ttdnews | Unsorted

Telegram-канал ttdnews - 🙏ఓం నమోవేంకటేశాయ🙏

10371

తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం ఈ Telegram App లింక్ తో టీటీడీ సమాచారం నిరంతరము ఉచితం గా పొందవచ్చు. https://t.me/ttdnews మరియు అన్నమయ్య సంకీర్తనలు https://t.me/Annamaiah_Paatalu సందేహాలు _ సలహాలకు 701 345 1212

Subscribe to a channel

🙏ఓం నమోవేంకటేశాయ🙏

Unsupported characters

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉–  *జనవరి చివరి నాటికి బర్డ్‌లో ఐటి అప్లికేషన్ అమలు కావాలి-  అధికారులకు టీటీడీ ఈవో ఆదేశం*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌:
జనవరి చివరి వారం లోపు బర్డ్ ఆసుపత్రి నిర్వహణ, సేవలకు సంబంధించిన ఐటి అప్లికేషన్ అమలు కావాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్లో శనివారం ఆయన బర్డ్, ఐటి విభాగం అధికారులతో సమావేశమయ్యారు. బర్డ్ ఆసుపత్రి నిర్వహణ విధానానికి సంబంధించిన ఐటి అప్లికేషన్ పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అప్లికేషన్ లో ఆసుపత్రి నిర్వహణ, క్లినికల్, ఆర్థిక వ్యవహారాలు మూడు విభాగాలుగా ఉండాలన్నారు. అవుట్ పేషెంట్, ఇన్పేషెంట్,  వీరిద్దరికీ సంబంధించిన లెబరేటరీ, ఫార్మసీ మాడ్యూల్స్, డిశ్చార్జ్ మాడ్యూల్ ఇందులో ఉండాలని అధికారులకు సూచించారు. టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తో సమన్వయం చేసుకుంటూ బర్ద్ అధికారులు స్టోర్స్ ఇన్వెంటరీ నిర్వహించాలన్నారు.  ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఆసుపత్రి పరిపాలన,  మెటీరియల్ మరియు మెడిసిన్ అంశాలు ఈ అప్లికేషన్ లో పొందుపరచాలని ఈవో చెప్పారు. బర్ద్ లోని ఏడు ఆపరేషన్ థియేటర్ల సామర్థ్యం,  డాక్టర్ల పని తీరు, బిల్లింగ్ విధానం గురించి బర్ద్, ఐటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బర్ద్ ఆసుపత్రి గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, ఐటి ఇంచార్జ్ శ్రీ శేషారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 18 వ రోజు పాశురం ■
/channel/ttdnews
*తిరుప్పావై - 18 పాశురం*
〰〰➖➖➖〰〰 👇
/channel/ttdnews/7381
ఉన్దు మదకళిత్త నోడాద తోళ్ వలియన్
నన్దగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కన్దమ్ కమళుమ్ కుళలీ! కడై తిఱవాయ్;
వన్దెజ్గమ్ కోళియళైత్తగాణ్; మాదవి
ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలినజ్గళ్ కూవినగాణ్;
పన్దార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్ పాడ,
చ్చెన్దామరైక్కైయాల్ శీరార్ వళైయొలిప్ప
వన్దు తిఱవాయ్ మగిళ్ న్దు ఏలో రెమ్బావాయ్.°
/channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్ చేయండి
.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉–  *శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి బంగారు ఆభ‌ర‌ణాలు బ‌హూక‌ర‌ణ‌*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌
: శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు బుధ‌వారం శ్రీశ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామివారు రూ. 50 వేల విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు బ‌హూక‌రించారు.

 👉 ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్రుడు, శ్రీ‌మ‌తి పార్వ‌తి, శ్రీ‌మ‌తి ఝూన్సీరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 16 వ రోజు పాశురం ■
/channel/ttdnews
*తిరుప్పావై - 16 పాశురం*
〰〰➖➖➖〰〰
°నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ
వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
°ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై
మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్
°తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్ 
వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ
 °నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.°
/channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్ చేయండి
.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 15 వ రోజు పాశురం ■
/channel/ttdnews
*తిరుప్పావై - 15 పాశురం*
〰〰➖➖➖〰〰
MP3 కోసం 👇👇👇
/channel/ttdnews/8583
ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో?
శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ
ఒల్లైనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ?
ఎల్లారుమ్ ఫోన్దారో? ఫోన్దార్, ఫోన్దెణ్ణిక్కొళ్
వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.°
/channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్ చేయండి.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 15 వ రోజు పాశురం ■
/channel/ttdnews
*తిరుప్పావై - 15 పాశురం*
〰〰➖➖➖〰〰
ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో?
శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ
ఒల్లైనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ?
ఎల్లారుమ్ ఫోన్దారో? ఫోన్దార్, ఫోన్దెణ్ణిక్కొళ్
వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.°
/channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్ చేయండి.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

తిరుమల తిరుపతి దేవస్థానం వారి సమాచారం 👇👇👇👇👇
https://m.facebook.com/groups/984098701930156/permalink/1315221175484572/
➖➖➖➖🔝➖➖➖➖
ఇలాంటి 👇 మరిన్ని విశేషాలు కోసం
తిరుమల తిరుపతి దేవస్థానం ఈ క్రింది
టెలిగ్రామ్ ఛానల్లో పొందవచ్చు.
/channel/ttdnews
/channel/livetirumala
/channel/newsttd
గమనిక : దయచేసి లింక్స్ తొలగించకుండా మీ సన్నిహితులకు ఫోర్వర్డ్ చేయండి.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

(పార్ట్ -2)
🌹💠 *" కొలువు:* 💠🌹
/channel/ttdnews
☀️తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్‌ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార్ని,

★ ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందురోజు హుండీ ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ, నాణాలు సహా (డినామినేషన్‌ ప్రకారం) మొత్తం విలువ తెలియజేస్తారు.
◆ అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.

🌹💠 *" సహస్రనామార్చన "* 💠🌹
/channel/ttdnews
☀️ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి వేయినామాలనూ స్తుతిస్తూ చేసే అర్చన ఇది.

👉 ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసిదళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు.
★ ఈ సమయంలో మిరాశీదారు వరాహ పురాణం లోని లక్ష్మీసహస్రనామాలను పఠిస్తారు. తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.

🌹💠 *"మొదటిగంట, నైవేద్యం"* 💠🌹
/channel/ttdnews
☀️ మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు.
◆ తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు.
◆ అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి
●పులిహోర,
●పొంగలి,
●దద్ధోజనం,
●చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు),
●లడ్లు, వడలు,
●అప్పాలు, దోసెలు,
●పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి)కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.

🌹💠 *"అష్టోత్తర శతనామార్చన"* 💠🌹
/channel/ttdnews
☀️ ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి.

★ వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు.
◆అష్టోత్తర శతనామావళి పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.

🌹💠 *రెండో గంట, నైవేద్యం:* 💠🌹
/channel/ttdnews
☀️ అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది.
★పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.

🌹💠 *" రాత్రి కైంకర్యాలు: "* 💠🌹
/channel/ttdnews
☀️ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి.

👉 ఈ సమయంలో మూడో గంట మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.

🌹💠 *" ఏకాంతసేవ: "* 💠🌹
/channel/ttdnews
☀️రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు.
★ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు. ఏడుకొండలవాడిని నిదురపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు.
◆ దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు.

👁‍🗨(ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది.)
దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.

🌹💠 *"గుడిమూసే ప్రక్రియ:"* 💠🌹
/channel/ttdnews
☀️రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది.
★ ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు.
◆ అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు.

👉🔹 ప్రత్యేక సేవలు సవరించు
రోజువారీ అర్చనలు, ధూపదీప నైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమలవాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి.
👉 అవి సోమవారం విశేషపూజ,
👉 మంగళవారం అష్టదళ పాద
పద్మారాధన,
👉 గురువారం సడలింపు,
👉 పూలంగిసేవ,
👉 తిరుప్పావడ,
👉 శుక్రవారం అభిషేకం.
👉 స్వామికి రోజూ కల్యాణోత్సవం
జరిపిస్తారు.
👉 డోలోత్సవం,
👉 సహస్రదీపాలంకరణ,
👉 ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉత్సవమూర్తులకు జరిగేవి.
గమనిక : దయచేసి లింక్స్
తొలగించకుండా మీ సన్నిహితులకు ఫోర్వర్డ్ చేయండి.
*( ఇంకా ఉంది )*

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉–  *జ‌న‌వ‌రి 2న నాద‌నీరాజ‌నం వేదిక‌పై 8వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌:
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జ‌న‌వ‌రి 2వ తేదీన 8వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.

★ °ఆదివారం ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 31వ సర్గ నుంచి 35వ సర్గ వరకు ఉన్న 195 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు.

■ శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 14 వ రోజు పాశురం ■
/channel/ttdnews
తిరుప్పావై -14 వపాశురo భావామృతం
®★ 〰➖➖➖➖〰 ★®
👁‍🗨 " తాత్పర్యము:°"
మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి.

ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు.
ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం.
👉 °మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మర్గాన్ని విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపలగోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది.

★ "శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్" ఎర్ర కలవలు వికసిస్తున్నాయి "ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్" నల్ల కలువలు ముకిళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోప బాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టిచ్చుకోలేదు. లేదమ్మా అయితే, "ఉంగళ్ పురైక్కడై" నీ ఇంటి పెరటి "త్తోట్టత్తు వావియుళ్" తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావల్సిస్తే చూసుకో. అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ "నీ" అని సంభోదించినా లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది, నీ అన్నా లోపల పరమాత్మ వరకు భావించి, పెద్దగా పట్టిచ్చుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు, ఏమిటంటే లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడికోసం ఎదురుచూస్తుంటే వెనకనుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని, శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు, గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు. పెద్దగా పట్టిచ్చుకోలేదు లోపల గోపబాలిక.

■ "శెంగల్పొడి క్కూరై" కాషాయాంభరధారులు "వెణ్బల్ తవత్తవర్" తెల్లటి పలువరుసలు కల్గిన యోగులు "తంగళ్ తిరుక్కోయిల్ " ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి "శంగిడువాన్" తాళాలు తెరువడానికి "పోగిన్ఱార్" వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు. తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది, అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి, లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి, తమకూ జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది.

◆ అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం, అంటూ "ఎంగళై" మమ్మల్నందరిని "మున్నం ఎరుప్పువాన్" ముందే లేపుతాను అని "వాయ్ పేశుమ్" వాగ్దానం చేసావు. "నంగాయ్!" పెద్ద పరిపూర్ణురాలివే! "ఎరుందిరాయ్" లేవమ్మా "నాణాదాయ్!" నీకు సిగ్గు అనిపించటంలేదా "నావుడైయాయ్" పెద్ద మాటకారిదానివి.

👉 జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండేస్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విధ్య అంటారు వేదాల్లో. లోపల గోపబాలిక దహరవిధ్యలో పరినిష్నాత అయి ఉండచ్చేమో " శంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్ పంగయ క్కణ్ణానై ప్పాడ" ఆమె హృదయం, దానిలో దహరాకాశం, అందులో స్వామి, ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం, నీవు ఆ యోగ్యత కల్గిన దానివి, నీవూ లేచి మాతో కలిస్తే అందరం కల్సి స్వామిని పాడుదాం అంటూ లోపల గోప బాలికను లేపారు.....!°

/channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్ చేయండి.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 14 వ రోజు పాశురం ■
/channel/ttdnews
తిరుప్పావై - 14 వ పాశురం°
/channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్ చేయండి
.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉 *వకులమాత, కళ్యాణ వేంకటేశ్వరుని దర్శించుకున్న టీటీడీ చైర్మన్*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌
: పేరూరు బండ మీద రాష్ట్ర మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్మిస్తున్న వకులమాత ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదివారం దర్శించుకున్నారు.

■ వకులమాత ఆలయం చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ పనులు చేస్తున్న స్థానికులతో శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడి ఆలయం  పూర్వా పరాలు తెలుసుకున్నారు. ఆలయ గోపురానికి జరుగుతున్న బంగారు మలాం పనుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన శ్రీ వకులమాతను దర్శించుకున్నారు.

శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన చైర్మన్ కు డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశికి ఆలయంలో చేసిన ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు.

◆ ఏకాదశి రోజు 39 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని డిప్యూటి ఈవో చైర్మన్ కు చెప్పారు. మార్చిలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని డిప్యూటి ఈవో ఆహ్వానించగా,  తప్పకుండా వస్తానని చైర్మన్ తెలిపారు. అనంతరం ఆయన స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆయనకు తీర్థ, ప్రసాదాలు అందించారు. తరువాత శ్రీ సుబ్బారెడ్డి ఆలయంలో భక్తులతో మాట్లాడారు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 13 వ రోజు పాశురం ■
/channel/ttdnews
*తిరుప్పావై - 13 పాశురం*
〰〰➖➖➖〰〰
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే*
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్.°
/channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్
చేయండి.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
ఈ గ్రూప్లో ఉన్న ప్రతీ ఒకరికీ మీ ఫ్రెండ్స్ ను పై లింక్ తో ఛానల్లో జాయిన్ కావడానికి అవకాశం ఉంది.
🟢 కావున ప్రతి సభ్యడు మీ సన్నిహితులకు లింక్ తో పాటు షేర్ చేయండి.
🙏 🙏 🙏 🙏 🙏
ఈ గ్రూప్ లో 2 లక్షల వరకు మీ ఫ్రెండ్స్ ను Add కావచ్చు.

👉 కావున ప్రతి ఒకరు మీ స్నేహితులను ఈ గ్రూప్ కు పరిచయము చేసి ఐఖ్యతను రెంటింపు చేయగలరని కోరుకుంటున్నాను.
అడ్మిన్ :
Dep.Of PRO TTD.న్యూస్ కోసం.
/channel/ttdnews

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
➖ /channel/ttdnews ➖
🕉–  *జనవరి చివరి నాటికి బర్డ్‌లో ఐటి అప్లికేషన్ అమలు కావాలి-  అధికారులకు టీటీడీ ఈవో ఆదేశం*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌: జనవరి చివరి వారం లోపు బర్డ్ ఆసుపత్రి నిర్వహణ, సేవలకు సంబంధించిన ఐటి అప్లికేషన్ అమలు కావాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

★ టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్లో శనివారం ఆయన బర్డ్, ఐటి విభాగం అధికారులతో సమావేశమయ్యారు. బర్డ్ ఆసుపత్రి నిర్వహణ విధానానికి సంబంధించిన ఐటి అప్లికేషన్ పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అప్లికేషన్ లో ఆసుపత్రి నిర్వహణ, క్లినికల్, ఆర్థిక వ్యవహారాలు మూడు విభాగాలుగా ఉండాలన్నారు. అవుట్ పేషెంట్, ఇన్పేషెంట్,  వీరిద్దరికీ సంబంధించిన లెబరేటరీ, ఫార్మసీ మాడ్యూల్స్, డిశ్చార్జ్ మాడ్యూల్ ఇందులో ఉండాలని అధికారులకు సూచించారు. టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తో సమన్వయం చేసుకుంటూ బర్ద్ అధికారులు స్టోర్స్ ఇన్వెంటరీ నిర్వహించాలన్నారు.  ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఆసుపత్రి పరిపాలన,  మెటీరియల్ మరియు మెడిసిన్ అంశాలు ఈ అప్లికేషన్ లో పొందుపరచాలని ఈవో చెప్పారు. బర్ద్ లోని ఏడు ఆపరేషన్ థియేటర్ల సామర్థ్యం,  డాక్టర్ల పని తీరు, బిల్లింగ్ విధానం గురించి బర్ద్, ఐటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బర్ద్ ఆసుపత్రి గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, ఐటి ఇంచార్జ్ శ్రీ శేషారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 18 వ రోజు పాశురం ■
/channel/ttdnews
★ తిరుప్పావై -18 వ పాశురo ★
®★ 〰➖➖➖➖〰 ★®
👁‍🗨 " తాత్పర్యము:°"
నంద గోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్ధించినను వారు తెరువకపోవుటచేత, మదజలము స్రవించుచున్న ఏనుగువంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములుగల నందగోపుని యొక్క కోడలా....!
ఓ నప్పిన్న పిరాట్టీ.....!
పరిమళిస్తున్న కేశ సంపద కలదానా....!
తలుపు తెరువుమమ్మా...!
కోళ్లు వచ్చి కూయుచున్నవి.
జాజి పందిళ్లమీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి సుమా...!
నీవు,
నీ భర్తయును సరసనల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి గలిగినచో మేము నీ పక్షము నేయుందుము.
దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడెదములే...!
కావున అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి ఎర్ర తామరలవంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువుమమ్మా..….!'
అని గోపాంగనలు నీళాదేవి నీ పాశురంలో మేల్కొల్పుచున్నారు.

Ⓜ️ " అవతారిక " :-
〰〰〰〰〰〰
శ్రీ నందగోపులను, శ్రీ యశోదాదేవిని, శ్రీకృష్ణుని, శ్రీ బలరాముని క్రమముగా గోపికలు మేల్కొల్పి తమ వ్రతమును సాంగోపాంగముగ పూర్తియగునట్లు చేయుడని వేడిరి.
ఐననూ లేవకుండుట జూచి తమకు పురుషకార భూతురాలైన నప్పిన్నపిరాట్టిని (నీళాదేవిని) నందగోపుని కోడలును మేల్కొలుపుచున్నారు. పురుషకారముతో సర్వేశ్వరుని ఆశ్రయించిన ఫలసిద్ధి తప్పక కలుగుతుంది.
వాయసము, విభీషణుల విషయంలో ఇది నిరూపించబడినది. సీతాదేవిని అనాదరించి శ్రీరాముని మాత్రమే శరణన్న శూర్పణఖ సంహరింపబడింది.

పెరుమాళ్ళను విడచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించిన రావణుడు చంపబడ్డాడు. విభీషణుడు ఇద్దరినీ ఆశ్రయించి తరించాడు. అందువల్ల పురుషకారమైన నీళాదేవిని ప్రార్ధించి, మేల్కొల్పి ద్వారమును తెరువుమని ప్రార్ధించుచున్నారు. శ్రీకృష్ణుని దర్శింపజేయుమని వేడుకొంటున్నది మన గోదాదేవి....!°
/channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్ చేయండి
.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 18 వ రోజు పాశురం ■
/channel/ttdnews
తిరుప్పావై - 18 వ పాశురం°
/channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్ చేయండి
.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉–  *తిరుమలలో వేడుకగా ప్రణయ కలహోత్సవం*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌:
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

■ 👉°ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు పల్లకీపై మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకీలపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చారు.
■ దివ్యప్రబంధ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగారు పూలచెండ్లతో వేటకు వెళ్లి వచ్చిన స్వామివారిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్‌ రచించిన ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలోని పాసురాలను నింద – స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత.

👉°ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు, పార్ పత్తేదార్ శ్రీ ఉమామహేశ్వరరెడ్డి, ఎవిఎస్వో శ్రీ గంగరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 16 వ రోజు పాశురం ■
/channel/ttdnews
తిరుప్పావై - 16 వ పాశురం°
/channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్ చేయండి
.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 15 వ రోజు పాశురం ■
/channel/ttdnews
★ తిరుప్పావై -15 వ పాశురo ★
®★ 〰➖➖➖➖〰 ★®
👁‍🗨 " తాత్పర్యము:°".

ఈ మాలిక సంభాషణ రూపంలో వున్నది.

👉 - బయటివారు
- ఓ లేత చిలుకా....!
ఇంకను నిద్రిస్తున్నావా?
ఇదేమి ఆశ్చర్యమే...!
లోపలి గోపాంగన - పూర్ణులైన పూబోడులారా....!
ఇదిగో వస్తున్నాను.

👉 బయటివారు -
శ్రీఘ్రముగా రావమ్మా....!

👉 లోపలి గోపాంగన - అబ్బా...! గొల్లుమని ఉలికి పడునట్లు గొంతెత్తి చెవులు గడియలు పడునట్లు పిలువకండి. వస్తాలే!

👉బయటివారు -
ఓ చిన్ని చిలుకా....!
నీవు చాలా చమత్కారంగా మాటాడుతావు.
నీ నేర్పిరితనము,
నీ పుల్లవిరుపు మాటలు మేమిదివరకే యెరుగుదుములేమ్మ!

👉 లోపలి గోపాంగన -
మీరే అట్టి సమర్ధులమ్మా....!
నేనేమీ కాదులే....!
ఐనా మీరన్నట్లు నేనట్టిదానినేనేమో! రావలసిన వారందరూ వచ్చిరా?

👉బయటివారు -
ఆ అందరూ వచ్చి చేరారు.
నీవే వచ్చి లెక్కజూడవచ్చు కదా!

👉లోపలి గోపాంగన -
వచ్చి నేనేమి చేయవలెనో చెప్పరాదు?

👉బయటివారు -
కువలయాపీడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీ కృష్ణుని కల్యాణ గుణములను కీర్తింపగా రమ్ము. ఇట్లు చేసినగాని మనము చేయు వ్రతము శుభప్రదముగ పూర్తికాదు'
అని బయటినుంచి సమాధానము చెప్పి ఆమెను కూడ తమ గోష్ఠిలోనకి చేర్చుకొన్నారు గోపికలు.

  🌹  అవతారిక :-
〰〰〰〰〰

వ్రతాన్ని చేయటానికై తమ గోష్ఠిలో చేర్చుకొనదగిన పదవ గోపికను యీ మాలికలో గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది సంభాషణ రూపంలో వున్న అద్వితీయ పాశురం. ఈ గోపికను యీగోష్ఠి నంతను సేవించవలెనను కుతూహలమున్నది. భగవద్గుణాలను ఏకాంతంగా ఒక్కరే అనుభవించటం తగదని అందుకే గోష్ఠిలోని అందరకూ ఆ అనుభవ ఆనందాన్ని పంచాలని గోదమ్మ చెప్తున్నది. ఇక్కడితో వ్రతంలోని రెండవ దశయైన ఆశ్రయణ దశ పూర్తవుతుంది. వ్రత మిషతో భగవద్గుణాలనందరకు పంచాలనే అద్భుతమైన భావానికి లోనైన ఆండాళ్ తల్లి శ్రవణ, మనన, ధ్యానాలనే వాటిని చక్కగా విశదపరచి నిరూపించింది. భగవంతుని పొందే నిమిత్తం భక్తి యోగాన్ని అనుసరించాలి. మనసు నిండా భక్తి నిండితే అది ఆత్మతో లయిస్తుంది. దానితో ఎడతెగని ఆనందం లభించి స్థిరపడిన చిత్తంతో భగవంతునితో తాదాత్త్యతను పొందుతుంది. ఈ పదవ గోపిక లక్షణాలు కూడా యివే! ఇట్టి నిద్రలో మునిగివున్న యీ పదవ గోపికను తమ గోష్ఠిలో చేరమని సంభాషణా రూపంలో సమాధానపరచి గోష్ఠిలో చేర్చుకున్నది గోదా తల్లి....!°
👉 /channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్ చేయండి.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 15 వ రోజు పాశురం ■
/channel/ttdnews
తిరుప్పావై - 15 వ పాశురం°
/channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్ చేయండి.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

(పార్ట్ -3 )
🌹💠 *" సడలింపు: "* 💠🌹
/channel/newsttdttd
☀️గురువారం ప్రాతఃకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు.కర్పూర నామాన్ని తగ్గిస్తారు.దీంతో శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి.
★ అనంతరం శ్రీవారికి
◆24మూరల పట్టు అంచు ధోవతి,
◆12 మూరల ఉత్తరీయాన్నీ కడతారు. ◆సువర్ణపాదాలు,
◆హస్తాలు,
◆శంఖచక్రాలు,
◆కర్ణాభరణాలు, స్వర్ణసాలగ్రామహారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు.
దీన్నే సడలింపు అంటారు.

🌹💠 *" పూలంగిసేవ: "* 💠🌹
/channel/newsttdttd
☀️ఆపాదమస్తకం స్వామివారిని పుష్పమాలాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ.
★తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్యమనోహర విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది.

🌹💠 *"తిరుప్పావడ"* 💠🌹
/channel/ttdnews
☀️భారీసంభారాలతో స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు.
★ ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు
◆450 కిలోల అన్నప్రసాదాన్ని,
◆లడ్డు,
◆వడ,
◆దోసె,
◆పాయసం,
◆జిలేబి తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు.

🌹💠 *"అభిషేకం:"* 💠🌹
/channel/ttdnews
☀️ శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైంది ప్రతిశుక్రవారం ఉదయం జరిగే అభిషేకం.
★ ఈ సేవ ప్రాశస్త్యం ఏమిటంటే అభిషేక సమయంలో నిత్య కల్యాణశోభితుడైన స్వామివారి నిజరూప దర్శనభాగ్యం భక్తులకు లభిస్తుంది.
◆గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ,
◆శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ,
◆అభిషేకానంతర దర్శనకాలంలో తప్ప మిగతా అన్ని రోజులూ స్వామి వెడల్పాటి తెల్లని కర్పూరనామంతో దర్శనమిస్తాడు.

☀️👉 ఈ మూడు సందర్భాల్లో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్రదర్శనం, నిజపాద దర్శనం అంటారు.
➖➖➖➖🔝➖➖➖➖
ఇలాంటి 👇 మరిన్ని విశేషాలు కోసం
తిరుమల తిరుపతి దేవస్థానం ఈ క్రింది
టెలిగ్రామ్ ఛానల్లో పొందవచ్చు.
/channel/ttdnews
/channel/livetirumala
/channel/newsttd
గమనిక : దయచేసి లింక్స్ తొలగించకుండా మీ సన్నిహితులకు ఫోర్వర్డ్ చేయండి.
*( ఇంకా ఉంది )*

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

(పార్ట్ -1 )
🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
☀️ *తాళపత్ర నిధి* ☀️

శ్రీ వారి పూజావిశేషాలు స్పెషల్ స్టోరీ
🌹🌹👇👇🌹🌹
తిరుమలలో పూజల వివరాలు ?

🌹💠 తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో అనేక విధాలైన పూజలు జరుగుతూ ఉంటాయి.

👉 " వీటిలో ప్రధానమైనవి: "

సుప్రభాతం:
⚜శుద్ధి:
⚜అర్చన:
⚜తోమాలసేవ:
⚜కొలువు:
⚜సహస్రనామార్చన:
⚜ఏకాంతసేవ:
⚜గుడిమూసే ప్రక్రియ:
⚜సడలింపు
⚜పూలంగిసేవ:
⚜తిరుప్పావడ:
⚜అభిషేకం:


👁‍🗨 వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి.
👉 అవి:
★ ప్రత్యూష,
★ ప్రభాత,
★ మధ్యాహ్న,
★ అపరాహ్ణ,
★ సాయంకాల, రాత్రి పూజలు.


☀️ తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.

🌹💠 *" సుప్రభాతం "* 💠🌹
/channel/ttdnews
నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే... ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల) దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు.

★ కుంచెకోలను, తాళంచెవులను, ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు.

★ సుప్రభాతం చదివే అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు.
★ బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు.

★★ వెంటనే అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ, గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొలుపుతుంటాడు.
◆ అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొలుపుతారు. పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు.

★ ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు.

🌹💠 *" శుద్ధి "* 💠🌹
/channel/ttdnews
☀️సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది.
◆శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.
◆స్వామివారికి సమర్పించిన పువ్వులను ఆ తర్వాత ఎవరూ ఉపయోగించకుండా ఉండేందుకే ఇలా చేస్తారు. దీనిని నిర్మాల్య శోధన అంటారు.

🌹💠 *" అర్చన: "* 💠🌹
/channel/ttdnews
☀️ శ్రీవారికి ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది) నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు.

★■ అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి
ఆవుపాలు,
●చందనం,
●పసుపునీళ్లు,
●గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు.
చివరగా పుష్పాంజలి.

★ అనంతరం భోగ మూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ స్వర్ణసూత్రాన్ని కలుపుతారు.

★ ఈ సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక.
◆ ఆ తరువాత మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి, అలంకారాసనం సమర్పిస్తారు.
◆ అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు.
◆ యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.

🌹💠 *" తోమాలసేవ "* 💠🌹
/channel/ttdnews
☀️తమిళంలో 'తోడుత్తమాలై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై "'తోమాల'"... తోమాలసేవ అయి ఉండవచ్చు.
దీన్నే భగవతీ ఆరాధన అని కూడా అంటారు.
👉ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు.
ప్రతి శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత " తోమాలసేవ " చేస్తారు.
గమనిక : దయచేసి లింక్స్ తొలగించకుండా మీ సన్నిహితులకు ఫోర్వర్డ్ చేయండి.
*( ఇంకా ఉంది )*

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉 ౼ *ప్రథమ చికిత్స కేంద్రాల్లో అన్ని వసతులు ఉండాలి 
🕉–  *శ్రీవారి మెట్టు, అలిపిరి నడక దారుల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు పరిశీలించిన జెఈవో*

➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌:
శ్రీవారి మెట్టు,అలిపిరి నడక మార్గాల్లో ప్రథమ చికిత్స కేంద్రాల్లో అత్యవసర మందులు, సదుపాయాలు అందుబాటులో ఉంచుకోవాలని జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి తో కలసి మంగళవారం ఆయన శ్రీవారి మెట్టు,అలిపిరి నడక దారుల్లోని ప్రథమ చికిత్స కేంద్రాలను పరిశీలించారు. 

■ తిరుమల నడక దారుల్లో భక్తులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై అత్యవసర చికిత్స అవసరమైతే వారి ప్రాణాలు నిలపగలిగి ఆసుపత్రికి చేర్చేందుకు అవసరమైన సదుపాయాలన్నీ ప్రథమ చికిత్స కేంద్రాల్లో ఉండాలని జెఈవో చెప్పారు. అలిపిరి మార్గంలోని నాలుగు, శ్రీవారి మెట్టు వద్ద ఉన్న ఒక ప్రథమ చికిత్స కేంద్రాల్లో  డాక్టర్ ను అందుబాటులో ఉంచే ఏర్పాటు చేయాలన్నారు. భవనాలకు అవసరమైన మరమ్మతులు చేయాలని ఇంజినీర్ అధికారులను ఆదేశించారు. అంబులెన్స్, వైర్ లెస్ సెట్లు అందుబాటులో ఉంచే ఆలోచన ఉందన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో మరో రెండు ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని జెఈవో అధికారులను ఆదేశించారు. ఎస్ఈ 2 శ్రీ నాగేశ్వరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద, డాక్టర్ భరత్ కుమార్ పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 14 వ రోజు పాశురం ■
/channel/ttdnews
*తిరుప్పావై - 14 పాశురం*
〰〰➖➖➖〰〰
ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్.°
/channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్ చేయండి
.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉 *తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు*
🟢– *తాళ పత్ర నిధి ఫేస్ బుక్ URL, ఇతరులపై పై పోలీసు కేసు*
🟢– *టీటీడీ అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి*

➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌: తిరుమల ఆలయం మీద విష ప్రచారం చేయడం ద్వారా ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని టీటీడీ అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

■ టీటీడీ హిందూ ధర్మ వ్యాప్తికి కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న కృషి భక్తులందరికీ తెలుసన్నారు.తిరుమల శ్రీవారి ఆలయం ముందు సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.

తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారంపై పూర్ణ కలశ ఆకారంలో ఉన్న విద్యుత్ అలంకరణను శిలువగా మార్ఫింగ్ చేసి తాళ పత్ర నిధి Facebook URL తో పాటు మరికొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారన్నారు..

శ్రీవారి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు హనుమంత, గరుడ, పూర్ణకుంభ అలంకరణలు చేయడం కొన్ని దశాబ్దాలుగా వస్తోందన్నారు. పవిత్రమైన కళశంను శిలువ గా మార్ఫింగ్ చేసి కుట్ర పూరితంగా దుష్ప్రచారం చేశారని ఆయన చెప్పారు. 

ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందనీ, కోట్లాదిమంది భక్తుల్లో ఆందోళన రేకెత్తించిందన్నారు. ఈ పోస్ట్ పెట్టిన తాళ పత్ర నిధి Facebook URL , ఇతరులపై పోలీసు కేసు నమోదు చేశామన్నారు.

◆ హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రం పై తరచూ కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.
తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే వారిని ఉపేక్షించబోమనీ, ఇలాంటి వారిపై టీటీడీ చట్ట పరంగా చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా శ్రీ ధర్మారెడ్డి మీడియా, భక్తులకు సదరు కలశం విద్యుత్ అలంకరణను చూపించారు. చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ ఈ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటి ఈవో శ్రీ హరీంద్ర నాథ్, ఆలయ ఓఎస్డీ శ్రీ పాల శేషాద్రి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

🕉 *అది శిలువ కాదు : భక్తులు*
శ్రీ వారి ఆలయ ప్రాకారం మీద ఏర్పాటు చేసిన పూర్ణ కుంభం లో పువ్వు లాగా విద్యుత్ అలంకరణ చేశారని, అది శిలువ కాదని పలువురు భక్తులు ప్రత్యక్షంగా చూసి స్పష్టం చేశారు. పూర్ణకుంభం ను మార్ఫింగ్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వారు చెప్పారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే వారిని ఉపేక్షించ వద్దని పలువురు భక్తులు టీటీడీకి సూచించారు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 13 వ రోజు పాశురం ■
/channel/ttdnews
తిరుప్పావై -13 వపాశురo భావామృతం

®★ 〰➖➖➖➖〰 ★®
👁‍🗨 " తాత్పర్యము:°"
ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కల్గిస్తుంది ఆండాళ్.
అందరిని చిలిపి తనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణున్నా పాడటం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు, దానితో గోకులం అంతా కలకలం మొదలైంది. కొంతమంది రాముడే సరి అని మరి కొందరు లేదు కృష్ణుడే సరి అనిరెండు జట్టులుగా విడిపోయారు.

◆ వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి, వారి మద్య నిలిచి వాళ్ళకొక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళితే అక్కడ ఆమె శ్రీకృష్ణున్ని కథ చెబుతూ పడుకోబెడుతుంది.
అనగనగా రాముడు, భార్య సీత వాల్లు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు......
అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి *" సౌమిత్రే ధనుః"* అని అరిచాడు.
ఆ తల్లికేమి అర్థం కాక కంగారు పడిపోయింది. మరి కృష్ణుడెందుకు లక్ష్మణున్ని ధనస్సు తెమ్మని పిలిచాడు, ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడుండే అవసరాలకోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు, ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసి కట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు.

◆ కృష్ణుడి జట్టు వారు *"పుళ్ళిన్ వాయ్ కీండానై"* ఒకనాడు కొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేసాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టువారు *"ప్పొల్లా అరక్కనై"* రావణాసురుడిని గిల్లి పారవేసాడు రాముడు అని అన్నారు. *"కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్"* ఇలా స్వామి కళ్యాణగుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు.

*"పిళ్ళైగళ్ ఎల్లారుమ్"* గోపబాలికలందరూ
*"పావైక్కళం పుక్కార్"* వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోప బాలికతో అన్నది. లోపల గోప బాలిక వాళ్ళంతా చిన్న పిల్లలు కదా తొందర పడుతున్నారు ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది, వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెప్పుతున్నారు.
*"వెళ్ళి యెరుందు"* శుక్రోదయం అయ్యింది,
*"వియారమ్"* బృహస్పతి *"ఉఱంగిత్తు"* అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు. మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేక పోయామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోదంగా ఉన్నాయి, ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి, అందుకని భగవంతుణ్ణి చేరటానికి ఇది సరియైన సమయం.

◆ *"పుళ్ళుం శిలమ్బిన కాణ్"* పక్షులు మాటలాడుకుంటున్నాయి *"పోదరి క్కణ్ణినాయ్"* తుమ్మెద వాలిన పుష్పంవంటి కళ్ళు కలదానా. తనను గుర్తించిన వాన్ని భగవంతుడు శిరస్సున ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోప బాలిక తను వెళ్ళడం ఎంటీ కృష్ణుడే తన దగ్గరకు రానీ అంటూ పెద్దగా పట్టిచ్చుకోవడం లేదు. *"కుళ్ళ కుళిర"* చల చల్లటి ఆనీటిలో *"క్కుడైందు"* నిండా మునిగి *"నీరాడాదే"* అవగాహన స్నానం మనం చేయ్యాలి కదా , లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు, ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది. *"పళ్ళి క్కిడత్తియో"* ఇంకా పడుకుని ఉన్నావా *"పావాయ్!"* ముగ్దత కల్గిన దానా, *" నీ నన్నాళాల్"* సమయం అయిపోతుంది, *"కళ్ళం తవిరుందు కలంద్"* మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలువు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో చేర్చుకున్నారు.....!°
/channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్ చేయండి.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

■ 13 వ రోజు పాశురం ■
/channel/ttdnews
తిరుప్పావై - 13 వ పాశురం°
/channel/ttdnews
👉° అన్నీ పాసురాలు అందరూ వినేలా
ఈ లింక్ అందరికీ ఫారవర్డ్ చేయండి.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉 *శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌:
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ‌నివారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుద‌ర్శ‌న చ‌క్ర‌త్తాళ్వార్‌ను శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ భూవ‌రాహ‌స్వామివారి ఆల‌యానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు.

★ శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు.
👹 కోవిడ్‌-19 కార‌ణంగా దాదాపు 9 నెల‌ల త‌రువాత పుష్క‌రిణిలో చ‌క్ర‌స్నానం నిర్వ‌హించారు.

👉 ఈ సంద‌ర్భంగా టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు, ర‌థ‌స‌ప్త‌మి, అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం, వైకుంఠ ద్వాద‌శి సంద‌ర్భంగా సంవ‌త్స‌రంలో నాలుగుసార్లు చ‌క్ర‌స్నానం జ‌రుగుతుంద‌ని తెలిపారు. కోవిడ్ త‌రువాత ప్ర‌స్తుతం ఏకాంతంగా చ‌క్ర‌స్నానం నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు.

👉🟢 °శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నాన‌మాచ‌రించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం. ద్వాద‌శి ప‌ర్వ‌దినం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవ‌లను టిటిడి రద్దు చేసింది.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…
Subscribe to a channel