CM Sri K. Chandrashekar Rao has announced financial and other benefits to the families of those who died in the Srisailam Power Plant fire accident. CM announced Rs. 50 Lakh ex gratia to DE Sri Srinivas Goud’s family and Rs. 25 Lakh each to families of other employees who lost their lives. Hon'ble CM also announced one job each to families of the deceased and also extending other department wise benefits.

Читать полностью…
Subscribe to a channel