ttdnews | Unsorted

Telegram-канал ttdnews - 🙏ఓం నమోవేంకటేశాయ🙏

10371

తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం ఈ Telegram App లింక్ తో టీటీడీ సమాచారం నిరంతరము ఉచితం గా పొందవచ్చు. https://t.me/ttdnews మరియు అన్నమయ్య సంకీర్తనలు https://t.me/Annamaiah_Paatalu సందేహాలు _ సలహాలకు 701 345 1212

Subscribe to a channel

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
/channel/newsttd➖
🕉 *ఆగ‌స్టు 1 నుండి అఖండ హ‌రినామ సంకీర్త‌న పునఃప్రారంభం*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమ‌ల‌:

తిరుమ‌ల‌లో అఖండ హ‌రినామ సంకీర్త‌న ఆగ‌స్టు ఒక‌టో తేదీ నుండి పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ప్ర‌ధాన క‌ల్యాణ‌క‌ట్ట వ‌ద్ద‌గ‌ల మండ‌పంలో సోమ‌వారం ఉద‌యం పూజా కార్య‌క్ర‌మంతో ఈ కార్య‌క్ర‌మం మొద‌లుకానుంది.

👉 హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా జాన‌ప‌ద క‌ళ‌ల‌ను ప‌రిర‌క్షించి అవి అంత‌రించిపోకుండా కాపాడేందుకు టిటిడి కృషి చేస్తోంది.
■ ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుండి జానపద కళాకారులను తిరుమ‌ల‌కు ఆహ్వానించి అన్నమయ్య,
■ త్యాగయ్య తదితర వాగ్గేయకారుల భజనలు, కీర్తనలు ఆలాప‌న చేయిస్తోంది.

👉 ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనే భ‌జ‌న బృందాల స‌భ్యుల‌కు వ‌స‌తి, భోజ‌నం, ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. రాను పోను బ‌స్సు ఛార్జీల‌కు అయ్యే రుసుమును వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జ‌మ చేస్తారు.

భ‌జ‌న బృందాల స‌భ్యుల‌కు నిర్దేశిత స్లాట్ కేటాయించి వారి వివ‌రాల‌ను టిటిడి వెబ్‌సైట్
 www.tirumala.org లో
అందుబాటులో ఉంచుతారు.
ఆగ‌స్టు నెల‌కు సంబంధించి కేటాయించిన స్లాట్ల వివ‌రాల‌ను ఇప్ప‌టికే వెబ్‌సైట్‌లో పొందుప‌రిచారు.
తిరుమ‌ల‌తోపాటు వివిధ జిల్లాల్లోని టిటిడి ఆల‌యాల్లో జ‌రిగే ఉత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు భ‌జ‌న బృందాల స‌భ్యుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తారు.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
/channel/newsttd➖
🕉 *జులై 21న వ‌స్త్రాల టెండ‌ర్ క‌మ్ వేలం*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుపతి:

తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను జులై 21వ‌ తేదీన టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు.

■ కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 13 లాట్లు ఉన్నాయి. వీటిలో సిల్క్‌/పాలిస్ట‌ర్ నైలాన్‌/నైలెక్స్‌/ఆర్ట్ సిల్స్ చీర‌లు, బ్లౌజ్‌పీస్‌లు ఉన్నాయి.

👉 రూ.590/- చెల్లించి టెండ‌రు షెడ్యూల్ పొందొచ్చు.
ఆస‌క్తి గ‌ల‌వారు రూ.5 వేలు ఇఎండిగా చెల్లించాల్సి ఉంటుంది.

👉 ఇతర వివరాలకు తిరుపతిలోని కేంద్రీయ విద్యాల‌య ఎదురుగా గ‌ల
టిటిడి మార్కెటింగ్ ( వేలం) కార్యాలయాన్ని
☎️ 0877-2264429 నంబరులో గానీ,

🟢 రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్‌ www.konugolu.ap.gov.in లేదా టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
/channel/ttdnews
🕉 *జూలై 8న సెప్టెంబరు నెల వ‌స‌తి కోటా ఆన్ లైన్ లో విడుదల*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమల:

సెప్టెంబరు నెల‌కు సంబంధించిన తిరుమ‌లలో వ‌స‌తి కోటాను జూలై 8వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

👉 🔴 అదేవిధంగా, శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు జూలై 12, 15, 17తేదీల్లో వ‌ర్చువ‌ల్ ఆర్జిత సేవా టికెట్లు పొందిన భ‌క్తుల‌కు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

👉 భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌వ‌ల‌సిందిగా  కోర‌డ‌మైన‌ది.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
/channel/ttdnews
🕉 *జులై 10 నుండి 18వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుపతి:

తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జులై 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జులై 9వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు.

జులై 10న ఉదయం 6.58 గంటలకు ధ్వజారోహణంతో......
బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి.
రాత్రి హంసవాహన సేవ నిర్వహిస్తారు.

జులై 11, 12, 13, 14 మ‌రియు 17వ తేదీల్లో ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వ‌హిస్తారు.

అదేవిధంగా
జులై 11న రాత్రి చంద్రప్రభ వాహనం,
12న‌ రాత్రి చిన్నశేష వాహనం,
13న రాత్రి సింహ వాహనం,
14న సాయంత్రం నంది వాహ‌న‌సేవ జ‌రుగుతాయి.
జులై 15న సాయంత్రం 6 నుండి రాత్రి 7గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది.

👉 గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.
గృహస్తులకు ఒక ఉత్తరీయం,
ఒక రవికె,
ఒక లడ్డూ,
ఒక అప్పం,
అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

👉 ఆ తరువాత రాత్రి 7.30 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు.

■ జులై 16న సాయంత్రం పల్లకీ సేవ,
■ 17న సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం,
■ 18న ఉదయం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు త్రిశూలస్నానం,
■ సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

👉 బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు, సాయంత్రం 6 గంట‌ల‌కు వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

■ జులై 19వ తేదీన పుష్పయాగం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీసిద్ధేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.

👉 అదేరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.

◆ బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🕉 సుందరకాండ ప్రవచనము 🕉
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
వివరాలకు : 👇👇👇👇
/channel/newsttd/124458

/channel/newsttd/124459

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
/channel/ttdnews
🕉 * మే 13 నుండి 21వ తేదీ వరకు రిషికేష్‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుపతి:

రిషికేష్‌లోని ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో మే 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

మే 10న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 12వ తేదీ సాయంత్రం సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం నిర్వహిస్తారు.

తేదీ  ★ ఉదయం ★ సాయంత్రం

■13-05-2022 ధ్వజారోహణం,   పెద్ద‌శేష వాహ‌నం

■14-05-2022 చిన్న‌శేష వాహ‌నం,   హంస వాహనం

■15-05-2022 సింహవాహనం,    ముత్య‌పుపందిరి వాహ‌నం

■16-05-2022 క‌ల్ప‌వృక్ష వాహ‌నం,    స‌ర్వ‌భూపాల వాహ‌నం

■17-05-2022 మోహిని అలంకారం,   గ‌రుడ‌వాహ‌నం

■18-05-2022 హ‌నుమంత వాహ‌నం,    గ‌జ‌వాహ‌నం

■19-05-2022 సూర్యప్ర‌భ వాహ‌నం,     చంద్ర‌ప్ర‌భ వాహ‌నం

■20-05-2022 ర‌థోత్స‌వం,   అశ్వ‌వాహ‌నం

■21-05-2022 చ‌క్ర‌స్నానం,    ధ్వజావరోహణం

★★★ మే 20వ తేదీ మ‌ధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స్వామివారి కల్యాణం వైభంగా జ‌రుగ‌నుంది.

👉 ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
*Dept.Of PRO TTD*
పూర్తి వివరాలు కోసం
/channel/newsttd
👆👆👆👆
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
/channel/ttdnews
🕉 *ఏప్రిల్ 26 నుండి మే 5వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌ భాష్య‌కార్ల ఉత్స‌వం*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుపతి:

తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ భాష్య‌కార్ల ( శ్రీ రామానుజాచార్యులు) ఉత్స‌వం ఏప్రిల్ 26 నుండి మే 5వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నుంది.

ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 గంట‌ల‌కు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు పెద్దమాడ వీధి ఉత్సవం నిర్వ‌హిస్తారు. ఉద‌యం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం జ‌రుగ‌నుంది.

మే 4న భోగి తేరు, మే 5న సాత్తుమొర జ‌రుగ‌నుంది.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
/channel/ttdnews
🕉 *వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ ఒంటిమిట్ట:

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ‌నివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు. భజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు.

◆ ఆత్మ రథికుడు,
◆ శరీరమే రథం,
◆ బుద్ధి సారథి,
◆ మనస్సు పగ్గం,
◆ ఇంద్రియాలే గుర్రాలు,
◆ విషయాలే వీధులు.

ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.

👉 ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ‌ రమణప్రసాద్, ఏఈవో శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉–  *టిటిడిలో ఘనంగా  గణతంత్ర దినోత్సవ వేడుకలు*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌:
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ప్రాంగణంలోని మైదానంలో  మంగ‌ళ‌వారం ఘనంగా జ‌రిగాయి.
👉 ఈ సందర్భంగా టిటిడి కార్య‌నిర్వ‌హ‌ణాధికారి డాక్ట‌ర్.కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌ రెడ్డి ఉద్యోగుల‌ను ఉద్దేశించి ప్రసంగించారు.  వివ‌రాలు వారి మాటల్లోనే….

■ ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల సేవలో తరిస్తున్న ధర్మకర్తల మండలికి,
అధికార యంత్రాంగానికి,
అర్చకులకు,
సిబ్బందికి,
భద్రతా సిబ్బందికి,
విశ్రాంత సిబ్బందికి,
శ్రీవారి సేవకులకు,
స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు, భక్తులకు మరియు మీడియా మిత్రులకు 72వ గణతంత్ర దినోత్సవ  శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

■ ఎందరో యోధుల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడిగా నిలిచాడు. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర పర్వదినం రోజున టిటిడి భక్తులకు చేస్తున్న అనేక సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

🕉 *శ్రీవారి ఆలయం :*
➖〰〰〰〰〰〰➖
★–      టిటిడి నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం.

★–      కోవిడ్‌-19 నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర టిటిడి ఆలయాలలో బ్రహ్మూెత్సవాలను ఏకాంతంగా నిర్వహించాం. కోవిడ్‌ పరిస్థితుల్లో తమవంతు సాయంగా తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, రెండో సతం, తిరుచానూరులోని పద్మావతి నిలయంలో రోగులకు వసతి కల్పించాం. క్లిష్టసమయంలో భక్తులకు, రోగులకు ఆపన్నహస్తం అందించాం.

🕉 *శ్రీవారి దర్శనం*
➖〰〰〰〰〰➖
★– ఉద్యోగులు, భక్తుల ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కోవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం. తితిదే నిబంధనలు పాటిస్తూ సంతృప్తికరంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్న భక్తులను అభినందిస్తున్నాము.

★– వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల సాంప్రదాయాలను పునరుద్ధరింపచేస్తూ శ్రీమాన్‌ పెద్దజీయంగార్లు, ఆగమసలహాదారులు మరియు 26 మంది పీఠాధిపతులు మరియు మఠాధిపతులను సంప్రదించి వారి అభిప్రాయం మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలో మొట్టమొదటిసారిగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి సుమారు 4.26 లక్షల మంది భక్తులను దర్శనభాగ్యం కల్పించాం. మొట్టమొదటిసారిగా 3 లక్షల మంది సామాన్య భక్తులకు ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ ద్వారా ఎలాంటి సిఫార్సులు లేకుండా టోకెన్లు జారీచేసి 10 రోజులలో వైకుంఠద్వార దర్శనభాగ్యం కల్పించాం. దాతలకు వైకుంఠ ద్వార ప్రవేశం కల్పించడం కూడా ఇదే మొదటిసారి.

★– ఫిబ్రవరి 19న రథసప్తమి సందర్భంగా ఆలయ మాడ వీధుల్లో స్వామివారి వాహనసేవలు నిర్వహిస్తాం. యథాప్రకారం దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తాం.

★– ధర్మప్రచారంలో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నాం.

★ ఈ ట్రస్టుకు రూ.10 వేలు విరాళం అందించిన దాతలకు ఒకసారి విఐపి బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నాం. ఈ ట్రస్టుకు రూ.100 కోట్ల పైగా విరాళాలు అందాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉–  *జ‌న‌వ‌రి 27 నుండి 29వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ – వేలం*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌:
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 129 లాట్ల‌ను జ‌న‌వ‌రి 27 నుండి 29వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో కొత్త‌వి, వినియోగించిన వస్త్రాలు, (సిల్క్, పాలిస్టర్ ధోతీలు, చీరలు, టర్కీ టవ‌ళ్లు, రెడిమేడ్‌ వస్త్రాలు, రవికెలు, బెడ్ షీట్లు, పిల్లో కవర్లు, కర్చీఫ్ లు, దుప్పట్లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్ వ‌స్త్రాలున్నాయి.

👉ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ,
రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ 
www.konugolu.ap.gov.in  /
 www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉–  *జెఈవో ఆదేశాల మేరకు తిరుపతిలో టిటిడి ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌
: టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి ఆదేశాల మేరకు తిరుపతిలోని టిటిడి ఆస్తులకు, ఖాళీ స్థలాలకు అధికారులు శనివారం రక్షణ ఏర్పాట్లు చేశారు.

® ◆ జెఈవో ఎస్టేట్ విభాగం పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తిరుపతిలోని ఆస్తులను తనిఖీ చేశారు. టిటిడి ఆస్తులు, ఖాళీగా ఉన్న స్థలాల వద్ద ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడాన్ని గుర్తించారు.

👉 ఈ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా వెంటనే రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి చీఫ్ ఇంజనీర్ కు, ఎస్టేట్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇంజినీరింగ్, ఎస్టేట్ విభాగం, భద్రతా విభాగాల సిబ్బందితో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. జెఈవో ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం టిటిడి ఆస్తులకు కంచెను ఏర్పాటు చేసి, టిటిడికి చెందినవిగా గుర్తించేందుకు వీలుగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
◆ భైరాగిపట్టెడ, కేశవాయనగుంటలో 8 ఆస్తులు,
◆ వైకుంఠపురం, ఎంఆర్ పల్లిలో 14 ఆస్తులు కలిపి 22 ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు చేశారు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

అంతయు నీవే హరి పుండరీకాచ
https://youtu.be/n1rWCw1WvMI
👆👆👆👆👆
https://m.facebook.com/groups/984098701930156/permalink/1330518523954837/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

👆👆👆👆👆👆👆👆👆👆
🙏 *ఉచిత సప్తగిరి మాసపత్రిక*🙏
2020
తిరుమల పూర్తి వివరాలు కు ఈ క్రింది *Telegram App* లింక్ లో చూడవచ్చు.
👉 /channel/ttdnews
*తిరుమల చరిత్ర కోసం*
👉 /channel/newsttd
అందరికీ లింక్ తో పాటు షేర్ చేయండి.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏*ఉచిత సప్తగిరి మాసపత్రిక*🙏
2020
తిరుమల పూర్తి వివరాలు కు ఈ క్రింది *Telegram App* లింక్ లో చూడవచ్చు.
👉 /channel/ttdnews
*తిరుమల చరిత్ర కోసం*
👉 /channel/newsttd
అందరికీ లింక్ తో పాటు షేర్ చేయండి.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉– *శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌:
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 14వ తేదీ నుండి 25 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు.

◆ గత 25 రోజులుగా శ్రీవారి ఆలయంలో శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా ప్ర‌తి రోజు స్వామివారికి నివేదించారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను పారాయణం చేశారు.

గురువారంనాడు అధ్యయనోత్సవాల్లో చివరిరోజు కావడంతో ”తన్నీరముదుఉత్సవం నిర్వహించారు. అధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం మరుసటిరోజు అనగా జ‌న‌వ‌రి 8న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు దక్షిణ మాడ వీధిలోని శ్రీ తిరుమలనంబి ఆలయానికి వేంచేస్తారు.

🕉 *ఘనంగా  ”తిరుమలనంబి తన్నీరముదు” ఉత్సవం*

శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమలనంబి స్మృత్యర్థం ప్రతి ఏడాదీ నిర్వహించే ”తన్నీరముదు” ఉత్సవం తిరుమలలో గురువారం నాడు ఘనంగా జరిగింది. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధి ఆలయ ప్రదక్షిణముగా వాహన మండపానికి వేంచేపు చేస్తారు.
◆ తిరుమలనంబి ఆలయం నుండి వీధి ప్రదక్షిణంగా తిరుమలనంబి వంశీకులు శిరస్సుపై బిందెలతో ఆకాశగంగ తీర్థాన్ని వాహన మండపానికి తీసుతీసుకొచ్చారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్‌ స్వాములు, ఆచార్య పురుషులు, ప్రబంధ పండితులు పవిత్ర తీర్థజలంతో ఆలయంలోకి వేంచేపు చేశారు.

◆ అనంతరం ఆల‌య అర్చ‌కులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుమల నంబి రచించిన ”తిరుమొళి పాశురాలను” పారాయణం చేశారు.

👉 ఈ కార్య‌క్ర‌మంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌ స్వామి, ‌తిరుమ‌ల‌నంబి వంశీయులు శ్రీ కృష్ణ‌స్వామి తాతాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
➖ /channel/newsttd➖
🕉 *ఆన్‌లైన్‌లో శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల టికెట్లు*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమ‌ల‌:
తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 8 నుండి 10వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న ప‌విత్రోత్స‌వాల్లో భ‌క్తులు పాల్గొనేందుకు వీలుగా ఆగ‌స్టు 1న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో టికెట్ల‌ను విడుద‌ల చేయ‌నుంది.

■ మొత్తం 600 టికెట్ల‌ను ఆన్‌లైన్ ద్వారా జారీ చేస్తారు. రూ.2500/- చెల్లించి భ‌క్తులు టికెట్ బుక్ చేసుకోవ‌చ్చు. టికెట్లు పొందిన భ‌క్తులు ప‌విత్రోత్స‌వాలు జ‌రిగే మూడు రోజులు స్న‌ప‌న‌తిరుమంజ‌నంలో, చివ‌రిరోజు పూర్ణాహుతిలో పాల్గొన‌వ‌చ్చు.

◆ ప‌విత్రోత్స‌వాల్లో పాల్గొనే భ‌క్తులు సంప్ర‌దాయ వ‌స్త్రధార‌ణ‌లో ఉద‌యం 7 గంట‌ల‌కు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 వ‌ద్దకు చేరుకోవాలి.
◆ టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజిన‌ల్ ఫొటో గుర్తింపు కార్డు చూపాలి.

మ‌రిన్ని వివ‌రాల‌కు :
www.tirumala.org లేదా
www.tirupatibalaji.ap.gov.in
వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించ‌గ‌ల‌రు.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
/channel/newsttd➖
🕉 *జులై 9న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమల:

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం

🟢 ☎️ జులై 9వ తేదీ శ‌నివారం ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు
తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది.

👉 ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

👉 ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు.

ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు
📞 ☎️ 0877-2263261
/channel/newsttd
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
/channel/ttdnews
🕉 *శ్రీవారి ఆలయంలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమల:

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ......

జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహించనుంది. ఇందులో భాగంగా....
◆ ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం
సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది.

👉 సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ.
◆ఉగాది,
◆ఆణివార ఆస్థానం,
◆బ్రహ్మోత్సవం,
◆వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

★★ తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

■ తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

👉 అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🕉 ఎక్కడ సుందరకాండ పారాయణము జరుగుతుందో...
/channel/newsttd
అక్కడ
శ్రీ హునుమంతుడు చిట్టచివరి వరకు ఉంటాడని పురాణాలు చెపబతున్నాయి.

అలాంటి దివ్య ప్రవచనాలలో
" సుందరకాండ " అతి పవిత్రమైనది. ఈ
" సుందరకాండ " ప్రవచనాల పవిత్రతకు ప్రాణంపోసిన వారిలో అవధాని కోట రాజశేఖర్ గారు ఒకరు.

👉 ఈ పవిత్రమైన కార్యక్రమంలో ప్రతీఒక్కరూ పాల్గొని ఆ సీతారాముల అనుగ్రహం పొందాలని కోరుకుంటూ.......

మన హిందూ ధర్మాన్ని వెలుగెత్తి చాటేందుకు ప్రతీఒక్కరూ దోహదపడాలని ఆ శ్రీవారి కృఫకు పాత్రులు కావాలని మా మనవి.

ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతీఒక్కరూ పాల్గొన్నాలని కోరదమైనది.
/channel/newsttd

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
➖ /channel/ttdnews ➖
🕉 *బంగారు రథం పై శ్రీదేవి భూదేవి లతో శ్రీ మలయప్ప స్వామి*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమల:
తిరుమలలో వార్షిక వసంతోత్సవం ఉత్సవాల్లో భాగంగా, శ్రీ మలయప్ప స్వామి తన ఇరువురు భార్యాలతో కలసి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు మాడ వీధుల్లో స్వర్ణ రథంపై విహరించి భక్తులను ఆశీర్వదించారు.

■ స్నాపన తిరుమంజనం కోసం వసంత మండపానికి చేరుకున్న వేలాది మంది శ్రీవారి భక్తులు స్వర్ణ రథాన్ని లాగడంతో తిరుమల మొత్తం గోవింద నామస్మరణలతో మారుమోగిపోఇంది.

👉 అనంతరం మధ్యాహ్నం ఎంతో ఘనంగా స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించడంతో భక్తులు పరవశించిపోయారు.

👉 ఈ కార్యక్రమంలో తిరుమల పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్స్వామి, రాష్ట్ర మంత్రి శ్రీ వేణుగోపాల కృష్ణ, టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, డీవైఈవో శ్రీ రమేష్ బాబు, వీజీవో శ్రీ బాలిరెడ్డి. మరియు ఇతరులు హాజరయ్యారు
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
/channel/ttdnews
🕉 *ఏప్రిల్ 25న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమల:

జులై నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 25వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఈ సేవా టికెట్ల‌ను బుక్ చేసుకోవాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.
*Dept.Of PRO TTD*
పూర్తి వివరాలు కోసం
/channel/newsttd
👆👆👆👆
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
/channel/ttdnews
🕉 *ఏప్రిల్ 24వ తేదీన క‌ర్ణాట‌కలోని దిన్న‌హ‌ళ్లిలో శ్రీనివాస కల్యాణం*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుపతి:

టిటిడి శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 24వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు క‌ర్ణాట‌క రాష్ట్రం, చిక్కబల్లాపూర్ జిల్లా, గుడిబండ తాలూకాలో దిన్న‌హ‌ల్లిలోని శ్రీ పాతాళేశ్వర స్వామి దేవాలయ ప్రాంగ‌ణంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు అధికారులు కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

/channel/ttdnews/9400

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉–  *కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యంలో ముగిసిన ”బాలాలయ సంప్రోక్షణ”*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌:
కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామి వారి చిత్ర ప‌టాల‌కు బాలాలయ సంప్రోక్షణ సోమ‌‌వారం ఉదయం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

◆ ఉద‌యం 6 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు యాగ శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి నిర్వ‌హించారు.
● అనంత‌రం ఉద‌యం 9.15 గంట‌ల‌కు కుంభ‌ ల‌గ్నంలో బాలాల‌య చిత్ర‌ప‌టాల‌కు కుంభ ఆవాహ‌న నిర్వ‌హించారు.

👉 ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, టిటిడి వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ర‌ద‌న్‌, కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సీతారామాచార్యులు, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కుమార్, అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉–  *టిటిడి పరిపాలన‌ భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌:
తిరుపతిలోని టిటిడి పరిపాలన‌ భవనంలో జనవరి 26వ తేదీ మంగ‌ళ‌వారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

◆ పరిపాలన‌ భవనం వెనక వైపున గల ప‌రేడ్‌ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విధినిర్వ‌హ‌ణ‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన‌ ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా టిటిడి విద్యాసంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉–  *ఎస్వీబీసీలో ధార్మిక కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ కోసం రూ.50 ల‌క్ష‌ల స్పాన్స‌ర్‌షిప్‌*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌:
శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ఒక సంవ‌త్స‌రం పాటు ధార్మిక‌, భ‌క్తిప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేసేందుకు గాను యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 ల‌క్ష‌లా 55 వేల 120 రూపాయ‌లు స్పాన్స‌ర్‌షిప్ అందించింది.

◆ బ్యాంకు ఎండి మ‌రియు సిఈవో శ్రీ రాజ్‌కిర‌ణ్ రాయ్ సూచ‌న‌ల మేర‌కు తిరుప‌తి డిజిఎం శ్రీ ద‌త్తాత్రేయ వేంక‌టేశ్వ‌ర‌శ‌ర్మ స్పాన్స‌ర్‌షిప్ మొత్తం డిడిని శ‌నివారం తిరుమ‌ల‌లోని క్యాంపు కార్యాల‌యంలో టిటిడి అద‌న‌పు ఈవో మ‌రియు ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

👉 ఈ కార్య‌క్ర‌మంలో యూనియ‌న్ బ్యాంక్ తిరుప‌తి ఎజిఎం శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, తిరుమ‌ల శాఖ మేనేజ‌ర్ శ్రీ సాంబ‌శివ‌రావు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
/channel/ttdnews
🕉– *తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల:

కనుమ పండుగ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం శుక్ర‌‌వారం ఘనంగా జరిగింది. మ‌ధ్యాహ్నం 1 గంట‌కు శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంట మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి పార్వేట మండపమునకు చేరుకున్నారు . పుణ్యాహవచనం తర్వాత మంచెలో వేంచేసారు. శ్రీస్వామివారికి ఆరాధనము, నివేదన,  హారతులు జరిగాయి.

■ శ్రీకృష్టస్వామివారిని మాత్రము సన్నిధి యాద‌వ పూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలువెన్న ఆరగింపు అయి హారతి జరిగిన పిమ్మట శ్రీమలయప్పస్వామివారి సన్నిధికి వెళ్ళారు. తరువాత స‌న్నిధి యాద‌వ‌ సమర్పించిన పాలు వెన్న శ్రీమలయప్పస్వామివారికి నివేదనము హారతి అయి యాద‌వ‌కు బహుమానము జరిగింది. తరువాత శ్రీమలయప్పస్వామివారు ముందుకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణమువేసి వెనుకకు వచ్చారు. ఇలా మూడుసార్లు జరిగింది. 

🟢 శ్రీమలయప్పస్వామివారు ఉత్సవము పూర్తియి మహాద్వారమునకు వచ్చి హథీ రాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు.

👉 ఈ ఉత్సవంలో అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మా రెడ్డి దంపతులు, డిఎఫ్.వో. శ్రీ చంద్ర శేఖర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, ఎస్.ఈ. శ్రీ నాగేశ్వర్ రావు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

🙏ఉచిత సప్తగిరి మాసపత్రిక🙏
2020
తిరుమల పూర్తి వివరాలు కు ఈ క్రింది *Telegram App* లింక్ లో చూడవచ్చు.
👉 /channel/ttdnews
*తిరుమల చరిత్ర కోసం*
👉 /channel/newsttd
అందరికీ లింక్ తో పాటు షేర్ చేయండి.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

👆👆👆👆👆👆👆👆👆👆👆
🙏 *ఉచిత సప్తగిరి మాసపత్రిక*🙏
2020
తిరుమల పూర్తి వివరాలు కు ఈ క్రింది *Telegram App* లింక్ లో చూడవచ్చు.
👉 /channel/ttdnews
*తిరుమల చరిత్ర కోసం*
👉 /channel/newsttd
అందరికీ లింక్ తో పాటు షేర్ చేయండి.

Читать полностью…

🙏ఓం నమోవేంకటేశాయ🙏

➖ /channel/ttdnews ➖
🕉–  *శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారమైన ధార్మిక కార్యక్రమాలు :*

🟢– డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి, గీతాజయంతి పర్వదినాల‌ను పురస్కరించుకుని దాదాపు 4 గంటల‌ పాటు భగవద్గీత అఖండ పారాయణం నిర్వహణ.

🟢– ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 6 నుండి 6.45 గంటల‌ వరకు – మార్గశీర్షం విష్ణుతత్వం, ఉదయం 8.30 నుండి 9.30 గంటల‌ వరకు – తిరుప్పావై

🟢– శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి, చెన్నై ట్రిప్లికేన్‌లోని శ్రీ పార్థసారథిస్వామి, భద్రాచ‌లంలోని శ్రీరామచంద్రుని ఆల‌యాల‌ నుండి ఉత్తర ద్వార దర్శనం (వైకుంఠ ఏకాదశి నాడు) ప్రత్యక్ష ప్రసారం.

🟢– శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాయంలో డిసెంబరు 26న శ్రీ వ్రతం, 27న కుబేర వ్రతం.

🟢– జనవరి 2న 8వ విడత అఖండ సుందరకాండ పారాయణం.

🟢– జ‌న‌వ‌రి 8న క‌ర్నూలు న‌గ‌రంలో ధ‌నుర్మాస ల‌క్ష్మీదీపారాధ‌న‌.

🟢– జ‌న‌వ‌రి 14న టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గోదాక‌ల్యాణం.

🕉 *ప్రజాసంబంధాల‌ విభాగం :*

🟢– దేశం న‌లుమూలల‌ నుండి విచ్చేసిన 2000 మంది శ్రీవారి సేవకుల‌తో భక్తుల‌కు సేవ‌లు.

🕉 *ఆల‌యాల‌కు ప‌టిష్ట భ‌ద్ర‌త : సివిఎస్వో*


టిటిడి ప‌రిధిలో మొత్తం 50 ఆల‌యాలు ఉన్నాయ‌ని, వీటి వ‌ద్ద ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి తెలిపారు. 41 ఆల‌యాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామ‌ని, మిగిలిన 9 ఆల‌యాల్లో జ‌న‌వ‌రి 15వ తేదీనాటికి పూర్తి చేస్తామ‌ని చెప్పారు. జ‌న‌వ‌రి 5వ తేదీ మంగ‌ళ‌వారం నుండి పాప‌వినాశ‌నం మార్గంలో భ‌క్తుల‌ను అనుమ‌తిస్తామ‌ని వెల్ల‌డించారు.
*Dept.Of PRO TTD.*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

Читать полностью…
Subscribe to a channel