🕉️ నేడు *తిరుమల స్వామివారి ఉచిత దర్శనము టిక్కెట్స్ వివరాలు.*
26.03.2024
👇👇👇
/channel/newsttd
👇👇👇👇
https://whatsapp.com/channel/0029VaQWQRGL7UVWKZa2f23u/149
⚠️ *తిరుపతిలో ఉచిత దర్శనం టిక్కెట్లు ఇచ్చు ప్రదేశాలు :*
*1). శ్రీనివాసం - తిరుపతి*
*2). విష్ణు నివాసం - తిరుపతి*
వద్ద *ఉదయం 4 గంటల నుంచి ,* మరియు
■ తిరుపతి లోని *భూదేవి కాంప్లెక్స్ అలిపిరి వద్ద* దివ్యదర్శనం టోకెన్లు *ఉదయం 3 గంటల* నుండి ఇస్తారు.
■ *శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఉదయం 5 నుండి ఆ నడకదారి మధ్యలో ఇస్తారు.*
🕉️ నేడు *తిరుమల స్వామివారి ఉచిత దర్శనము టిక్కెట్స్ వివరాలు.*
22.03.2024
👇👇👇
/channel/newsttd
👇👇👇👇
https://whatsapp.com/channel/0029VaQWQRGL7UVWKZa2f23u/139
🕉️ నేడు *తిరుమల స్వామివారి ఉచిత దర్శనము టిక్కెట్స్ వివరాలు.*
19.03.2024
👇👇👇
/channel/newsttd
👇👇👇👇
https://whatsapp.com/channel/0029VaQWQRGL7UVWKZa2f23u/136
🕉️ నేడు *తిరుమల స్వామివారి ఉచిత దర్శనము టిక్కెట్స్ వివరాలు.*
10.03.2024
👇👇👇
/channel/newsttd
👇👇👇👇
https://whatsapp.com/channel/0029VaQWQRGL7UVWKZa2f23u/123
*నేడు తిరుమల రద్దీ వివరాలు*
➖➖➖🕉️➖➖➖
👇👇👇👇👇👇👇
https://whatsapp.com/channel/0029VaQWQRGL7UVWKZa2f23u/109
🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
➖ /channel/newsttd➖
🕉 *ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు*
*౼〰〰〰〰〰౼*
*TTD News ™ తిరుపతి :* తిరుపతి లో శ్రీ గోవిందరాజస్వామివారి *తెప్పోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి.*
ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు *స్నపన తిరుమంజనం* నిర్వహించారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా
*శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు.* అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
తెప్పలను అధిరోహించిన స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు.
👉 ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *Wats app* ఛానల్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://whatsapp.com/channel/0029VaQWQRGL7UVWKZa2f23u
🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
➖ /channel/newsttd➖
🕉 *వైభవంగా పౌర్ణమి గరుడసేవ
〰〰〰〰〰
TTD News ™ తిరుపతి :
తిరుమలలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
🕉 గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *Wats app* ఛానల్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://whatsapp.com/channel/0029VaQWQRGL7UVWKZa2f23u
*" ఓం నమోవేంకటేసాయ "*
టీటీడీ సమాచారం కోసం
@ttdnews
టీటీడీ సమాచారం
వాయిస్ & మేసేజ్ చాట్ కోసం
@newsttd
భగవత్గీత క్విజ్ కోసం
@BhagavadGita_Quiz
"మనిషి ఇలా ఉండాలి"
అని తెలిపే కొటేషన్లు మీకోసం
@manchimaatalu
అన్నమయ్య సంకీర్తనలు టెక్స్ట్ ఫైల్తో
@Annamaiah_Paatalu
రోజుకో తాళపత్రము చదివి తెలుసుకుందాము.
@thaalapathram
కేవలం భక్తి సమాచారం మాత్రమే
🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
➖ /channel/newsttd➖
శ్రీవారి ఆలయంలో
శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమల:
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ‘దీపావళి ఆస్థానాన్ని’ శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు.
👉 ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు.
శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలు అలంకరించినట్టు తెలిపారు.
శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు మాట్లాడుతూ బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించిట్లు వివరించారు.
అంతకుముందు ఆలయంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు.
సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ ఆస్థానంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఎంపి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ మారుతి ప్రసాద్, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డిఎల్వో శ్రీ రెడ్డెప్పరెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు, పేష్కార్ శ్రీ శ్రీహరి, విజివో శ్రీ బాలిరెడ్డి, ముఖ్య అర్చకులు శ్రీ కిరణ్ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/
🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
➖ /channel/newsttd➖
2022 శ్రీవారి
సాలకట్ల బ్రహ్మోత్సవాలు
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమల:
■ గరుడ వాహనంపై శ్రీ మలయప్ప సాక్షాత్కారం.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ కోలాహలంగా సాగింది. అన్ని గ్యాలరీల వద్ద స్వామివారిని అటు ఇటు తిప్పుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
🦅 గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం. 🦅
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.
అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
కాగా, బ్రహ్మోత్సవాలలో
◆ ఆరో రోజైన ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు హనుమంత వాహనం,
◆ సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథం,
◆ రాత్రి 7 నుండి 9 గంటల వరకు గజవాహనంపై శ్రీవారు భక్తులను కటాక్షించనున్నారు.
👉 ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్, ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు అధికారులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/
🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
➖ /channel/newsttd➖
2022 శ్రీవారి
సాలకట్ల బ్రహ్మోత్సవాలు
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమల:
■ గజ వాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు గజ వాహనంపై భక్తులను కటాక్షించారు.
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
★ గజ వాహనం –
కర్మ విముక్తి రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది.
ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.
👉 ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ధర్మారెడ్డి దంపతులు, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ సనత్ కుమార్, శ్రీ నందకుమార్, శ్రీ మారుతీ ప్రసాద్, శ్రీ రాములు, జెఈవోలు శ్రీ మతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/
/channel/newsttd
*జూన్-2024 నెలలో తిరుమల మరియు తిరుపతికి జనరల్ శ్రీవారి సేవ యొక్క ఆన్‌లైన్ కోటా 27.03.2024న ఉదయం 11 గంటలకు విడుదల.*
👉 *నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు* మరియు
👉 *పరకామణి సేవ తిరుమల కోసం మధ్యాహ్నం 1 గంటలకు విడుదల చేయబడుతుంది.*
🎯 *ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారానే శ్రీవారి సేవకులకు ఆలయ విధులు కేటాయిస్తున్నారు.*
https://whatsapp.com/channel/0029VaQWQRGL7UVWKZa2f23u/147
*గమనిక:*
ప్రతి బృందం ఆలయ విధులను పొందడం తప్పనిసరి కాదు.
🕉️ నేడు *తిరుమల స్వామివారి ఉచిత దర్శనము టిక్కెట్స్ వివరాలు.*
21.03.2024
👇👇👇
/channel/newsttd
👇👇👇👇
https://whatsapp.com/channel/0029VaQWQRGL7UVWKZa2f23u/138
🕉️ తిరుమల స్వామివారి ఉచిత దర్శనము టిక్కెట్స్ వివరాలు. ప్రతీ రోజు మీకు కావాలా ?
👇👇👇
/channel/newsttd
👇👇👇👇
https://whatsapp.com/channel/0029VaQWQRGL7UVWKZa2f23u/125
🕉️ నేడు *తిరుమల స్వామివారి ఉచిత దర్శనము టిక్కెట్స్ వివరాలు.*
10.03.2024
👇👇👇
/channel/newsttd
👇👇👇👇
https://whatsapp.com/channel/0029VaQWQRGL7UVWKZa2f23u/123
🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
➖ /channel/newsttd➖
🕉 *వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
🕉 *గరుడ వాహనంపై అమ్మవారి దర్శనం*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుపతి :
తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి.
■ ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు.
■ మధ్యాహ్నం 3.30 నుండి 5 గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు.
👉 ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.
■ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. పుష్కరిణిలో తెప్పపై అమ్మవారు ఏడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.
👉 ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, డిఎల్ వో శ్రీ వీర్రాజు దంపతులు, ఏఈవో శ్రీ రమేష్, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరిండెంట్ శ్రీ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్ పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/
🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
➖ /channel/newsttd➖
🕉 *గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి రాజసం*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుపతి :
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి స్వామివారు విశేషమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శమిచ్చారు.
బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది.
వాహన సేవలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ గోవింద రాజన్, విజివో శ్రీ మనోహర్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/
🕉 ముక్కకోటి ఏకాదశి విశిష్టతను తప్పకుండా తెలుసుకోండి.
https://youtu.be/I1pUmz0G_vY
TTD సమాచారం కోసం ఈ లింక్
/channel/newsttd
👉 మీకు నచ్చితేనే లైక్ చేయఁడి.
👉 చానల్ ని సబ్స్క్రయిబ్ చెయ్యండి.
🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
➖ /channel/newsttd➖
2022 శ్రీవారి
సాలకట్ల బ్రహ్మోత్సవాలు
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమల:
■ స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడి విహారం.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా...
6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ.., భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించాడు.
◆ దాసభక్తుల నృత్యాలతోను,
◆ భజనబృందాల కోలాహలం,
◆ మంగళవాయిధ్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణరథన్ని లాగారు.
శ్రీవారికి శ్రీ భూదేవులు ఇరుప్రక్కలా ఉన్నారు.
శ్రీదేవి(లక్ష్మి) సువర్ణమయి.
ఆమే బంగారు కాగా – ఆమెను భరించే స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందం.
బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది.
బంగారం మహా శక్తిమంతమైన లోహం.
స్వామివారికి కృష్ణావతారంలో దారుకుడు సారథి, శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనేవి నాల్గు గుర్రాలు.
శ్రీవారి ఇల్లు బంగారం, ఇల్లాలు బంగారం, ఇంట పాత్రలు, సింహాసనం బంగారుది, కావున స్వర్ణరథం శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది.
‘స్వర్ణ’ మంటే ‘బాగా ప్రకాశించేది’ అని వ్యుత్పత్తి.
స్వర్ణం లభించేది భూమి నుండే. కనుక ఇరువైపులా శ్రీదేవి, భూదేవీ ఉండగా శ్రీవారుమధ్యలో ఉండి, స్వర్ణరథంలో ఊరేగడం – స్వామివారి మహోన్నతినీ, సార్వభౌమత్వాన్నీ, శ్రీసతిత్వాన్నీ, భూదేవీనాథత్వాన్నీ సూచిస్తూంది.
ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్త ధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయి.
👉 ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ధర్మారెడ్డి దంపతులు, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ సనత్ కుమార్, శ్రీ నందకుమార్, శ్రీ మారుతీ ప్రసాద్, జెఈవోలు శ్రీ మతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/
🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
➖ /channel/newsttd➖
🕉 *ఆగస్టులో తిరుమలలో విశేష పర్వదినాలు*
➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమల:
■– ఆగస్టు 1న శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు చేస్తారు.
■– ఆగస్టు 2న గరుడపంచమి, శ్రీవారి గరుడోత్సవం.
■– ఆగస్టు 6న శ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి.
■– ఆగస్టు 9న నారాయణగిరిలో ఛత్రస్థాపనం.
■– ఆగస్టు 8 నుండి 10వ తేదీ వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు.
■– ఆగస్టు 11న శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ, శ్రీ విఖనస మహాముని జయంతి.
■– ఆగస్టు 12న శ్రీ హయగ్రీవ జయంతి, శ్రీవారు విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేపు.
■– ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం.
■– ఆగస్టు 19న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం.
■– ఆగస్టు 20న శ్రీవారి ఆలయం వద్ద ఉట్లోత్సవం.
■– ఆగస్టు 29న బలరామ జయంతి.
■– ఆగస్టు 30న వరాహ జయంతి.
■– ఆగస్టు 31న వినాయక చవితి.
*Dept.Of PRO TTD*
/channel/ttdnews
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.*
👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/